ETV Bharat / technology

బోట్ నుంచి​ 'క్రోమ్ ఐరిస్' స్మార్ట్​వాచ్- ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 5 రోజులు వినియోగించుకోవచ్చు!

భారత మార్కెట్లో 1.32-అంగుళాల AMOLED డిస్​ప్లేతో బోట్ క్రోమ్ ఐరిస్ స్మార్ట్​వాచ్​ ప్రారంభమయింది. ఇది 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్​తో పాటు ఆరోగ్య పర్యవేక్షణ కోసం అనేక ఫీచర్లను అందిస్తుంది.

Boat Chrome Iris Launched in India With 1.32-Inch AMOLED Display
Boat Chrome Iris Launched in India With 1.32-Inch AMOLED Display (Image credit: boAt)
author img

By ETV Bharat Tech Team

Published : February 10, 2026 at 2:35 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: ప్రముఖ వేరబుల్ టెక్నాలజీ కంపెనీ బోట్ నిన్న (ఫిబ్రవరి 9) మూడు డాష్‌క్యామ్ మోడళ్లను విడుదల చేసి ఆడియో, వేరబుల్ డివైజ్​లను దాటి కారులో భద్రతా పరికరాల రంగంలోకి అడుగుపెట్టింది. వీటితో పాటు కంపెనీ "క్రోమ్ ఐరిస్" పేరుతో ఒక స్మార్ట్‌వాచ్‌ను కూడా విడుదల చేసింది. ఈ కొత్త వాచ్ అత్యంత ప్రత్యేక ఫీచర్ 1000 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశంతో AMOLED డిస్‌ప్లేతో జతయిన అల్ట్రా-స్లిమ్ మెటల్ బాడీ.

కంపెనీ ఈ స్మార్ట్‌వాచ్‌ను లైట్​వెయిట్ మ్యానర్​లో రూపొందించింది. ఈ "క్రోమ్ ఐరిస్‌"లో హెల్త్ మానిటరింగ్, ఫిట్‌నెస్ ట్రాకింగ్, ఫిమేల్ వెల్నెస్ ట్రాకింగ్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్​తో పాటు అనేక యుటిలిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ 180 mAh బ్యాటరీని అందిస్తుంది. దీనిని 2 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. సింగిల్ ఛార్జ్​తో దీన్ని ఐదు రోజుల వరకు ఉపయోగించవచ్చు. ఈ బోట్ క్రోమ్ ఐరిస్ ధర, స్పెసిఫికేషన్లతో సహా మరిన్ని వివరాలను పరిశీలిద్దాం రండి.

బాట్ క్రోమ్ ఐరిస్ ధర, లభ్యత: భారతదేశంలో బోట్ క్రోమ్ ఐరిస్ ధర రూ. 3,499. ఈ స్మార్ట్‌వాచ్‌ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఓషాలైన్ ప్లాట్‌ఫామ్‌లు, అధికారిక బాట్ ఇండియా వెబ్‌సైట్​తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

Boat Chrome Iris Available in Five Color Options
Boat Chrome Iris Available in Five Color Options (Image credit: boAt)

కలర్ ఆప్షన్లు: ఇది మెటల్ గోల్డ్, రోజ్ పింక్, వెల్వెట్ వైన్, సిల్క్ స్కిన్, ఫ్రాస్టెడ్ స్కై కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

బోట్ క్రోమ్ ఐరిస్ స్పెసిఫికేషన్లు:

ఈ స్మార్ట్​వాచ్ 466x466 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 1.32-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 1000 నిట్‌ల వరకు పీక్ బ్రైట్​నెస్​ను అందిస్తుంది. అంతేకాకుండా ఈ స్క్రీన్ ఎప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లేకు మద్దతు ఇస్తుంది.

ఈ బోట్ స్మార్ట్‌వాచ్​ను అనేక హెల్త్ మానిటరింగ్ ఫీచర్లతో ప్రారంభించారు. ఇందులో నిరంతర హృదయ స్పందన రేటు పర్యవేక్షణ, SpO2 ట్రాకింగ్, నిద్ర ట్రాకింగ్, గైడెడ్ బ్రీతింగ్ మోడ్‌లు, స్టెప్స్ అండ్ కేలరీల వివరాలను అందించడం కోసం రోజువారీ కార్యాచరణ ట్రాకింగ్, రుతుచక్ర ట్రాకింగ్ ఉన్నాయి. ఇది మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్‌లకు కూడా మద్దతు ఇస్తుంది.

Boat Chrome Iris
Boat Chrome Iris (Image credit: boAt)

ఇది క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లు, కస్టమైజబుల్ మెనూ లేఅవుట్‌లు, నావిగేషన్ కోసం 2.5D యూజర్ ఇంటర్‌ఫేస్‌కు సపోర్ట్ చేస్తుంది. అదనపు స్మార్ట్ టూల్స్‌లో మ్యూజిక్, కెమెరా కంట్రోల్, కాలిక్యులేటర్, గేమ్స్, వాతావరణ సూచన, స్టాప్‌వాచ్, అలారం, టైమర్ వంటి ఫంక్షన్లు ఉన్నాయి.

ఈ స్మార్ట్ వాచ్ 180mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఐదు రోజుల వరకు బ్యాటరీ లైఫ్​ను అందిస్తుంది. పవర్-సేవింగ్ మోడ్ కూడా ఉంది. ఈ స్మార్ట్​వాచ్ సున్నా నుంచి 100 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు రెండు గంటలు పడుతుందని కంపెనీ చెబుతోంది. బ్లూటూత్ కాలింగ్‌కు మద్దతు ఇచ్చే ఈ వాచ్ దుమ్ము, నీటి నిరోధకతకు IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.