రూ.13 వేల వరకు తగ్గిన ధర: చిన్నపాటి మార్పులతో 2026 'రెనాల్ట్ క్విడ్' లాంచ్!
రూ.4.53 లక్షల ప్రారంభ ధరతో 2026 రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ విడుదలైంది. పాత మోడల్ కంటే రూ.13 వేలు తక్కువ ధరకే, చిన్నపాటి అప్‌డేట్స్‌తో ఇది బడ్జెట్ పరిధిలో లభిస్తోంది.

Published : July 3, 2026 at 7:30 PM IST
Hyderabad: ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భారత మార్కెట్లో తమ పాపులర్ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. మ్యానువల్ గేర్‌బాక్స్‌తో వచ్చే దీని బేస్ 'ఎవల్యూషన్' వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.53 లక్షలు కాగా, టాప్-ఎండ్ 'క్లైంబర్' ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) మోడల్ ధర రూ. 5.61 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
| Variant | Price (ex-showroom) | |
| Manual | AMT | |
| Evolution | Rs 4.53 lakh | Rs 4.90 lakh |
| Climber | Rs 5.15 lakh | Rs 5.61 lakh |
ఈ కారులో తీసుకొచ్చిన అతిపెద్ద మార్పులలో ఒకటి దాని వేరియంట్ల నిర్మాణాన్ని సరళీకరించడం. గతంలో నాలుగు వేరియంట్లలో లభించిన రెనాల్ట్ క్విడ్, ఇప్పుడు కేవలం 'ఎవల్యూషన్' (Evolution), 'క్లైంబర్' (Climber) అనే రెండు వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, వేరియంట్లు తగ్గినప్పటికీ వాటిలోని ఫీచర్లు లేదా ఎక్విప్‌మెంట్ (పరికరాలు) పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు.
ఈ అప్‌డేట్‌లో భాగంగా, రెనాల్ట్ తన 'క్విడ్' (Kwid) మోడల్‌కు చెందిన అన్ని వెర్షన్ల ధరలను తగ్గించింది. 'ఎవల్యూషన్ MT' (Evolution MT) ధర ఇప్పుడు ₹13,000 తగ్గి రూ. 4.53 లక్షలకు చేరగా, 'AMT' వెర్షన్ ధర రూ. 10,000 తగ్గి రూ. 4.90 లక్షలకు చేరింది.
| వేరియంట్లు | పాత ధరలు | కొత్త ధరలు | ధరల వ్యత్యాసం |
|---|---|---|---|
| Evolution 1.0 Manual | రూ. 4.66 లక్షలు | రూ. 4.53 లక్షలు | రూ. 13,000 |
| Evolution 1.0 AMT | రూ. 5.00 లక్షలు | రూ. 4.90 లక్షలు | రూ. 10,000 |
| Climber 1.0 Manual | రూ. 5.58 లక్షలు | రూ. 5.15 లక్షలు | రూ. 43,000 |
| Climber 1.0 AMT | రూ. 5.99 లక్షలు | రూ. 5.61 లక్షలు | రూ. 38,000 |
కలర్ ఆప్షన్లు: ఈ హ్యాచ్‌బ్యాక్ నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి:
- ఫైరీ రెడ్
- జన్‌స్కర్ బ్లూ
- ఐస్ కూల్ వైట్
- మూన్‌లైట్ సిల్వర్
అయితే టాప్-స్పెక్ 'క్లైంబర్' వేరియంట్ డ్యూయల్-టోన్ షేడ్‌తో వస్తుంది. ఇందులో కాంట్రాస్ట్ బ్లాక్ రూఫ్, వైట్ అవుట్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ (ORVMs)ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.
2026 రెనాల్ట్ క్విడ్ ఇంజిన్ వివరాలు: ఈ కొత్త 2026 రెనాల్ట్ క్విడ్ మునుపటి అదే 1-లీటర్ నేచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 68.05 bhp పవర్, 92.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ విషయానికొస్తే, క్విడ్‌లో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
మార్కెట్లో దీని ప్రత్యర్థులు: భారత్‌లో రెనాల్ట్ క్విడ్ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మారుతీ సుజుకి ఆల్టో K10, మారుతీ S-ప్రెస్సో, టాటా టియాగో మోడళ్లతో పోటీపడుతుంది.

