ETV Bharat / technology

మార్కెట్లోకి '2026 డుకాటీ మాన్‌స్టర్‌'- ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

డుకాటీ భారతదేశంలో 2026 డ్యుకాటి మాన్‌స్టర్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ. 13.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

2026 Ducati Monster Launched in India
2026 Ducati Monster Launched in India (Photo Credit- Ducati)
author img

By ETV Bharat Tech Team

Published : August 10, 2026 at 3:07 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: ప్రముఖ హైపర్ స్పోర్ట్ బైక్ తయారీ సంస్థ డుకాటీ భారత మార్కెట్లో తన ఐదో తరం (ఫిఫ్త్ జనరేషన్) '2026 డుకాటీ మాన్‌స్టర్' బైక్‌ను లాంఛ్ చేసింది. కంపెనీ దీని ప్రారంభ ధరను రూ. 13.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది. ఈ కొత్త మోటార్‌సైకిల్‌ను మాన్‌స్టర్, మాన్‌స్టర్+ అనే రెండు వెర్షన్లలో తీసుకొచ్చారు. ఇందులో సరికొత్త 890 cc V2 ఇంజిన్, మెరుగైన చేసిస్, కొత్త స్టైలింగ్, మరింత అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీని అందించారు.

2026 డుకాటీ మాన్‌స్టర్ కలర్ ఆప్షన్లు: ఈ బైక్​లోని రెండు వెర్షన్లూ డుకాటీ రెడ్, ఐస్‌బర్గ్ వైట్, స్పోర్ట్ లివరీ అనే మూడు రంగు ఎంపికలలో లభిస్తాయి.

2026 Ducati Monster
2026 Ducati Monster (Photo Credit- Ducati)

వీటి ధరల విషయానికి వస్తే, 2026 డుకాటీ 'మాన్‌స్టర్' స్టాండర్డ్ వెర్షన్‌కు చెందిన 'డుకాటీ రెడ్' కలర్ ఆప్షన్ ధర రూ. 13.99 లక్షలుగా ఉంటే, 'ఐస్‌బర్గ్ వైట్', 'స్పోర్ట్ లివరీ' కలర్ ఆప్షన్ల కోసం మరికొంత అదనంగా రూ. 14.23 లక్షల ధర చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే 'మాన్‌స్టర్+' వెర్షన్ గురించి మాట్లాడుకుంటే, దీని 'డుకాటీ రెడ్' కలర్ వెర్షన్ ధర రూ. 14.34 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కాగా, ఇందులోని 'ఐస్‌బర్గ్ వైట్', 'స్పోర్ట్ లివరీ' కలర్ వెర్షన్ల ధరను రూ. 14.45 లక్షలుగా నిర్ణయించారు.

2026 డుకాటీ మాన్‌స్టర్ సరికొత్త ఇంజిన్ సెటప్: కొత్త 2026 మాన్‌స్టర్ బైక్‌లో జరిగిన అతిపెద్ద మెకానికల్ మార్పు ఏంటంటే, ఇందులో డుకాటీకి చెందిన సరికొత్త 890 cc V2 ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 9,000 rpm వద్ద 110.7 hp పవర్‌ను, అలాగే 7,250 rpm వద్ద 91.1 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజిన్‌లో డుకాటీకి చెందిన 'ఇన్‌టేక్ వేరియబుల్ టైమింగ్' (IVT) వ్యవస్థను పొందుపరిచారు. తక్కువ స్పీడ్‌లో మెరుగైన రెస్పాన్స్​ను, మిడ్-రేంజ్‌లో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్​ను, అధిక రెవ్ (rev) రేంజ్‌లో ఎక్కువ పవర్ అందించడానికి వీలుగా దీనిని డిజైన్ చేశారు. ఈ ఇంజిన్ అందించే గరిష్ట టార్క్‌లో 80 శాతానికి పైగా పవర్.. కేవలం 4,000 rpm నుంచి 10,000 rpm మధ్యలోనే లభిస్తుందని కంపెనీ పేర్కొంది.

2026 Ducati Monster
2026 Ducati Monster (Photo Credit- Ducati)

2026 డుకాటీ మాన్‌స్టర్ ఎలక్ట్రానిక్ ఫీచర్లు: కొత్త 2026 మాన్‌స్టర్ బైక్‌లో 6-యాక్సిస్ ఐఎమ్‌యూ (IMU) ఆధారిత అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ ప్యాకేజీని అందించారు. ఇందులో సేఫ్టీ, రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు కార్నరింగ్ ఏబీఎస్ (ABS), డుకాటీ ట్రాక్షన్ కంట్రోల్, డుకాటీ వీలీ కంట్రోల్, ఇంజన్ బ్రేక్ కంట్రోల్, డుకాటీ క్విక్ షిఫ్ట్ 2.0 వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

లాంగ్ రైడ్, సిటీ డ్రైవింగ్ కోసం ఈ బైక్‌లో స్పోర్ట్, రోడ్, అర్బన్, వెట్ అనే నాలుగు రైడింగ్ మోడ్​లు అందుబాటులో ఉన్నాయి. వీటిని హ్యాండిల్ బార్‌పై ఉండే సరికొత్త పెటల్-షేప్ (రేకుల ఆకారంలో ఉండే) జాయ్‌స్టిక్ సహాయంతో రైడర్లు చాలా సులభంగా కంట్రోల్ చేయవచ్చు. ఈ మోడ్​లకు సంబంధించిన పూర్తి సమాచారం 5-అంగుళాల ఫుల్-TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్‌ప్లేపై కనిపిస్తుంది.

ఈ బైక్ డిస్‌ప్లే 800x400 రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది రైడింగ్ చేస్తూ ఫోన్ కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా డుకాటీ మల్టీమీడియా సిస్టమ్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు హైవేలపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్‌ను కూడా ఇందులో ఇన్-బిల్ట్‌ (రెడీ-టు-యూజ్)గా అందించారు.