పిక్సెల్ వాచ్ 5, పిక్సెల్ ట్యాగ్ లాంఛ్- బడ్స్ ప్రో 2లో కొత్తగా 'ఆలివ్ గ్రీన్' కలర్ ఆప్షన్
గూగుల్ "పిక్సెల్ వాచ్ 5'తో పాటు 'పిక్సెల్ ట్యాగ్'ను ప్రారంభించింది. అలాగే, ఇప్పటికే ఉన్న"పిక్సెల్ బడ్స్ ప్రో 2" కోసం సాఫ్ట్‌వేర్ అప్డేట్లతో పాటు సరికొత్త ఆలివ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.

Published : August 13, 2026 at 2:00 PM IST
Hyderabad: గూగుల్ "పిక్సెల్ 11" సిరీస్ స్మార్ట్ఫోన్లతో పాటు "పిక్సెల్ వాచ్ 5", తన తొలి బ్లూటూత్ ట్రాకర్ "పిక్సెల్ ట్యాగ్"ను అధికారికంగా విడుదల చేసింది. న్యూయార్క్ నగరంలో జరిగిన "మేడ్ బై గూగుల్ 2026" కార్యక్రమంలో ఈ పరికరాలను ఆవిష్కరించారు. అలాగే, ఈ టెక్ దిగ్గజం ఇప్పటికే ఉన్న "పిక్సెల్ బడ్స్ ప్రో 2", "పిక్సెల్ బడ్స్ 2a" కోసం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ప్రవేశపెట్టింది. అదనంగా, "పిక్సెల్ బడ్స్ ప్రో 2" కోసం కొత్త ఆలివ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌ను కూడా ప్రవేశపెట్టింది.
పిక్సెల్ వాచ్ 5 కీలక ఫీచర్లు, స్పెసిఫికేషన్లు: పిక్సెల్ వాచ్ 5లో 3,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ గల AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ W5 జెన్ 2 యాక్సిలరేటెడ్ చిప్‌సెట్, మరింత లోతైన జెమిని ఇంటిగ్రేషన్, సింగిల్ ఛార్జ్‌పై 40 గంటల వరకు బ్యాటరీ లైఫ్ లభిస్తుంది.
Google #PixelWatch 5 helps make a healthier you.*
— Made by Google (@madebygoogle) August 12, 2026
📊 Track fitness metrics
⛑️ Health Guardian features track key health trends*
💎 A scratch-resistant display
💫 41mm & 45mm sizing
*See video for more & get yours: https://t.co/p79kvi7xJg #MadeByGoogle pic.twitter.com/njRqT319SO
డిస్‌ప్లే: ఇది రెండు డిస్‌ప్లే పరిమాణాలలో లభిస్తుంది. అవి:
- 41mm
- 45mm
వీటిలో 41mm వేరియంట్ ధర రూ. 42,900. ఇది నాలుగు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
- పాలిష్డ్ సిల్వర్ అల్యూమినియం కేస్ / ఫాగ్ యాక్టివ్ బ్యాండ్
- షాంపైన్ గోల్డ్ అల్యూమినియం కేస్ / కాన్యన్ యాక్టివ్ బ్యాండ్
- సాటిన్ పైరైట్ అల్యూమినియం కేస్ / ఆలివ్ యాక్టివ్ బ్యాండ్
- మ్యాట్ బ్లాక్ అల్యూమినియం కేస్ / అబ్సిడియన్ యాక్టివ్ బ్యాండ్
ఇక 45mm మోడల్ ధర రూ. 45,900. దీన్ని మూడు కలర్ వేరియంట్లలో తీసుకొచ్చారు.
Introducing Health Guardian features in the @GoogleHealth app, designed to give you a better understanding of subtle shifts in your data over time.
— Google (@Google) August 12, 2026
By working quietly in the background 24/7, Health Guardian features can track usually invisible health and wellness indicators,… pic.twitter.com/stj2aoxgZI
- పాలిష్డ్ సిల్వర్ అల్యూమినియం కేస్ / ఫాగ్ యాక్టివ్ బ్యాండ్
- సాటిన్ పైరైట్ అల్యూమినియం కేస్ / ఆలివ్ యాక్టివ్ బ్యాండ్
- మ్యాట్ బ్లాక్ అల్యూమినియం కేస్ / అబ్సిడియన్ యాక్టివ్ బ్యాండ్
అంతర్జాతీయ మార్కెట్‌లో, పిక్సెల్ వాచ్ 5 'స్టీఫెన్ కర్రీ స్పెషల్ ఎడిషన్' (Stephen Curry Special Edition)లో కూడా అందుబాటులో ఉంది. దీనికి 'పెర్ఫార్మెన్స్ లూప్ బ్యాండ్' ఉంటుంది. దీని ధర USD 579 (సుమారు రూ. 55,000).
పిక్సెల్ ట్యాగ్ వివరాలు: పిక్సెల్ ట్యాగ్ విషయానికొస్తే, ఒక యూనిట్ ప్యాక్ ధర రూ. 3,799 కాగా, నాలుగు యూనిట్ల ప్యాక్ ధర రూ. 12,900. ఇది కేవలం 'ఫాగ్' (Fog) రంగులో మాత్రమే లభిస్తుంది.
Introducing Google Pixel Tag, our first-ever finder tag. Attach it to your keys or slip it into your luggage to easily find the things you need, whether they’re near or far, right in Find Hub. pic.twitter.com/wN7HNI19BI
— Google (@Google) August 12, 2026
సేల్ వివరాలు: పిక్సెల్ వాచ్ 5, పిక్సెల్ ట్యాగ్ ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే Google Store ద్వారా ప్రారంభమయ్యాయి. వీటిలో స్మార్ట్‌వాచ్ సేల్స్ ఆగస్టు 20 నుంచి కొనుగోలుకు అందుబాటులోకి రానుండగా, బ్లూటూత్ ట్రాకర్ మాత్రం నవంబర్ 2026లో అమ్మకానికి రానుంది.
| డివైజ్ | వేరియంట్లు | ధరలు |
| పిక్సెల్ వాచ్ 5 | 41mm | రూ. 42,900 |
| 45mm | రూ. 45,900 | |
| పిక్సెల్ ట్యాగ్ | Pack of 1 | రూ. 3,799 |
| Pack of 3 | రూ. 12,900 |
పిక్సెల్ బడ్స్ 2 ప్రో, బడ్స్ 2a ధరలు, కలర్ ఆప్షన్లు: పిక్సెల్ బడ్స్ ప్రో 2 ధర ఇంకా రూ. 22,900గానే ఉండగా, పిక్సెల్ బడ్స్ 2a ధర రూ. 12,999గా ఉంది.
Pixel Buds are getting even better with new features, plus a new Olive finish for Pixel Buds Pro 2. Here’s what’s new:
— Google (@Google) August 12, 2026
🔊 Enhanced ANC: Automatically adjusts to keep the noise out if your buds have subtle shifts
🗣️ Gemini Audio Control: Try saying, " hey google, turn up the bass"… pic.twitter.com/Z4RKjE5zcT
మొదటి రకం ఇయర్‌బడ్స్ పోర్సిలిన్(Porcelain), ఆలివ్ (Olive), పియోనీ (Peony), హాజెల్ (Hazel) రంగులలో లభిస్తాయి. రెండో రకం ఇయర్‌బడ్స్ ఫాగ్ (Fog), బెర్రీ (Berry), ఐరిస్ (Iris), హాజెల్ (Hazel) రంగులలో అందుబాటులో ఉంటాయి.

