గూగుల్ 'పిక్సెల్ 11' సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయ్- ధర, ఫీచర్లతో పాటు ఆఫర్ల వివరాలు ఇవే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గూగుల్ "పిక్సెల్ 11" సిరీస్ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. న్యూయార్క్ నగరంలో జరిగిన "మేడ్ బై గూగుల్ 2026" ఈవెంట్లో కంపెనీ ఈ లైనప్‌లో నాలుగు మోడళ్లను ప్రారంభించింది.

Published : August 13, 2026 at 9:45 AM IST
Hyderabad: గూగుల్ తన పిక్సెల్ లైనప్‌కు నెక్స్ట్-జనరేషన్ "పిక్సెల్ 11" సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌తో సహా గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ లైనప్‌లో కంపెనీ "పిక్సెల్ 11", "పిక్సెల్ 11 ప్రో", "పిక్సెల్ 11 ప్రో XL", "పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్" అనే నాలుగు మోడళ్లను విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్లన్నీ గూగుల్ లేటెస్ట్ టెన్సర్ G6 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. వీటి ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.
గూగుల్ పిక్సెల్ 11 సిరీస్: ధర, లభ్యత, ఆఫర్లు
Missed #MadeByGoogle? Watch the full event here 👇https://t.co/xooz5N55P4
— Made by Google (@madebygoogle) August 13, 2026
బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్ అయిన "పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్" మినహా, అన్ని పిక్సెల్ 11 సిరీస్ పరికరాలు రెండు RAM & స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తాయి.
1. గూగుల్ పిక్సెల్ 11 వేరియంట్లు:
- 12GB RAM + 256GB స్టోరేజ్
- 12GB RAM + 512GB స్టోరేజ్
వేరియంట్ల వారీగా దీని ధరలు:
- 12GB RAM + 256GB స్టోరేజ్ ధర: రూ. 89,999
- 12GB RAM + 512GB స్టోరేజ్ ధర: రూ. 1,04,999
కలర్ ఆప్షన్లు: ఈ "గూగుల్ పిక్సెల్ 11" మోడల్ నాలుగు రంగులలో లభిస్తుంది.
- పిస్టాషియో (Pistachio)
- ఫ్రాస్ట్ (Frost)
- హిబిస్కస్ (Hibiscus)
- అబ్సిడియన్ (Obsidian)
2. గూగుల్ పిక్సెల్ 11 ప్రో వేరియంట్లు:
- 12GB RAM + 256GB స్టోరేజ్
- 12GB RAM + 512GB స్టోరేజ్
వేరియంట్ల వారీగా దీని ధరలు:
- 12GB RAM + 256GB స్టోరేజ్ ధర: రూ. 1,19,999
- 12GB RAM + 512GB స్టోరేజ్ ధర: రూ. 1,34,999
కలర్ ఆప్షన్లు: ఈ మోడల్ నాలుగు విభిన్న రంగులలో అందుబాటులో ఉంటుంది.
- క్యాన్యన్ (Canyon)
- ఆలివ్ (Olive)
- ఫాగ్ (Fog)
- అబ్సిడియన్ (Obsidian)
3. గూగుల్ పిక్సెల్ 11 ప్రో XL వేరియంట్లు:
- 12GB RAM + 256GB స్టోరేజ్
- 16GB RAM + 512GB స్టోరేజ్
వేరియంట్ల వారీగా దీని ధరలు:
- 12GB RAM + 256GB స్టోరేజ్ ధర: రూ. 1,34,999
- 16GB RAM + 512GB స్టోరేజ్ ధర: రూ. 1,49,999
కలర్ ఆప్షన్లు: ఇదీ నాలుగు విభిన్న రంగులలో అందుబాటులో ఉంటుంది.
- క్యాన్యన్ (Canyon)
- ఆలివ్ (Olive)
- ఫాగ్ (Fog)
- అబ్సిడియన్ (Obsidian)
4. పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ వేరియంట్లు: కంపెనీ ఫోల్డ్ మోడల్‌ను కేవలం ఒకే ఒక 16GB RAM + 512GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో విడుదల చేసింది. దీని ధరను రూ. 1,86,999గా నిర్ణయించింది. ఇది కేవలం ఆలివ్ (Olive)రంగులో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
| మోడల్ | కాన్ఫిగరేషన్ | ధర |
| పిక్సెల్ 11 | 12GB + 256GB | రూ. 89,999 |
| 16GB + 512GB | రూ. 1,04,999 | |
| పిక్సెల్ 11 ప్రో | 12GB + 256GB | రూ. 1,19,999 |
| 16GB + 512GB | రూ. 1,34,999 | |
| పిక్సెల్ 11 ప్రో XL | 12GB + 256GB | రూ. 1,34,999 |
| 16GB + 512GB | రూ. 1,49,999 | |
| పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ | 16GB + 512GB | రూ. 1,86,999 |
సేల్ వివరాలు: ప్రస్తుతం, ఈ నాలుగు మోడళ్లూ Google Store ద్వారా ప్రీ-ఆర్డర్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. వీటి సేల్స్ 2026 ఆగస్టు 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆసక్తి ఉన్నకస్టమర్లు Google Store, Flipkart, ఇతర అధీకృత రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.
