ETV Bharat / technology

M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లతో యాపిల్ 'మ్యాక్​బుక్ ప్రో' లాంఛ్- ధర ఎంతంటే?

యాపిల్ "M5 ప్రో", "M5 మ్యాక్స్" చిప్‌సెట్​లతో 2026 "యాపిల్ మ్యాక్​బుక్ ప్రో"ను భారతదేశంలో ప్రారంభించింది.

Apple MacBook Pro (2026) Launched in India
Apple MacBook Pro (2026) Launched in India (Image Credit: Apple)
author img

By ETV Bharat Tech Team

Published : March 4, 2026 at 3:26 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: యాపిల్ భారతదేశంలో "2026 మ్యాక్​బుక్​ ప్రో"ను విడుదల చేసింది. ఇది 14-అంగుళాల, 16-అంగుళాల డిస్​ప్లే పరిమాణాలలో లభిస్తుంది. ఈ "మ్యాక్​బుక్​ ప్రో" M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌సెట్‌లతో వస్తుంది. దీని కీలక ఫీచర్లలో 120Hz వరకు లిక్విడ్ రెటినా XDR డిస్​ప్లే, 36GB వరకు యూనిఫైడ్ RAM, 2TB స్టోరేజ్, 12MP సెంటర్ స్టేజ్ కెమెరా, 96W వరకు ఛార్జింగ్ సపోర్ట్‌తో 100Wh బ్యాటరీ ఉన్నాయి. ఈ ల్యాప్​టాప్​ మాకోస్, యాపిల్ ఇంటెలిజెన్స్‌పై నడుస్తుంది.

మ్యాక్​బుక్​ ప్రో (2026) ధర, లభ్యత: యాపిల్ ఈ కొత్త "మ్యాక్​బుక్​ ప్రో"లో RAM, స్టోరేజ్​ కస్టమైజేషన్​ను అందిస్తోంది. "M5 ప్రో" ప్రాసెసర్‌తో కూడిన ప్రామాణిక "14-అంగుళాల 2026 మ్యాక్​బుక్​ ప్రో" 24GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 2.49 లక్షలు.

అదే సమయంలో 36GB RAM + 2TB స్టోరేజ్​తో కూడిన ప్రామాణిక "M5 మ్యాక్స్" చిప్‌సెట్ మోడల్ ధర రూ. 3.99 లక్షలు. ఈ స్టాండర్డ్ మోడల్ 18-కోర్ CPU, 32-కోర్ GPUతో వస్తుంది. కావాలంటే వినియోగదారులు దీనికంటే మెరుగైన పనితీరును అందించే "M5 మ్యాక్స్" సిస్టమ్-ఆన్-చిప్ (SoC) 18-కోర్ CPU, 40-కోర్ GPU వెర్షన్​ కోసం​ అదనంగా రూ. 30,000 చెల్లించి పొందొచ్చు.

M5 Pro and M5 Max chipsets
M5 Pro and M5 Max chipsets (Image Credit: Apple)

మరోవైపు "M5 ప్రో" చిప్‌సెట్‌తో కూడిన 16-అంగుళాల 2026 "మ్యాక్‌బుక్ ప్రో" 24GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 2.99 లక్షలు. 36GB RAM + 2TB స్టోరేజ్‌తో కూడిన "M5 మ్యాక్స్" ప్రాసెసర్ మోడల్ ధర రూ. 4.29 లక్షలు. వినియోగదారులు 64GB RAM కోసం అదనంగా రూ. 20,000, 4TB స్టోరేజ్ కోసం రూ. 60,000 చెల్లించవచ్చు. ఈ మోడళ్లన్నీ స్పేస్ బ్లాక్, సిల్వర్ రంగులలో లభిస్తాయి.

The M5 Pro and M5 Max chipsets allow users to perform graphic-oriented and resources heavy tasks easily.
The M5 Pro and M5 Max chipsets allow users to perform graphic-oriented and resources heavy tasks easily. (Image Credit: Apple)
మోడల్ప్రాసెసర్వేరియంట్ధర
14-inch displayM5 Pro24GB + 1TBరూ. 2,49,900
M5 Max36GB + 2TBరూ. 3,99,900
16-inch displayM5 Pro24GB + 1TBరూ. 2,99,900
M5 Max36GB + 2TBరూ. 4,29,900

సేల్ వివరాలు: ఈ కొత్త మ్యాక్​బుక్​ ప్రో (2026) ప్రీ-ఆర్డర్లు నేటి (మార్చి 4, 2026) నుంచే ప్రారంభం కానున్నాయి. అయితే దీని సేల్స్ మార్చి 11, 2026 నుంచి ప్రారంభమవుతాయి.