యాపిల్ స్టూడియో డిస్ప్లే, స్టూడియో డిస్ప్లే XDR లాంఛ్- ధరలు ఎలా ఉన్నాయంటే?
యాపిల్ భారతదేశంలో 5K ప్యానెల్స్, థండర్ బోల్ట్ 5తో స్టూడియో డిస్ప్లే, స్టూడియో డిస్ప్లే XDRలను ప్రారంభించింది.

Published : March 4, 2026 at 4:20 PM IST
Hyderabad: యాపిల్ "స్టూడియో డిస్ప్లే", "స్టూడియో డిస్ప్లే XDR" 2026 మోడల్లను భారత్‌తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ కొత్త మానిటర్లు 27-అంగుళాల 5K రెటినా ప్యానెల్, మినీ LED బ్యాక్‌లైటింగ్‌తో అధునాతన 5K రెటినా XDR ప్యానెల్‌ను అందిస్తున్నాయి. ఇవి అడాప్టివ్ సింక్, థండర్‌బోల్ట్ 5 కనెక్టివిటీతో 120Hz రిఫ్రెష్ రేట్, డెస్క్ వ్యూ మద్దతుతో 12MP సెంటర్ స్టేజ్ కెమెరాను కలిగి ఉన్నాయి.
ఈ కొత్త డిస్ప్లేలను "M5 ప్రో", "M5 మ్యాక్స్" చిప్‌సెట్‌లతో "MacBook Pro", M5 ప్రాసెసర్‌ను కలిగి ఉన్న "మ్యాక్‌బుక్ ఎయిర్"తో పాటు ప్రవేశపెట్టబడటం గమనార్హం. ఈ కొత్త మానిటర్లను సాధారణ వినియోగదారులు, సృజనాత్మక నిపుణుల కోసం రూపొందించినట్లు యాపిల్ పేర్కొంది. అయితే XDR మోడల్‌ను అత్యున్నత స్థాయి రంగు కచ్చితత్వం, బ్రైట్నెస్ అవసరమయ్యేవారినే లక్ష్యంగా చేసుకుంది.

స్టూడియో డిస్ప్లే, స్టూడియో డిస్ప్లే XDR ధర, లభ్యత: స్టూడియో డిస్ప్లే స్టాండర్డ్ గ్లాస్ వెర్షన్ ధర రూ. 1,89,900 నుంచి ప్రారంభమవుతుంది. యాపిల్ ఎడ్యుకేషన్ ధర రూ. 1,77,900 నుంచి ప్రారంభమవుతుంది. స్టూడియో డిస్ప్లే XDR ధర రూ. 3,99,900 నుంచి ప్రారంభమవుతుంది, అయితే ఎడ్యుకేషన్ స్టోర్ ధరలు రూ. 3,87,900 నుంచి ప్రారంభమవుతాయి.
| మోడల్ | అసలు ధర | ఎడ్యుకేషన్ స్టోర్ ధర |
| స్టూడియో డిస్ప్లే | రూ. 1,89,900 నుంచి ప్రారంభం | రూ. 1,77,900 నుంచి ప్రారంభం |
| స్టూడియో డిస్ప్లే XDR | రూ. 3,99,900 నుంచి ప్రారంభం | రూ. 3,87,900 నుంచి ప్రారంభం |
సేల్ వివరాలు: ఈ రెండు డిస్‌ప్లేల సేల్స్ మార్చి 11, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ప్రీ-ఆర్డర్‌లు ఈరోజు (మార్చి 4, 2026న) రాత్రి 7:45 ISTకి ప్రారంభం కానున్నాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు యాపిల్ ఇండియా ఆన్లైన్ స్టోర్, యాపిల్ స్టోర్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

దీనితో పాటు యాపిల్ కంపాటిబుల్ యాక్సెసరీలను కూడా అందిస్తోంది. టచ్ ఐడి, న్యూమరిక్ కీప్యాడ్‌తో కూడిన మ్యాజిక్ కీబోర్డ్ ధర రూ. 19,500, మ్యాజిక్ ట్రాక్‌ప్యాడ్ ధర రూ. 14,500, మ్యాజిక్ మౌస్ ధర రూ. 9,500.
| యాక్సెసరీలు | ధరలు |
| టచ్ ఐడి, న్యూమరిక్ కీప్యాడ్‌తో మ్యాజిక్ కీబోర్డ్ | రూ. 19,500 |
| మ్యాజిక్ ట్రాక్‌ప్యాడ్ | రూ. 14,500 |
| మ్యాజిక్ మౌస్ | రూ. 9,500 |
కలర్ ఆప్షన్లు: స్టూడియో డిస్ప్లే, స్టూడియో డిస్ప్లే XDR మానిటర్లు నలుపు, తెలుపు రంగులలో లభిస్తాయి.

