ETV Bharat / state

ఐదుగురు విద్యార్థుల అద్భుత సృష్టి - ఏఐ సాంకేతికతతో వాహనాలు, మనుషుల లెక్కింపు

సమాజ సమస్యలకు ఇంజినీరింగ్ విద్యార్థులు చెక్ - డ్రోన్ల పర్యవేక్షణకు ప్రత్యేక వెబ్‌పోర్టల్ తయారీ - ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల అద్భుత సృష్టి - ఏఐ సాంకేతికతతో వాహనాలు, మనుషుల లెక్కింపు

Yuva Story on Students Build AI Drone Monitoring System In NTR District
Yuva Story on Students Build AI Drone Monitoring System In NTR District (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 27, 2026 at 7:46 PM IST

3 Min Read
Choose ETV Bharat

Yuva Story on Students Build AI Drone Monitoring System In NTR District: చదువుకున్న విజ్ఞానాన్ని పుస్తకాలకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడేలా మార్చారా విద్యార్థులు. సరికొత్త ఆలోచనతో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు పోలీసులకు అస్త్రంగా నిలిచారు.

ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినియోగిస్తున్న డ్రోన్ల పనితీరు ఒకే చోటు నుంచి పర్యవేక్షించేందుకు వీలుగా ఒక ప్రత్యేక వైబ్‌సైట్‌. డ్యాష్‌ బోర్డును రూపొందించారు. ఏఐ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ డ్రోన్ కెమెరా ముందు కదిలే వాహనాలను, మనుషులను సైతం లెక్కించేలా రూపొందించారు. మరిన్ని డ్రోన్ సైట్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐదుగురు విద్యార్థుల అద్భుత సృష్టి - ఏఐ సాంకేతికతతో వాహనాలు, మనుషుల లెక్కింపు (ETV)

ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల అద్భుత సృష్టి: తరగతి గదుల్లో నేర్చుకున్న జ్ఞానం సమాజ సమస్యల పరిష్కారానికి వినియోగించాలని నిర్ణయించుకున్నారీ ఇంజినీరింగ్ విద్యార్థులు. ఓ వైపు చదువుతూనే ఏఐ టెక్నాలజీపై పట్టు సాధించారు. వేర్వేరు కళాశాలకు చెందిన ఈ ఐదుగురు విద్యార్థులు 2 నెలలు శ్రమించి డ్రోన్లను పర్యవేక్షించే వైబ్‌సైట్‌ రూపొందించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. స్క్రీన్‌పై కనిపిస్తున్నఈ విద్యార్థుల పేర్లు లిఖిత, శ్రీనిధి, శ్రీనివాసరెడ్డి, చరణ్, లక్ష్మణ్. ఇద్దరిది కేఎల్ యూనివర్శిటీ, మరో ముగ్గురిది మోహన్‌బాబు యూనివర్శిటీ.

వీరంతా సీఎస్​సీ చదువుతున్నారు. టెక్నాలజీపై ఆసక్తితో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుని కలిసి తమ ఆలోచనలను పంచుకున్నారు. వారిచ్చిన సహకారంతో ఎన్టీఆర్‌ జిల్లా పోలీసులతో కలిసి ప్రాజెక్ట్‌ను తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా డ్రోన్ రికార్డు చేస్తున్న వీడియోను చూసేందుకు యూట్యూట్ లింకు తయారు చేస్తారు. ఈ ఇబ్బందికి సొల్యూషన్ చూపాలని నిర్ణయించుకున్నారీ విద్యార్థులు.

డ్రోన్ టెక్నాలజీతో వాహనాల లెక్కింపు: ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో మొత్తం 40 డ్రోన్లు వినియోగిస్తున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు విద్యార్థులు పైథాన్‌ లాంగ్వేజీ వినియోగించి సెంట్రల్‌ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్ తయారు చేశారు. దీనివల్ల ఒకేసారి 40 డ్రోన్లు ఎక్కడెక్కడ ఎగురుతున్నాయి? ఏ విజువల్స్‌ను రికార్డు చేస్తున్నాయో ఒకే డ్యాష్‌ బోర్డులో చూడవచ్చు. ఈ వెబ్ పోర్టల్‌ డ్రోన్స్‌ను పరిశీలించటంతో పాటు ఎంత సేపు డ్రోన్స్ ఎగురుతున్నాయి అనే అనలిటిక్స్‌ సమాచారం కూడా ఈ సిస్టమ్ అందిస్తుంది. డ్రోన్ ఎగురుతున్న సమయంలో ఆ ఫ్రేమ్‌లో ఉన్న మనుషుల సంఖ్య, వాహనాల సంఖ్య ఏఐ పరిజ్ఞానంతో ఆటోమేటిక్‌గా లెక్కించేలా దీనిని సిద్ధం చేశారు. భవిష్యత్త్‌లో డ్రోన్ కెమెరా ముందుకు వచ్చే వాహనాల నెంబర్ ప్లేట్లను గుర్తించే విధంగా ఈ పోర్టల్‌ను అప్‌డేట్ చేస్తామన్నారీ యువ ఇంజినీర్లు.

