ETV Bharat / state

అమాయక యువతులపై లైంగిక వేధింపులు - రావణ్‌ ఫోన్ డేటాతో వెలుగులోకి షాకింగ్ విషయాలు

వెలుగులోకి యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అకృత్యాలు - రావణ్ ఫోన్‌లో నుంచి వెలుగులోకి వచ్చిన సంచలన వీడియోలు - అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసినట్లు సమాచారం

YouTuber Prashna Ravan Case Update
YouTuber Prashna Ravan Case Update (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 8, 2026 at 1:31 PM IST

2 Min Read
Choose ETV Bharat

YouTuber Prashna Ravan Case Update: యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్‌ రావణ్‌ అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు అతని ఫోన్ డేటాలో కీలక ఆధారాలు గుర్తించినట్లు తెలుపుతున్నారు. పోలీసుల విచారణలో అతని ఫోన్​ చెక్​ చేస్తున్నప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో షాకింగ్ విషయాలు బయటపడ్డాయన్నారు. రావణ్​ అమాయక యువతులను లైంగికంగా వేధించినట్లు, అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసినట్లు తెలుస్తుంది. డేటా ఆధారంగా సుమారు 10 మంది బాధితులను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుడి ఫోన్ డేటాపై కాకినాడ జిల్లా పోలీసులు లోతైన విచారణ చేపట్టారు.

పిఠాపురం పోలీసులు ఈ నెల 1న జోసెఫ్‌ను అరెస్ట్ చేశారు. ఈ నెల 2న సర్పవరం పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లాలో అరెస్టయిన సమయంలో ఫోన్ డేటాను విశ్లేషించిన పోలీసులు డిలీట్ చేసిన డేటా కోసం ఫోన్‌ను ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్‌తో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

అసలేం జరిగిందంటే: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబుపై యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల అతనిపై వరుస కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మొదట పిఠాపురం పోలీసులు ఈ నెల 1న అర్ధరాత్రి దాటాక హైదరాబాద్‌లో అతన్ని అరెస్ట్ చేసి పిఠాపురం తరలించారు. మరుసటి రోజు (ఇదే నెల 2న) సర్పవరం పోలీసులు పిఠాపురం కోర్టు రావణ్‌కు బెయిల్ మంజూరు చేసిన కొద్దిసేపటికే పాత కేసులో కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రావణ్ పై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో సుమారు 35 కేసులు నమోదయ్యాయి.

18 వరకు రిమాండ్‌: తాజాగా ఈ నెల 5న, గన్నవరం పోలీసులు యూట్యూబర్ రావణ్‌పై దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారంటూ బీఎన్‌ఎస్‌లోని 152 సహా పలు సెక్షన్లు, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని (ఉపా) సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఆదివారం సాయంత్రం రావణ్‌ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈనెల 18 వరకు రిమాండ్‌ విధించారు.

'ఫోన్‌లో మావోయిస్టు భావజాలం - హిడ్మాను కీర్తిస్తూ ప్రసంగాలు' - రావణ్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు

ప్రశ్న రావణ్‌కు 14 రోజుల రిమాండ్‌ - నెల్లూరు జైలుకు తరలింపు