ఆఫర్ల వివరాలు: లాంఛ్ ఆఫర్లలో భాగంగా, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు రూ. 10,000 తక్షణ తగ్గింపును కంపెనీ అందిస్తోంది. అంతేకాకుండా, 24 నెలల వరకు 'నో-కాస్ట్ EMI' (వడ్డీ లేని వాయిదాల పద్ధతి), రూ. 9,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు, కొత్త "పిక్సెల్ 11" సిరీస్ ఫోన్‌లతో ఆరు నెలల 'Google AI Pro' సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
1. పిక్సెల్ 11 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
Google #Pixel11 is anything but basic.
— Made by Google (@madebygoogle) August 12, 2026
Designed for Gemini Intelligence*
Upgraded 30x Super Zoom camera*
Hours of power in just a few minutes*
*See video for more & get yours today: https://t.co/Vp68QYXm1A #MadeByGoogle pic.twitter.com/1gugQaDVnr
- డిస్‌ప్లే: ఈ ఫోన్‌లో 6.3 అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120 Hz వరకు రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ (nits) వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో వస్తుంది.
- ప్రాసెసర్: ఇది గూగుల్ సరికొత్త Tensor G6 ప్రాసెసర్, Titan M3 సెక్యూరిటీ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 16GB వరకు LPDDR5X RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది.
- కెమెరా సెటప్: పిక్సెల్ 11 వెనుక భాగంలో మూడు కెమెరాల (triple-rear camera) సెటప్ ఉంది. ఇందులో 48MP మెయిన్ సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10.8MP 5x టెలిఫొటో సెన్సార్ ఉన్నాయి. అలాగే, సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ల కోసం దీని ముందు భాగంలో 10.5MP కెమెరా అమర్చారు.
- బ్యాటరీ: ఈ పరికరం 4,985mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 30W వైర్డ్, 25W Qi 2.2 Pixelsnap వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది.
- IP రేటింగ్: ఇది IP68-రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ (ధూళి, నీటి నిరోధకత) సామర్థ్యాన్ని కలిగి ఉంది.
- ఆపరేటింగ్ సిస్టమ్: ఈ ఫోన్ సరికొత్త Android 17 ఆపరేటింగ్ సిస్టమ్ (OS)తో పనిచేస్తుంది. దీనికి ఏడేళ్లపాటు OS, భద్రత (security), Pixel Drop అప్‌డేట్‌లు అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.
- కొలతలు: ఈ 'బేస్ పిక్సెల్ 11' మోడల్ 152.8mm పొడవు, 72mm వెడల్పు, 8.6mm మందాన్ని కలిగి ఉంటుంది.
- బరువు: దీని బరువు 197 గ్రాములు.
| పిక్సెల్ 11 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు | వివరాలు |
| డిస్‌ప్లే | 120Hz | 6.3-అంగుళాల FHD+ AMOLED |
| ప్రాసెసర్ | టెన్సర్ G6 |
| RAM + స్టోరేజ్ | 12GB + 256GB |
| 16GB + 512GB | |
| రియర్ కెమెరాలు | 48MP (మెయిన్) + 13MP (అల్ట్రా-వైడ్) + 10.8MP (టెలిఫొటో) |
| ఫ్రంట్ కెమెరా | 10.5MP |
| బ్యాటరీ | 4,985mAh |
| ఛార్జింగ్ కెపాసిటీ | 30W (వైర్డ్) | 25W (వైర్‌లెస్) |
| IP రేటింగ్ | IP68 |
| ఆపరేటింగ్ సిస్టమ్ (OS) | ఆండ్రాయిడ్ 17 |
| OS అప్‌గ్రేడ్స్ & సెక్యూరిటీ ప్యాచెస్ | OS upgrades: 7 years Security patches: 7 years Pixel Drop updates: 7 years |
2. పిక్సెల్ 11 ప్రో ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
- డిస్‌ప్లే: ఇందులో 6.3-అంగుళాల 1.5K LTPO AMOLED (2856 x 1280 పిక్సెల్స్) డిస్‌ప్లే ఉంది.
