ETV Bharat / technology

ఇక గూగుల్ వాలెట్‌లోనే ఆధార్- ఫిజికల్ కార్డు అవసరం లేదు!

గూగుల్ వాలెట్‌లో ఆధార్‌ ID: ఇక PVR నుంచి వీసా వరకు వెరిఫికేషన్ ఈజీ- ఎలా యాడ్ చేయాలంటే?

You Can Now Add Digital Aadhaar Card In Google Wallet To Verify Identity In Person And Online
You Can Now Add Digital Aadhaar Card In Google Wallet To Verify Identity In Person And Online (Photo Credit- Google Blog)
author img

By ETV Bharat Tech Team

Published : April 28, 2026 at 5:20 PM IST

|

Updated : April 28, 2026 at 5:28 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: గూగుల్ తన వాలెట్ యాప్ ఇప్పుడు భారతదేశంలో ఆధార్ వెరిఫైబుల్ క్రెడెన్షియల్స్‌కు మద్దతు ఇస్తుందని ప్రకటించింది. అంటే ఇకపై వినియోగదారులు తమ డివైజ్‌లలోని గూగుల్ వాలెట్‌లో ఆధార్ కార్డును డిజిటల్ IDగా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ప్రత్యక్షంగా, ఆన్‌లైన్ సేవల్లో గుర్తింపు ధృవీకరణ కోసం ఉపయోగించుకోవచ్చు. అధికారిక ఆధార్ యాప్‌లాగే, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేసిన చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రంగా ఫిజికల్ కార్డుకు బదులుగా గూగుల్ వాలెట్‌లోని ఆధార్‌ను వాడుకోవచ్చు. అంతేకాకుండా, ఆధార్ ధృవీకరణకు మద్దతు ఉన్న చోట్ల ఈ డిజిటల్ ID ద్వారా వినియోగదారులు తమ గుర్తింపును నిరూపించుకోవచ్చు.

అయితే గూగుల్ వాలెట్ ధృవీకరణ ప్రస్తుతం ఎంపిక చేసిన భాగస్వాములతో మాత్రమే పనిచేస్తుందని గూగుల్ తెలిపింది. వాటిలో ఇవి ఉన్నాయి:

  • PVR INOX - వయస్సు ధృవీకరణ కోసం
  • BharatMatrimony - ప్రొఫైల్ వెరిఫికేషన్ కోసం
  • Atlys - అంతర్జాతీయ వీసా దరఖాస్తులను ఆటో-ఫిల్ చేయడం కోసం

ఇంకా డెలివరీ, సర్వీస్ సిబ్బంది వెరిఫికేషన్‌ను సురక్షితం చేయడానికి Mygateతో, అలాగే గిగ్ ఎకానమీ సర్వీస్ ప్రొవైడర్ల కోసం Snabbitకు మద్దతును జోడించడంపై కూడా గూగుల్ కృషి చేస్తోంది.

ముఖ్యంగా ఇటీవలే జనవరిలో UIDAI, గూగుల్ మధ్య భాగస్వామ్య ప్రకటన వెలువడింది. ఇప్పుడు గూగుల్ వాలెట్​లో ఈ కొత్త ఫీచర్​ను ఈ భాగస్వామ్యం ఆధారంగానే రూపొందించారు. ఇది కొన్ని నెలల క్రితం UIDAI ప్రారంభించిన ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ ప్రోటోకాల్ అయిన ఆధార్ వెరిఫైయబుల్ క్రెడెన్షియల్స్‌ను ఉపయోగిస్తుంది. అలాగే ఫిజికల్, ఆన్‌లైన్ ధృవీకరణ కోసం UIDAI సొంత Aadhaar యాప్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

గూగుల్ వాలెట్​కు ఆధార్ కార్డ్​ను ఎలా జోడించాలి?:

అధికారిక Aadhaar యాప్ ద్వారా గానీ, లేదా నేరుగా Google Wallet అప్లికేషన్ ద్వారా గానీ మీరు మీ ఆధార్ కార్డ్​ను గూగుల్ వాలెట్​కు జోడించుకోవచ్చు.

మీ ఫోన్‌లో ఇప్పటికే ఆధార్ కార్డ్ యాప్ ఇన్‌స్టాల్ చేసి ఉంటే:

  • 1. అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి.
  • 2. మీరు సైన్ ఇన్ అయ్యారని నిర్ధారించుకోండి.
  • 3. ఆపై మీ గుర్తింపును ధృవీకరించుకోండి.
  • 4. తర్వాత 'Add to Wallet'పై క్లిక్ చేయండి.
  • 5. ఇప్పుడు 'Google Wallet'ను ఎంచుకోండి.
  • 6. అనంతరం 'Continue' పై ట్యాప్ చేయండి.
  • 7. ఇప్పుడు ఆధార్‌ను వాలెట్‌కు జోడించేందుకు స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించాల్సి ఉంటుంది.

ఈ విధంగా కాకుండా నేరుగా గూగుల్ వాలెట్ యాప్ ద్వారానే యాడ్ చేయాలంటే:

మీరు గూగుల్ వాలెట్ అప్లికేషన్‌ను ఓపెన్ చేసి, '+' ఐకాన్‌పై క్లిక్ చేసి Aadhaar ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

మీ ఫోన్‌లో ఇప్పటికే ఆధార్ యాప్ ఉంటే, మీరు ప్లే స్టోర్‌కు రీడైరెక్ట్ అవుతారు. ఒకవేళ యాప్ లేకపోతే, స్క్రీన్ ప్లే స్టోర్‌కు మళ్లిస్తుంది. అక్కడ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక, గూగుల్ వాలెట్‌కు ఆధార్‌ను యాడ్ చేసే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.

గమనిక: ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి మీ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 9 లేదా దాని తదుపరి వెర్షన్​పై రన్ అవుతూ ఉండాలి.

Last Updated : April 28, 2026 at 5:28 PM IST