ETV Bharat / technology

M4 చిప్​తో 2026 'ఐప్యాడ్ ఎయిర్' లాంఛ్- దీని రేటెంతో తెలుసా?

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ (2026) భారతదేశంలో M4 చిప్‌తో విడుదలయింది.

Apple iPad Air (2026) With M4 Chip Launched in India
Apple iPad Air (2026) With M4 Chip Launched in India (Image Credit: Apple)
author img

By ETV Bharat Tech Team

Published : March 3, 2026 at 1:15 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: యాపిల్ తన ఐప్యాడ్ ఎయిర్ (2026)ను భారత్​ సహా ఇతర గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ టాబ్లెట్ రెండు డిస్​ప్లే సైజులలో లభిస్తుంది. ఒకటి 11-అంగుళాలు, రెండోది 13-అంగుళాలు. ఈ రెండు మోడళ్లలోనూ 60Hz లిక్విడ్ రెటినా డిస్​ప్లే, M4 చిప్‌సెట్, 12GB RAM, 1TB వరకు స్టోరేజ్, సింగిల్ 12MP వెనుక కెమెరా ఉన్నాయి.

దీని 13-అంగుళాల వేరియంట్ 36.59 Wh బ్యాటరీతో వస్తుంది. అయితే 11-అంగుళాల మోడల్ 28.93 Wh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ రెండు మోడళ్లు iOS26 ఆపరేటింగ్ సిస్టమ్ (OS)పైనే రన్ అవుతాయి. ఈ ఐప్యాడ్ ఎయిర్ "WiFi + సెల్యులార్", "WiFi ఓన్లీ" ఆప్షన్లలో లభిస్తుంది. ఈ తాజా టాబ్లెట్​ను కంపెనీ తన "ఐఫోన్ 17" సిరీస్​లో అత్యంత చౌకైన మోడల్ అయిన "ఐఫోన్ 17e"తో పాటు ప్రారంభించింది.

ఐప్యాడ్ ఎయిర్ (2026) ధర వివరాలు: ఐప్యాడ్ ఎయిర్ (2026)లోని "WiFi + సెల్యులార్", "WiFi ఓన్లీ" రెండు మోడళ్లూ నాలుగు RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తాయి. కంపెనీ 13-అంగుళాల ఐప్యాడ్ ఎయిర్ (2026) "WiFi ఓన్లీ" మోడల్ 128GB వేరియంట్‌ ధరను రూ. 84,900, 256GB మోడల్​ను రూ. 94,900, 512GB మోడల్‌ను రూ. 1.14 లక్షలు, 1TB వేరియంట్‌ను రూ. 1.34 లక్షలుగా నిర్ణయించింది. అదే సమయంలో "WiFi+సెల్యులార్" 128GB మోడల్‌ ధర రూ. 99,999గా, 256GB వేరియంట్‌ రూ. 1.09 లక్షలుగా, 512GB మోడల్‌ రూ. 1.29 లక్షలుగా, 1TB వేరియంట్‌ రూ. 1.49 లక్షలుగా ఉంది.

మరోవైపు 11-అంగుళాల ఐప్యాడ్ ఎయిర్ (2026) "WiFi ఓన్లీ" మోడల్ 128GB వేరియంట్ రూ.64,900, 256GB మోడల్ రూ.74,900, 512GB వేరియంట్ రూ.94,900, 1TB మోడల్ రూ.1.14 లక్షలకు అందుబాటులో ఉంది. "WiFi+సెల్యులార్" 128GB వేరియంట్ ధర రూ.79,900, 256GB మోడల్ ధర రూ.89,900, 512GB వేరియంట్ ధర రూ.1.09 లక్షలు, 1TB మోడల్ ధర రూ.1.29 లక్షలు.

మోడల్వేరియంట్ధర (11-inch)ధర (13-inch)
WiFi ఓన్లీ12GB + 128GBరూ. 64,900రూ. 84,900
12GB + 256GBరూ. 74,900రూ. 94,900
12GB + 512GBరూ. 94,900రూ. 1,14,900
12GB + 1TBరూ. 1,14,900రూ. 1,34,900
WiFi + సెల్యూలర్12GB + 128GBరూ. 79,900రూ. 99,900
12GB + 256GBరూ. 89,900రూ. 1,09,900
12GB + 512GBరూ. 1,09,900రూ. 1,29,900
12GB + 1TBరూ. 1,29,900రూ. 1,49,900

కలర్ ఆప్షన్లు: ఈ అన్ని మోడళ్లు నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.

  • స్పేస్ గ్రే
  • బ్లూ
  • పర్పుల్
  • స్టార్‌లైట్

ఐప్యాడ్ ఎయిర్ (2026) ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:

ఫీచర్లు, స్పెసిఫికేషన్లువివరాలు
డిస్​ప్లే60Hz | up to 13-inch, Liquid Retina IPS
ప్రాసెసర్M4
RAM + స్టోరేజ్12GB + 128GB (WiFi only and WiFi + Cellular)
12GB + 256GB (WiFi only and WiFi + Cellular)
12GB + 512GB (WiFi only and WiFi + Cellular)
12GB + 1TB (WiFi only and WiFi + Cellular)
రియర్ కెమెరా12MP
ఫ్రంట్ కెమెరా12MP
బ్యాటరీ36.59 Wh (13-inch) | 28.93 Wh (11-inch)
ఛార్జింగ్ కెపాసిటీ20W
ఆపరేటింగ్ సిస్టమ్iOS26