ETV Bharat / technology

M5 చిప్​తో యాపిల్ 'మ్యాక్​బుక్ ఎయిర్'- మునుపటి కంటే 4రెట్లు వేగవంతమైన AI పనితీరు

టెక్ దిగ్గజం యాపిల్ M5 చిప్‌సెట్‌తో కొత్త మ్యాక్​బుక్ ఎయిర్​ను ప్రకటించింది.

Apple Introduces New Macbook Air with M5 Chip
Apple Introduces New Macbook Air with M5 Chip (Photo Credit: Apple)
author img

By ETV Bharat Tech Team

Published : March 4, 2026 at 11:50 AM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: యాపిల్ M5 చిప్‌సెట్‌తో కొత్త మ్యాక్​బుక్ ఎయిర్ (2026)ను విడుదల చేసింది. ఈ కొత్త ల్యాప్‌టాప్ 13.6-అంగుళాల, 15.3-అంగుళాల డిస్​ప్లే ఎంపికలలో భారత్​తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది. దీని బేస్ మోడల్ 512GB స్టోరేజ్​తో వస్తుంది.

ఈ పరికరం నాలుగు రంగు ఎంపికలలో లభిస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 18 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ కొత్త మ్యాక్​బుక్ ఎయిర్​లో వీడియో కాల్స్ కోసం 12-మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరా ఉంది. దీనికి బ్లూటూత్ 6, Wi-Fi 7 కనెక్టివిటీ ఉంది. ఇది యాపిల్ N1 వైర్‌లెస్ చిప్‌తో వస్తుంది.

భారతదేశంలో మ్యాక్​బుక్ ఎయిర్​(2026) ధర: మ్యాక్​బుక్ ఎయిర్​ M5 13-అంగుళాల స్క్రీన్ కలిగిన బేస్ మోడల్ ధర రూ. 1,19,900 నుంచి ప్రారంభమవుతుంది. 15-అంగుళాల వేరియంట్ రూ. 1,44,900 నుంచి లభిస్తుంది. ఈ మోడళ్లన్నీ స్కై బ్లూ, మిడ్‌నైట్, స్టార్‌లైట్, సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తాయి.

ModelVariantPriceColours
13-inch display16GB + 512GBRs 1,19,900Sky Blue | Midnight | Starlight | Silver
15-inch display16GB + 512GBRs 1,44,900

సేల్ వివరాలు: భారత్, అమెరికా సహా 33 దేశాలలో M5 చిప్​తో ఈ కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ సేల్స్ మార్చి 4 అంటే ఇవాళ్టి నుంచే ప్రారంభమవుతాయి. అయితే వీటి షిప్​మెంట్లు మార్చి 11 నుంచి ప్రారంభమవుతాయి.

MacBook Air (2026) ఫీచర్లు, స్పెసిఫికేషన్లు: యాపిల్​ 2026 మ్యాక్​బుక్ ఎయిర్ M5 చిప్‌తో వస్తుంది. ఇది 10-కోర్ CPU, ప్రతి కోర్‌లో న్యూరల్ యాక్సిలరేటర్‌తో 10-కోర్ GPU వరకు ఉంటుంది. M5 చిప్​తో ఈ కొత్త మోడల్ "M4 మ్యాక్​బుక్ ఎయిర్​" కంటే 4 రెట్లు వేగవంతమైన ఏఐ పనితీరును అందిస్తుందని యాపిల్ చెబుతోంది. అదే సమయంలో ఇది "M1 చిప్‌ ఉన్న మ్యాక్​బుక్ ఎయిర్"​తో పోలిస్తే 9.5x వేగవంతమైన పనితీరును అందిస్తుందని పేర్కొంది.

Apple New Macbook Air with M5 Chip
Apple New Macbook Air with M5 Chip (Photo Credit: Apple)

ఈ కొత్త మోడల్‌లో షేడర్ కోర్లు, మెరుగైన గేమింగ్, 3D రెండరింగ్ కోసం మూడవ తరం రే-ట్రేసింగ్ ఇంజిన్ ఉన్నాయి. M5 చిప్ 153GB/s బ్యాండ్‌విడ్త్‌తో ఏకీకృత మెమరీని కూడా కలిగి ఉంది. ఇంటెల్ కోర్ అల్ట్రా x7 ప్రాసెసర్‌లతో కూడిన PC ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే "M5 మ్యాక్​బుక్​ ఎయిర్​"లో వెబ్ బ్రౌజింగ్ 50 శాతం వరకు వేగంగా ఉంటుందని యాపిల్ అంటోంది.

ఈ కొత్త మ్యాక్​బుక్ ఎయిర్​ 512GB స్టోరేజ్​తో ప్రామాణికంగా వస్తుంది. ఇది మునుపటి తరం కంటే గణనీయమైన మెరుగుదల. దీనిని 4TB వరకు కాన్ఫిగర్ చేయవచ్చు. ల్యాప్‌టాప్ మాకోస్ టాహో(macOS Tahoe)తో వస్తుంది. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను అందిస్తుంది.

మాక్‌బుక్ ఎయిర్ 13.6-అంగుళాలు, 15.3-అంగుళాల ఆప్షన్​తో లిక్విడ్ రెటినా డిస్‌ప్లేతో లభిస్తుంది. 500 నిట్‌ల బ్రైట్‌నెస్, 1 బిలియన్ రంగులకు మద్దతు ఇస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 18 గంటల బ్యాటరీ లైఫ్​ అందిస్తుందని పేర్కొన్నారు.

మ్యాక్‌బుక్ ఎయిర్‌లో డెస్క్ వ్యూ సపోర్ట్​తో 12-మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరా ఉంది. ఇది మూడు-మైక్ అర్రే, స్పేషియల్ ఆడియో, డాల్బీ అట్మోస్​కు మద్దతిచ్చే స్పీకర్ యూనిట్‌ను కలిగి ఉంది. పైన చెప్పినట్లుగా ఈ కొత్త ల్యాప్‌టాప్ బ్లూటూత్ 6, Wi-Fi 7 కనెక్టివిటీని అందిస్తుంది. దీనిలో యాపిల్ ఇన్-హౌస్ N1 వైర్‌లెస్ నెట్‌వర్కింగ్ చిప్‌ను అమర్చారు. కనెక్టివిటీ కోసం, మ్యాక్‌బుక్ ఎయిర్ ఉపకరణాలను కనెక్ట్ చేయడానికి రెండు "థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌"లను కలిగి ఉంది. ఇది రెండు ఎక్స్​టెర్నల్ డిస్​ప్లేలకు సపోర్ట్ చేస్తుంది.