ETV Bharat / technology

2026 వరల్డ్ కార్ అవార్డ్స్ ఫైనలిస్టులు వెల్లడి- జాబితాలో ఏ మోడళ్లు ఉన్నాయంటే?

2026 World Car Awards: 2026 ప్రపంచ కార్ అవార్డుల కోసం ఫైనలిస్టులను ప్రకటించారు.

2026 World Car Awards Finalists Announced
2026 World Car Awards Finalists Announced (Photo Credit- ETV Bharat via World Car Awards)
author img

By ETV Bharat Tech Team

Published : January 9, 2026 at 4:53 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ (WCOTY) 2026 అవార్డు కోసం ఫైనలిస్టులను ప్రకటించారు. భారత్​తో సహా 33 దేశాలకు చెందిన 98 మంది ఆటోమోటివ్ జర్నలిస్టులతో కూడిన ప్రపంచ జ్యూరీ, రహస్య ఓటింగ్ ద్వారా ఈ షార్ట్‌లిస్ట్‌ను ఎంపిక చేసింది. ఆరు వేర్వేరు విభాగాలలో ఉన్న డజన్ల కొద్దీ కార్ల నుంచి కొన్నింటిని ఎంపిక చేశారు. ఈ ఏడాది WCOTY అవార్డు కోసం ఎలక్ట్రిక్, హైబ్రిడ్, ICE వాహనాల మిశ్రమం పోటీ పడుతోంది.

టాప్-10 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ (WCOTY):

ఫ్లాగ్​షిప్ శ్రేణిలో మొదట 58 అర్హత గల వాహనాలు ఉండగా, ఇప్పుడు వాటిని ఈ 10 ఫైనలిస్టులకు కుదించారు:

  • Audi Q5 / SQ5
  • BMW iX3
  • BYD Seal 6 DM-i
  • Hyundai Ioniq 9
  • Hyundai Palisade
  • Kia EV4
  • Kia EV5
  • Mercedes-Benz CLA
  • Nissan Leaf
  • Toyota RAV4

వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ కాంపిటీషన్​లో టాప్-5 ఫైనలిస్టులు:

  • Audi A6 e-tron / S6 e-tron
  • BMW iX3
  • Hyundai Ioniq 9
  • Mercedes-Benz CLA
  • Nissan Leaf

టాప్-5 వరల్డ్ లగ్జరీ కార్ ఫైనలిస్టులు:

  • Audi A6 e-tron / S6 e-tron
  • Audi A6/S6
  • Cadillac Vistiq
  • Lucid Gravity
  • Volvo ES90

టాప్-5 వరల్డ్ పెర్ఫార్మెన్స్ కార్ ఫైనలిస్టులు:

  • BMW M2 CS
  • Chevrolet Corvette E-Ray
  • Land Rover Defender Octa
  • Hyundai Ioniq 6 N
  • Mercedes-AMG GT 63 Pro

టాప్-5 వరల్డ్ అర్బన్ కార్ ఫైనలిస్ట్‌లు:

  • Alfa Romeo Junior
  • Baojun Yep Plus / Chevrolet Spark EUV
  • Firefly
  • Hyundai Venue
  • Wuling Binguo / Ari Poly

పైన పేర్కొన్న ఐదు కేటగిరీలో ఉన్న అన్ని వాహనాలు కూడా 6వ కేటగిరీ అయిన బెస్ట్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్​లో పాల్గొనడానికి అర్హత పొందుతాయి. కానీ డిజైన్ అవార్డు ప్రాసెస్ కొంచెం డిఫరెంట్​గా ఉంటుంది. సాధారణ జడ్జీలు (కార్ జర్నలిస్టులు) డైరెక్ట్‌గా విన్నర్ ఎంచుకోరు. ముందు ప్రపంచంలోని ఫేమస్ కార్ డిజైన్ ఎక్స్‌పర్ట్స్ ఒక స్పెషల్ టీమ్ అన్ని కార్లను చూసి, వాటిలో బెస్ట్ డిజైన్ ఉన్న టాప్ 5 కార్లను ఎంచుకుంటారు. ఆ తర్వాత, సాధారణ జడ్జీలు ఆ టాప్-5లోనే వోట్ చేసి ఫైనల్ విన్నర్‌ను డిసైడ్ చేస్తారు.

ఈసారి (2026) డిజైన్ ఎక్స్‌పర్ట్స్ ఎంచుకున్న టాప్-5 కార్లు:

  • Firefly
  • Kia PV5
  • Lynk & Co 08
  • Mazda 6e / EZ-6
  • Volvo ES90

నివేదికల ప్రకారం, ప్రపంచంలోని 'టాప్-3' ఫైనలిస్టులను మార్చి 3వ తేదీన వర్చువల్‌గా వెల్లడిస్తారు. ఈ ఆరు విభాగాలలోని తుది విజేతలందరినీ విభాగాల వారీగా) ఏప్రిల్ 1న జరిగే న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో ప్రకటించనున్నారు. ఈ ఏడాదితో ఈ షోతో వరల్డ్ కార్ అవార్డ్స్ భాగస్వామ్యానికి 21 సంవత్సరాలు పూర్తవుతుంది.

ఇకపోతే గతేడాది "కియా EV3" ఓవరాల్ వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ సమయంలో విజేతలుగా నిలిచిన ప్రముఖ కార్లలో పనితీరు విభాగంలో "పోర్షే 911 కారెరా GTS", లగ్జరీ విభాగంలో "వోల్వో EX90" ఉన్నాయి.