ETV Bharat / technology

శాంసంగ్ నుంచి 130-అంగుళాల మైక్రో RGB టీవీ- ప్రపంచంలో ఇదే ఫస్ట్!

శాంసంగ్ CES 2026 వేదికగా ప్రపంచంలోనే తొలి 130 అంగుళాల మైక్రో RGB టీవీతో పాటు "గెలాక్సీ బుక్6" సిరీస్​ను ఆవిష్కరించింది.

Samsung Unveils World's First 130-Inch Micro RGB TV And Galaxy Book6 Series at CES 2026
Samsung Unveils World's First 130-Inch Micro RGB TV And Galaxy Book6 Series at CES 2026 (Photo Credit- ETV Bharat via Samsung)
author img

By ETV Bharat Tech Team

Published : January 7, 2026 at 11:24 AM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ ఈవెంట్ అయిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES) యునైటెడ్ స్టేట్స్ (US)లోని నెవాడాలో లాస్ వెగాస్‌లో జరుగుతోంది. జనవరి 6, 2026 నుంచి ప్రారంభమయిన ఈ కార్యక్రమంలో దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ ప్రపంచంలోనే మొట్ట మొదటి "130-అంగుళాల మైక్రో RGB టీవీ"ని ఆవిష్కరించింది. దీనితో పాటు "గెలాక్సీ బుక్6" సిరీస్‌లను కూడా పరిచయం చేసింది. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం రండి.

శాంసంగ్ మైక్రో రెడ్ గ్రీన్ బ్లూ (RGB) టీవీ (దీనిని R95H మోడల్ అని కూడా పిలుస్తారు) ప్రపంచంలోనే మొట్టమొదటి 130-అంగుళాల మైక్రో RGB టీవీ. ఇది "బోల్డ్ న్యూ డిజైన్"తో కంపెనీ అతిపెద్ద మైక్రో RGB డిస్​ప్లే ప్యానెల్‌ను కలిగి ఉంది. అదే సమయంలో "గెలాక్సీ బుక్6" సిరీస్‌లో "గెలాక్సీ బుక్6 అల్ట్రా", "బుక్6 ప్రో", "గెలాక్సీ బుక్6" ల్యాప్‌టాప్‌లు ఉన్నాయి. ఈ పరికరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో పాటు మంచి పనితీరును అందిస్తాయని కంపెనీ చెబుతోంది.

Galaxy Book6 Series
Galaxy Book6 Series (Photo Credit- Samsung)

వరల్డ్ ఫస్ట్ 130-అంగుళాల మైక్రో-RGB టీవీ: ఈ మైక్రో RGB టీవీ టైమ్‌లెస్ ఫ్రేమ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ 130 అంగుళాల భారీ స్క్రీన్​ను​ సాధారణ టీవీలలో మాదిరిగా కాకుండా ఓ పెద్ద కిటికీని తలపించేలా రూపొందించారు. ఇది ఆధునిక, గ్యాలరీ-ప్రేరేపిత సౌందర్యాన్ని అందిస్తుంది. ఈ డిజైన్ తన 2023 టైమ్‌లెస్ గ్యాలరీ డిజైన్ మోడ్రన్ ఎవల్యూషన్ అని శాంసంగ్ పేర్కొంది.

ఈ డిజైన్​ ఒక అద్భుతమైన ఆర్కిటెక్చరల్ విండో నుంచి ప్రేరణ పొందిందని, అది దాని అంచుల మధ్య తేలుతున్నట్లుగా కనిపిస్తుందని పేర్కొంది. ఇక దీని స్పీకర్లను డిస్‌ప్లే ఫ్రేమ్‌లో పొందుపరిచారు. వీటిని పిక్చర్, ఆడియో మధ్య సమతుల్యతను సృష్టించేలా రూపొందించారు. తద్వారా ఇది ఉంచిన ప్రదేశంలో సహజంగా కనెక్ట్ అవుతుంది.

World's first 130-inch micro RGB TV introduced by Samsung at CES 2026.
World's first 130-inch micro RGB TV introduced by Samsung at CES 2026. (Photo Credit- Samsung)

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, మైక్రో RGB టీవీ 130-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది కంపెనీ ఇప్పటివరకు ప్రవేశపెట్టిన అత్యంత అధునాతన మైక్రో RGB ఆవిష్కరణలను కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ టీవీకి మైక్రో RGB AI ఇంజిన్ ప్రో, మైక్రో RGB కలర్ బూస్టర్ ప్రో, మైక్రో RGB HDR ప్రో శక్తిని అందిస్తాయి. ఇవి కృత్రిమ మేధస్సును ఉపయోగించి మసకగా ఉన్న పిక్చర్లను స్పష్టంగా మారుస్తాయి. అంతేకాక అధిక ప్రకాశవంతమైన, చీకటి దృశ్యాల కాంట్రాస్ట్‌ను మెరుగుపరచి సూక్ష్మ వివరాలను కూడా స్పష్టంగా చూపిస్తాయి.

డిస్‌ప్లేలో పిక్చర్ క్వాలిటీని మెరుగుపరిచే పనిని శాంసంగ్ మైక్రో RGB ప్రెసిషన్ కలర్ 100 టెక్నాలజీ చూసుకుంటుంది. ఇది 100 శాతం BT.2020 వైడ్ కలర్ గ్యామట్‌ను అందిస్తుంది. ఈ సాంకేతికత కచ్చితమైన మైక్రో RGB రంగుల ఉత్పత్తిలో వెర్బాండ్ డెర్ ఎలెక్ట్రోటెక్నిక్ (VDE) నుంచి ధృవీకరణ పొందింది. ఈ మైక్రో RGB టీవీలో శాంసంగ్ గ్లేర్ ఫ్రీ టెక్నాలజీ కూడా ఉంది. ఇది ప్రతిబింబాలను తగ్గించి, బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్​పీరియన్స్ కోసం విభిన్న కాంతి పరిస్థితులలో క్లియర్ కలర్, కాంట్రాస్ట్‌ను కాపాడుతుంది.

ఈ టీవీ HDR10+ అడ్వాన్స్‌డ్, ఎక్లిప్సా ఆడియోకు మద్దతు ఇస్తుంది. ఇది మెరుగైన పిక్చర్, సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. ఇందులో విజన్ AI కంపానియన్ ఉంది. ఇది కన్వర్జేషన్ సెర్చ్, ప్రోయాక్టివ్ రికమండేషన్లు, AI ఫుట్‌బాల్ మోడ్ ప్రో, AI సౌండ్ కంట్రోలర్ ప్రో, లైవ్ ట్రాన్స్‌లేట్, జనరేటివ్ వాల్‌పేపర్ వంటి AI ఫీచర్‌ల యాక్సెస్‌ను అనుమతిస్తుంది. ఇది మైక్రోసాఫ్ట్ కోపైలట్, పెర్ప్లెక్సిటీ వంటి AI అసిస్టెంట్‌లను కూడా కలిగి ఉంటుంది.