- కెమెరా సెటప్: ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్ & 120x డిజిటల్ జూమ్ సామర్థ్యం గల 48MP టెలిఫొటో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాటింగ్ కోసం ఇందులో 42MP ఫ్రంట్ కెమెరా ఉంది.
- ఆపరేటింగ్ సిస్టమ్: ఇది సరికొత్త Android 17 ఆపరేటింగ్ సిస్టమ్ (OS)తో పనిచేస్తుంది. దీనికి ఏడేళ్లపాటు OS, భద్రత (security), Pixel Drop అప్‌డేట్‌లు లభిస్తాయని కంపెనీ చెబుతోంది.
- బ్యాటరీ: పిక్సెల్ '11 ప్రో'లో 4,840mAh బ్యాటరీని అమర్చారు. ఇది 30W వైర్డ్, 25W Qi 2.2 PixelSnap వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
- IP రేటింగ్: ఇది దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.
- ప్రాసెసర్: ఈ మోడల్లో గూగుల్ సరికొత్త Tensor G6 ప్రాసెసర్, Titan M3 సెక్యూరిటీ చిప్‌సెట్ ఉంటుంది. ఇందులో 16GB వరకు LPDDR5X RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది.
- కొలతలు: దీని పొడవు 152.7mm, వెడల్పు 71.9mm, మందం 8.4mm ఉంటుంది.
- బరువు: ఈ ఫోన్ బరువు 204 గ్రాములు.
3. పిక్సెల్ 11 ప్రో XL ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
- డిస్‌ప్లే: ఈ ఫోన్‌లో 6.8-అంగుళాల QHD+ AMOLED (1344 x 2992 పిక్సెల్స్) డిస్‌ప్లే ఉంటుంది.
- ప్రాసెసర్: ఇందులో గూగుల్ సరికొత్త Tensor G6 ప్రాసెసర్, Titan M3 సెక్యూరిటీ చిప్‌సెట్‌ను అందించారు. ఇది 16GB వరకు LPDDR5X RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
- కెమెరా సెటప్: ఈ హ్యాండ్సెట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5x ఆప్టికల్ జూమ్ & 120x డిజిటల్ జూమ్ సామర్థ్యం గల 48MP టెలిఫొటో సెన్సార్ ఉన్నాయి. ఇందులో 42MP ఫ్రంట్ కెమెరా ఉంది.
- ఆపరేటింగ్ సిస్టమ్: ఇది సరికొత్త Android 17 ఆపరేటింగ్ సిస్టమ్ (OS)తో పనిచేస్తుంది. దీనికి ఏడేళ్లపాటు OS, భద్రత (security), Pixel Drop అప్‌డేట్‌లు అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.
- బ్యాటరీ: ఈ పిక్సెల్ 11 ప్రో XLలో 5,115mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 30W వైర్డ్, 25W Qi 2.2 PixelSnap వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
- IP రేటింగ్: ఈ ఫోన్ దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది.
- కొలతలు: పొడవు 162.7mm, వెడల్పు 76.5mm, మందం 8.5mm.
- బరువు: దీని ఫోన్ బరువు 226 గ్రాములు ఉంటుంది.
పిక్సెల్ 11 ప్రో వర్సెస్ పిక్సెల్ 11 ప్రో XL: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
From Gemini Intelligence to brand new camera features, explore a few can’t-miss updates from the new Pixel 11 family 🧵 #MadeByGoogle pic.twitter.com/eAJNxPTjKg
— Google (@Google) August 12, 2026
| ఫీచర్లు, స్పెసిఫికేషన్లు | పిక్సెల్ 11 ప్రో | పిక్సెల్ 11 ప్రో XL |
| డిస్‌ప్లే | 120Hz | 6.3-అంగుళాల 1.5K LTPO AMOLED | 120Hz | 6.8-అంగుళాల QHD+ AMOLED |
| ప్రాసెసర్ | టెన్సర్ G6 | |
| RAM + స్టోరేజ్ | 12GB + 256GB | |
| 16GB + 512GB | ||
| రియర్ కెమెరాలు | 50MP (మెయిన్) + 48MP (అల్ట్రా-వైడ్) + 48MP (టెలిఫొటో) | |
| ఫ్రంట్ కెమెరా | 42MP | |
| బ్యాటరీ | 4,840mAh | 5,115mAh |
| ఛార్జింగ్ కెపాసిటీ | 30W (వైర్డ్) | 25W (వైర్‌లెస్) | |
| IP రేటింగ్ | IP68 | |
| ఆపరేటింగ్ సిస్టమ్ (OS) | ఆండ్రాయిడ్ 17 | |
| OS అప్గ్రేడ్లు & సెక్యూరిటీ ప్యాచ్‌లు | OS upgrades: 7 years Security patches: 7 years Pixel Drop updates: 7 years | |
4. పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
Google #Pixel11 Pro Fold opens up a new way to go pro.