సునాయాసంగా డ్రోన్ మానిటరింగ్ ప్రక్రియ: కళాశాల ముగిసిన తర్వాత రోజు 2 నుంచి 3 గంటల పాటు, రెండు నెలల పాటు నిరంతరం కసరత్తు చేసి డ్రోన్ మానిటరింగ్ వెబ్ పోర్టల్ అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్థి దశలోనే సమాజ భద్రతకు సాంకేతిక పరిష్కరం చూపటం సంతోషంగా ఉందని అంటున్నారీ యువ డెవలపర్స్. రానున్న కృష్ణా పుష్కరాల సమయంలో ఈ టెక్నాలజీని మరింత అప్‌గ్రేడ్ చేసి పెద్ద ఎత్తున వినియోగిస్తామని అంటున్నారు. ఈ నూతన వెబ్ పోర్టల్ అందుబాటులోకి రావటంతో పోలీస్ ఉన్నతాధికారులకు డ్రోన్ మానిటరింగ్ ప్రక్రియ అత్యంత సులువుగా మారనుంది.

"ఎన్టీఆర్ జిల్లా పరిధిలో మొత్తం 40 డ్రోన్లు వినియోగిస్తున్నారు. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు మేం పైథాన్‌ లాంగ్వేజీ వినియోగించి సెంట్రల్‌ డ్రోన్ మానిటరింగ్ పోర్టల్ తయారు చేశాం. దీనివల్ల ఒకేసారి 40 డ్రోన్లు ఎక్కడెక్కడ ఎగురుతున్నాయి, ఏ విజువల్స్‌ను రికార్డు చేస్తున్నాయో ఒకే డ్యాష్‌ బోర్డులో చూడవచ్చు. ఎంత సేపు డ్రోన్స్ ఎగురుతున్నాయి అనే అనలిటిక్స్‌ సమాచారం కూడా ఈ సిస్టమ్ అందిస్తుంది. డ్రోన్ ఎగురుతున్న సమయంలో ఆ ఫ్రేమ్‌లో ఉన్న మనుషుల సంఖ్య, వాహనాల సంఖ్య ఏఐ పరిజ్ఞానంతో ఆటోమేటిక్‌గా లెక్కించేలా దీనిని సిద్ధం చేశాం. భవిష్యత్త్‌లో డ్రోన్ కెమెరా ముందుకు వచ్చే వాహనాల నెంబర్ ప్లేట్లను గుర్తించే విధంగా ఈ పోర్టల్‌ను అప్‌డేట్ చేస్తాం". -శ్రీనివాసరెడ్డి, ఇంజినీరింగ్ విద్యార్ధి

"కళాశాల ముగిసిన తర్వాత రోజు 2 నుంచి 3 గంటల పాటు, రెండు నెలల పాటు నిరంతరం కసరత్తు చేసి డ్రోన్ మానిటరింగ్ వెబ్ పోర్టల్ అందుబాటులోకి తీసుకువచ్చాం. విద్యార్థి దశలోనే సమాజ భద్రతకు సాంకేతిక పరిష్కరం చూపటం సంతోషంగా ఉందిరానున్న కృష్ణా పుష్కరాల సమయంలో ఈ టెక్నాలజీని మరింత అప్‌గ్రేడ్ చేసి పెద్ద ఎత్తున వినియోస్తాం". -లిఖిత, ఇంజినీరింగ్ విద్యార్ధిని

నగరాల్లో హాస్టల్స్, రూమ్స్ దొరకడం లేదా? - 'పీజీఫై' యాప్​తో బ్యాచిలర్ కష్టాలకు చెక్

అటు చదువు, ఇటు కళ - ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్న రిషిక