ETV Bharat / technology

2026 'QJ SRV 300' మోటార్‌సైకిల్ లాంఛ్- ఇప్పుడు దీని ధర ఎంతో తెలుసా?

భారతదేశంలో 2026 QJ మోటార్ SRV 300 రూ. 3.29 లక్షలకు విడుదలయ్యింది. ఇది రెండు రంగులలో లభిస్తుంది.

2026 QJ Motor SRV 300 Launched in India
2026 QJ Motor SRV 300 Launched in India (Photo Credit- QJ Motor India)
author img

By ETV Bharat Telugu Team

Published : May 6, 2026 at 1:54 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: ద్విచక్ర వాహన తయారీ సంస్థ QJ మోటార్ ఇండియా తన అప్డేటెడ్ 'QJ SRV 300' మోడల్​ను భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ ఈ బైక్‌ను రూ. 3.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. సాంకేతికంగా ఈ కొత్త "SRV 300"లో ఎటువంటి మార్పులు లేవు. 300cc లోపు విభాగంలో ఇది ఒక ప్రత్యేకమైన V-twin ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇదే ఈ బైక్ అతిపెద్ద ప్రత్యేకత (USP).

కొత్త QJ SRV 300 కలర్ ఆప్షన్లు: QJ మోటార్ ఈ "2026 SRV 300" మోడల్‌కు కొన్ని చిన్నపాటి బాహ్య అలంకరణ (Cosmetic) అప్డేట్​లను పరిచయం చేసింది. వీటిలో కొత్త డ్యూయల్-ఎగ్జాస్ట్ డిజైన్, అప్డేటెడ్ డెకాల్స్, సవరించిన ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి. అంతేకాకుండా, ఈ కొత్త QJ SRV 300 రెండు రంగుల ఎంపికలలో లభిస్తుంది. అవి: మ్యాట్ బ్లాక్, గ్లోసీ రెడ్.

కొత్త QJ SRV 300 కొలతలు: దీని కొలతలలో కూడా కంపెనీ ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది 164 కిలోల కర్బ్ వెయిట్​ను, 160 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను, 700 mm సీటు ఎత్తును, 14 లీటర్ల ఇంధన ట్యాంకును కలిగి ఉంది. ఈ బైక్ 16-అంగుళాల ఫ్రంట్ వీల్, 15-అంగుళాల రియర్​ వీల్​పై నడుస్తుంది. బ్రేకింగ్ కోసం, ఈ బైక్‌ ముందు వైపు 280 mm సింగిల్ డిస్క్, వెనుక వైపు 240 mm సింగిల్​ డిస్క్ అమర్చారు.

అదనంగా, ఇది డ్యూయల్-ఛానల్ ABS మద్దతును కలిగి ఉంది. దీని సస్పెన్షన్ అమరికలో ముందు వైపున అప్‌సైడ్-డౌన్ ఫోర్కులు, వెనుక వైపున ట్విన్ కాయిల్-స్ప్రింగ్, ఆయిల్-డ్యాంప్డ్ షాక్‌లు ఉన్నాయి. 2026 మోడల్ కోసం, SRV 300 ధరను కూడా సవరించారు. దీనితో దీని ధర, కొత్త GST రేట్లు అమల్లోకి రాకముందు ఉన్న స్థాయికి చేరువయ్యింది.

కొత్త QJ SRV 300 ధర: గతంలో "SRV 300" ధర రూ. 3.19 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. అయితే ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా సంస్థ GST ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేసినప్పుడు, దీని ధర రూ. 1.97 లక్షలకు తగ్గింది. ఇప్పుడు ఈ బైక్ రూ. 3.29 లక్షల (ఎక్స్-షోరూమ్) సవరించిన ధరతో విడుదలయింది.

అదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (AARI) హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ప్రముఖ ప్రీమియం ద్విచక్ర వాహనాల తయారీదారు (Manufacturer), పంపిణీదారు (Distributor). ఇది కీవే (Keeway), మోటో మోరిని (Moto Morini), క్యూజె మోటార్ (QJ Motor), జోంటెస్ (Zontes), బెనెల్లీ (Benelli) వంటి బ్రాండ్‌లను భారతదేశంలో విక్రయిస్తుంది, 50కి పైగా అవుట్‌లెట్‌ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.

కొత్త QJ SRV 300 ఇంజిన్: 2026 మోడల్ సంవత్సరానికి గాను, ఈ కొత్త SRV 300 అదే 296cc V-twin ఇంజిన్‌ను వినియోగిస్తుంది. ఈ ఇంజిన్ 9,000 rpm వద్ద 29.9 bhp శక్తిని, 5,000 rpm వద్ద 26 Nm పీక్ టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్, స్లిప్పర్ క్లచ్‌తో వస్తుంది.