— Made by Google (@madebygoogle) August 12, 2026
🌈 HiLight: tune out, stay in the loop
🧠 Gemini Intelligence helps handle simple tasks*
💪 Ultra-durable, 3x as strong*
🔆 Screens are 20% brighter*
*See video for more & get yours today: https://t.co/qDCBrfFvud… pic.twitter.com/Us2LmmKKXV
- డిస్‌ప్లే: ఈ బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌లో 6.5 అంగుళాల కవర్ డిస్‌ప్లే, 8 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే ఉన్నాయి. ఈ రెండు స్క్రీన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 3,600 నిట్స్ (nits) బ్రైట్‌నెస్‌ను అందించే 'Super Actua OLED' ప్యానెల్స్‌తో వస్తాయి. ముఖ్యంగా, దీని ఇన్నర్ స్క్రీన్ అత్యంత పలుచని (ultra-thin) కవర్‌ను కలిగి ఉండగా, కవర్ డిస్‌ప్లే మాత్రం అత్యంత దృఢమైన (ultra-durable) సిరామిక్ కవర్ గ్లాస్‌తో వస్తుంది.
- కొలతలు: ఈ ఫోన్‌ను మడిచినప్పుడు 155.2mm పొడవు, 76mm వెడల్పు, 10.1mm మందాన్ని కలిగి ఉంటుంది. అలాగే తెరిచినప్పుడు దీని కొలతలు 155.2mm పొడవు, 150.4mm వెడల్పు, 5mm మందంగా ఉంటాయి.
- బరువు: దీని బరువు 239 గ్రాములు.
- ప్రాసెసర్: ఈ మోడల్లో గూగుల్ సరికొత్త Tensor G6 ప్రాసెసర్, Titan M3 సెక్యూరిటీ చిప్‌సెట్ ఉంటుంది. ఇది 16GB LPDDR5X RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
- కెమెరా సెటప్: ఈ సిరీస్‌లోని ఇతర ఫోన్‌ల మాదిరిగానే, 'పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్' కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 10.5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 5x వరకు ఆప్టికల్ జూమ్ అలాగే 30x వరకు డిజిటల్ జూమ్ సామర్థ్యం గల 10.8MP టెలిఫొటో కెమెరా ఉన్నాయి. అలాగే, ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో రెండు 10MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఒకటి కవర్ డిస్‌ప్లేపై, మరొకటి లోపలి డిస్‌ప్లేపై అమర్చారు.
- బ్యాటరీ కెపాసిటీ: ఇందులో 4,806mAh బ్యాటరీని అందించారు. ఇది 30W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 25W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
- IP రేటింగ్: ఈ ఫోల్డబుల్ ఫోన్ IP68-రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ (ధూళి, నీటి నిరోధకత) సామర్థ్యాన్ని కలిగి ఉంది.
| ఫీచర్లు, స్పెసిఫికేషన్లు | వివరాలు |
| డిస్‌ప్లే | Cover: 120Hz | 6.5-అంగుళాల Super Actua OLED |
| Inner: 120Hz | 8-అంగుళాల Super Actua OLED | |
| ప్రాసెసర్ | టెన్సర్ G6 |
| RAM + స్టోరేజ్ | 16GB + 512GB |
| రియర్ కెమెరాలు | 48MP (మెయిన్) + 10.5MP (అల్రా-వైడ్) + 10.8MP (టెలిఫొటో) |
| ఫ్రంట్ కెమెరాలు | Cover: 10MP |
| Inner: 10MP | |
| బ్యాటరీ | 4,806mAh |
| ఛార్జింగ్ కెపాసిటీ | 30W (వైర్డ్) | 25W (వైర్‌లెస్) |
| IP రేటింగ్ | IP68 |
| ఆపరేటింగ్ సిస్టమ్ (OS) | ఆండ్రాయిడ్ 17 |
| OS అప్‌గ్రేడ్స్ & సెక్యూరిటీ ప్యాచెస్ | OS upgrades: 7 years Security patches: 7 years Pixel Drop updates: 7 years |

