ETV Bharat / technology

'డిస్కో' AI బ్రౌజర్​ను పరిచయం చేసిన గూగుల్- ఇది ఎలా ఉపయోగపడుతుందంటే?

గూగుల్ నుంచి కొత్త ఏఐ టూల్- ఇది మీకోసం యాప్స్​ను ఎలా సృష్టిస్తుందో తెలుసా?

Meet Google Disco, A New AI Tool That Can Turn Tabs And Prompts Into Custom Apps
Meet Google Disco, A New AI Tool That Can Turn Tabs And Prompts Into Custom Apps (Photo Credit- Google)
author img

By ETV Bharat Tech Team

Published : December 13, 2025 at 5:10 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: వెబ్ బ్రౌజింగ్ అనుభవాన్ని తిరిగి ఆవిష్కరించడమే లక్ష్యంగా గూగుల్ "డిస్కో" అనే కొత్త AI డిస్కవరీ టూల్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఉత్పత్తిలో జెమిని 3-పవర్డ్ జెన్‌ట్యాబ్‌లు (GenTabs) ఉన్నాయి. ఇవి మీ ఓపెన్ ట్యాబ్‌లను కస్టమ్ అప్లికేషన్‌లుగా మార్చగలవు, ఒక అంశాన్ని పరిశోధించడానికి లేదా ట్రిప్‌ను మరింత సమర్థవంతంగా ప్లాన్ చేయడంలో మీకు సహాయపడతాయి. అంటే ఇది మీ క్వైరీ లేదా ప్రాంప్ట్ ఆధారంగా తక్షణమే సంబంధిత ట్యాబ్‌లు తెరిచి, కొన్ని ప్రత్యేక పనుల కోసం కస్టమ్ యాప్స్‌ను కూడా సృష్టిస్తుంది. ఉదాహరణకు మీరు ట్రావెల్‌ టిప్స్ అడిగితే అది ఒక ప్లానర్ యాప్ క్రియేట్ చేసి పెడుతుందన్నమాట.

సంప్రదాయ బ్రౌజింగ్‌కు భిన్నంగా ఉండే ఈ "డిస్కో"ను సంక్లిష్టమైన ఆన్‌లైన్ పనులను సులభతరం చేసేందుకు రూపొందించారు. ఇది వ్యక్తిగతీకరించిన ఇంటరాక్టివ్ యాప్‌లను సృష్టించడానికి మీ ఓపెన్ ట్యాబ్‌లు, చాట్ హిస్టరీని ఉపయోగిస్తుంది. దీని ఇంటరాక్టివ్ ఇంటర్‌ఫేస్ మీ ఓపెన్ ట్యాబ్‌లపై ఆధారపడి ఉన్నప్పటికీ, మీరు సాధారణ టెక్స్ట్ ప్రాంప్ట్‌లను అందించడం ద్వారా వెబ్ యాప్‌కు మరిన్ని ఫీచర్‌లను జోడించుకోవచ్చు.

"Disco అనేది మా కొత్త 'Disco'very వాహనం. దీన్ని రీ-ఇమాజిన్ బ్రైజింగ్, మోడ్రన్ వెబ్​ను నిర్మించడం కోసం రూపొందించాం" అని గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. దీని కోసం పరీక్షిస్తున్న మొదటి ఫీచర్ "GenTabs" అని జోడించింది.

ఇది ఎలా ఉపయోగపడుతుంది?: ఇది మీ సంక్లిష్టమైన పనులను (మీ ఓపెన్ ట్యాబ్‌లు, చాట్ హిస్టరీ ద్వారా) ముందుగానే అర్థం చేసుకుంటుంది. తద్వారా ఆ పనులను పూర్తి చేయడంలో మీకు సహాయపడేందుకు ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్‌లను సృష్టిస్తుంది. ఈ విధంగా వెబ్‌ను నావిగేట్ చేయడంలో "GenTabs" సహాయపడుతుందని గూగుల్ వివరించింది.

వినియోగదారులు తమ ప్రస్తుత పని ఆధారంగా లేదా తమకు అవసరమైన టూల్​ను నేరుగా డిస్క్రైబ్ చేయడం ద్వారా యాప్‌లను సృష్టించుకోవచ్చని గూగుల్ చెబుతోంది. "GenTabs" అప్లికేషన్‌ను రూపొందిస్తుంది, వినియోగదారులు సహజ భాషను ఉపయోగించి దానిని మరింత మెరుగుపరచడానికీ అనుమతిస్తుంది.

గూగుల్ ఇటువంటి యాప్‌లపై అనేక ఉదాహరణలను ప్రదర్శించింది. అందులో మీల్ ప్లానర్‌లు, ట్రిప్ ప్లానర్‌ల నుంచి ఇంటరాక్టివ్ లెర్నింగ్ టూల్స్ వరకు ఉన్నాయి. వినియోగదారుల అవసరాలను బట్టి "GenTabs" చేయగలిగేవి, నిర్మించగలిగేవి ఇంకా చాలానే ఉండొచ్చు. ప్రతి జనరేటివ్ అంశం వెబ్‌కు అనుసంధానమై ఉంటుంది కాబట్టి, ఇది ప్రతిసారీ అసలు మూలాలకు లింక్ చేస్తుందని కూడా గూగుల్ హైలైట్ చేసింది.

"ప్రారంభ పరీక్షకులు ఇప్పటికే జెన్‌ట్యాబ్స్‌ను ఉపయోగించి తమకు నచ్చిన యాప్‌లను సృష్టిస్తున్నారు. మీరు వారం కోసం భోజన ప్రణాళికను రూపొందిస్తున్నా, చెర్రీ పూలను చూడటానికి జపాన్‌కు యాత్రను ప్లాన్ చేస్తున్నా, లేదా మీ ప్రాథమిక పాఠశాల విద్యార్థికి గ్రహాల గురించి నేర్పించడంలో సహాయం చేస్తున్నా, ఈ GenTabs మీరు వెబ్ నుంచి వీలైనంత ఎక్కువ ప్రయోజనాన్ని పొందడంలో సహాయపడుతుంది" అని గూగుల్ పేర్కొంది.

కంపెనీ ప్రస్తుతం ఈ సాధనాన్ని కొంతమందితో పరీక్షిస్తోంది. అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ముందు ఈ ఉత్పత్తిని మెరుగుపరచడం లేదా డిస్కో ఆలోచనలను గూగుల్ భారీ ఉత్పత్తులలో అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డిస్కోను డౌన్‌లోడ్ చేసుకుని "GenTabs"ను ప్రయత్నించేందుకు వినియోగదారులు గూగుల్ ల్యాబ్స్​లోని వెయిట్‌లిస్ట్‌లో చేరాల్సి ఉంటుంది. MacOS వినియోగదారుల సైన్-అప్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.