బెంగళూరు స్టార్టప్ సంచలనం: స్పేస్‌ఎక్స్ తరహా రీయూజబుల్ 'EVEREST' రాకెట్ ఇంజిన్ ఆవిష్కరణ
భారత అంతరిక్ష రంగంలో ఆస్ట్రోబేస్ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలి ప్రైవేట్ పునర్వినియోగ రాకెట్ ఇంజిన్ 'EVEREST'ను బెంగళూరులో ఘనంగా ఆవిష్కరించింది.

Published : August 8, 2026 at 5:36 PM IST
Bengaluru: దేశీయ అంతరిక్ష ప్రయోగ రంగంలో ఒక కీలక మైలురాయి ఆవిష్కృతమైంది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్ "EVEREST" అనే అత్యాధునిక రాకెట్ ఇంజిన్‌ను శుక్రవారం ఆవిష్కరించింది. ఇది భారతదేశపు తొలి పూర్తి స్థాయి అనుసంధానిత FFSC (Full-Flow Staged Combustion) ఇంజిన్. లిక్విడ్ ఆక్సిజన్, మీథేన్ (LOX-Methane) ఇంధనంతో నడిచే ఈ ఇంజిన్.. 800 kN (కిలోన్యూటన్ల) థ్రస్ట్‌ను ఉత్పత్తి చేయగలదని కంపెనీ చెబుతోంది.
థ్రస్ట్ అంటే?: రాకెట్‌ను భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటుకుని ఆకాశంలోకి దూసుకెళ్లేలా కింద నుంచి పైకి నెట్టే "బలం" లేదా "శక్తి" (Pushing Force).
ఇకపోతే ఈ "EVEREST" ఇంజిన్‌తో ప్రొపల్షన్, తయారీ, పరీక్షలు, ప్రయోగ మౌలిక సదుపాయాలతో కూడిన పూర్తిస్థాయి వెర్టికల్ ఇంటిగ్రేటెడ్ 'లాంఛ్ ఎకోసిస్టమ్'లోకి ఆస్ట్రోబేస్ అడుగుపెట్టింది. సంస్థ ఏటా 50 ఇంజిన్‌ల వరకు ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. దీని ద్వారా మొదటి దశలో 100 టన్నుల ప్రయోగ సామర్థ్యాన్ని, రెండో దశలో 1000 టన్నులకు పైగా సామర్థ్యాన్ని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
లిక్విడ్ ఆక్సిజన్, మీథేన్ ఇంధనంతో పనిచేసే ఈ 800 kN ఇంజిన్‌ను పునర్వినియోగ మీడియం-లిఫ్ట్ రాకెట్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. తొలి కక్ష్యా ప్రయోగానికి ముందు దాదాపు 20 ఇంజిన్లను వరుస పరీక్షలకు గురిచేయాలని ఆస్ట్రోబేస్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా భవిష్యత్తులో ఆర్డర్ లభించిన 15 రోజుల్లోనే రాకెట్‌ను ప్రయోగించే 'లాంఛ్-ఆన్-డిమాండ్' సామర్థ్యాన్ని సాధించాలని సంస్థ భావిస్తోంది.
పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇన్-హౌస్‌లో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్‌లో తదుపరి కీలక మైలురాయి పూర్తిస్థాయి ఇంజిన్ 'హాట్-ఫైర్ టెస్ట్'. ఈ పరీక్ష విజయవంతమైన అనంతరం ఇంజిన్‌ను రాకెట్‌కు అనుసంధానించి కక్ష్యా ప్రయోగానికి సమాయత్తం చేయనున్నారు.
| ఆస్ట్రోబేస్ రాకెట్ కీలక వివరాలు | |
|---|---|
| ఇంజిన్ | EVEREST - 800 kN థ్రస్ట్ ఇంధనం: ద్రవ ఆక్సిజన్, మీథేన్ సాంకేతికత: ఫుల్-ఫ్లో స్టేజ్డ్ కంబషన్ (FFSC) |
| ప్రయోగ వాహనం | పునర్వినియోగ మీడియం-లిఫ్ట్ |
| వార్షిక ఉత్పత్తి | గరిష్ఠంగా 50 ఇంజిన్లు |
| ప్రయోగ సామర్థ్య లక్ష్యం | ఫేజ్ 1: సంవత్సరానికి 100 టన్నులు ఫేజ్ 2: సంవత్సరానికి 1,000+ టన్నులు |
| టెస్టింగ్ | తొలి కక్ష్య ప్రయోగానికి ముందు 20 ఇంజిన్ల పరీక్ష |
| రీయూజబిలిటీ | ఒక ఇంజిన్ 100+ సార్లు వినియోగం |
| ప్రయోగ ఫ్రీక్వెన్సీ లక్ష్యం | 15 రోజుల వ్యవధిలో లాంఛ్-ఆన్-డిమాండ్ |
| టైమ్‌లైన్ | 2026: పూర్తిస్థాయి ఇంజిన్ హాట్-ఫైర్ టెస్ట్ 2028 డిసెంబర్: తొలి ప్రయోగం లక్ష్యం |
| తయారీ & అభివృద్ధి | పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అధునాతన తయారీ సౌకర్యాలతో అభివృద్ధి |
ఈ ప్రతిష్టాత్మక ఇంజిన్ ఆవిష్కరణా కార్యక్రమానికి IN-SPACe టెక్నికల్ డైరెక్టరేట్ సైంటిస్ట్ & డైరెక్టర్ రాజీవ్ జ్యోతి, ఆస్ట్రోబేస్ సహ వ్యవస్థాపకుడు దేవకుమార్ T, ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు & CEO నీరజ్ ఖండేల్వాల్తో పాటు భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్, ISRO వ్యోమగామి శుభాంశు శుక్లా హాజరయ్యారు.
కార్యక్రమం అనంతరం శుక్లా 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు. అంతరిక్షంలోకి సులభంగా, అవసరమైనప్పుడు తక్షణ ప్రయోగాలను చేపట్టేందుకు వీలుగా భారతదేశానికి స్వయం సమృద్ధిగల రాకెట్లు, అధునాతన ప్రొపల్షన్ వ్యవస్థలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అలాగే ఇస్రో, ప్రైవేట్ కంపెనీల మధ్య సహకారం దేశ అంతరిక్ష సామర్థ్యాలను, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని మరింత బలోపేతం చేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
| Components and Challenges of Engine Development | |
|---|---|
| Turbopump | Handles about 5 MW of power while operating in a high-density, high-pressure liquid oxygen environment, making it one of the most difficult components to develop. |
| Turbines and metallurgy | Developing the turbines and addressing complex metallurgical challenges were among the biggest hurdles. |
| Liquid oxygen environment | Highly reactive liquid oxygen can cause metals to ignite and burn in high-pressure, oxygen-rich conditions, requiring advances in design, materials and manufacturing for safe operation. |

