ETV Bharat / state

రక్షణ రంగంలో సత్తాచాటిన యువతీ యువకులు- 50 శాతం మహిళలే

రక్షణ దళాల్లో కొలువులు సాధిస్తున్న యువత- 18వ రోజ్‌గార్‌ మేళాలో ఎంపికైన 61 వేలమంది విద్యార్థులు-సాఫ్ట్‌వేర్‌ నుంచి రక్షణ రంగంవైపు అడుగులు- పక్కా ప్రణాళికతో సన్నద్ధం, పరీక్షల్లో విజయం

Youth Cracked Defence Jobs Yuva Special Story
Youth Cracked Defence Jobs Yuva Special Story (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 3, 2026 at 3:09 PM IST

|

Updated : March 3, 2026 at 4:59 PM IST

2 Min Read
Choose ETV Bharat

Youth Cracked Defence Jobs Yuva Special Story: దేశ రక్షణ రంగంలో ఉపాధి కోసమే కలలు కన్నారు కొందరు యువతీ యువకులు. సాఫ్ట్‌వేర్ కొలువును కాదని, సైనికులుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సీఆర్​పీఎఫ్​, సీఐఎస్​ఎఫ్​, బీఎస్​ఎఫ్​, ఐటీబీపీ రక్షణ రంగంలో పలు కొలువులు సాధించారు. వారెవరు? పరీక్షలకు ఎలా సన్నద్ధం అయ్యారు అనే విషయాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

కష్టపడ్డారు- కల సాకారం చేసుకున్నారు: దేశ రక్షణ రంగంలో కొలువు కొట్టాలని చాలా మంది కలలు కంటారు. అంతే కాదు ప్రణాళిక వేసుకొని మరీ పరీక్షలకు సన్నద్ధం అవుతారు. అయితే జవానుగా మారాలనే కోరిక తీరడం అంత సులువేం కాదు. కొందరు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించక వెనుదిరిగితే మరికొందరు ఈవెంట్స్‌లో ఫెయిల్‌ అవుతుంటారు. ప్రయత్నంలో విఫలమైనా ఏళ్ల తరబడి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వీరందరూ అదే విధంగా కష్టపడి కల సాకారం చేసుకున్నవారే.

పరీక్షలో నెగ్గారు: దేశానికి అన్నం పెట్టే రైతు, మధ్య తరగతి బిడ్డలే సైనికులైతే ఆ ఆనందమే వేరు. దేశ అత్యున్నత దళాల్లో కొలువు రావడంతో దేశానికి సేవచేసే అవకాశం వచ్చిందని సంబర పడుతున్నారు ఆ యువతీయువకులు. కేంద్రం రోజ్‌గార్‌ మేళాలో భాగంగా గత ఏడాది రాష్ట్ర ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన పరీక్షలో నెగ్గి దేహ ధారుడ్య పరీక్షలను పూర్తిచేసుకున్నారు.

సైనికులుగా మారాలనే కలతో సాఫ్ట్‌వేర్‌ కొలువును వదిలేశారు . రక్షణ రంగంలో ఉద్యోగం సాధించడానికి శ్రమించారు. ఉదయాన్నే మైదానంలో పరుగులు తీస్తూ, నిరంతరం మాక్‌ టెస్టులు రాస్తూ పరీక్షలకు సన్నద్ధం అయ్యారు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం, గురువులు ఇచ్చిన శిక్షణతో చివరికి అనుకున్నది సాధించామని చెబుతున్నారు యువ విజేతలు.

'మానాన్న అంబులెన్స్​ డ్రైవర్​గా పనిచేస్తున్నారు. మేము ఇద్దరం ఆడపిల్లలం. మా చెల్లి ఐటీ రంగంలో ఇద్యోగం చేస్తుంది. నేను ఐటీ ఉద్యోగిగా పని చేస్తూనే డిఫెన్స్​ కోసం శిక్షణ పొందాను. నా విజయం మా తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్నిస్తుంది. దీనికోసం నేను ఎంతో క్రమశిక్షణతో పనిచేశాను. నా శ్రమకు నిదర్శనం ఈ ఆఫర్​ లెటర్​. దేశానికి నా వంతు సేవ చెయ్యాలనే ఈ ఉద్యోగం కోసం కష్టపడ్డాను.' - రక్షణ రంగంలో ఉద్యోగం సాధించిన యువతి


50 శాతం మహిళలే: ఒకప్పుడు ఆడపిల్ల సైన్యంలో ఉద్యోగం చేస్తోందంటే అమ్మో అనేవారు. కానీ ఇప్పుడు యువతులు కూడా దేశ రక్షణ దళం వైపు అడుగులు వేస్తున్నారు. విశాఖ నుంచి దాదాపు 300 మంది రక్షణ రంగంలో కొలువులు సాధిస్తే, వారిలో 50 శాతం మంది మహిళలే ఉండడం ఇందుకు నిదర్శనం. రక్షణ రంగంలో యువత భాగస్వామ్యం పెంచాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నియామకాలు చేపడుతోందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. సాధారణ కొలువు కష్ట తరమైన ఈ రోజుల్లో అకుంఠిత దీక్ష తో నిరంతర సాధనతో రక్షణ దళ సైనికులుగా యువత అడుగు పెట్టారు. ఇందులో సాఫ్ట్‌వేర్ కొలువు వదిలి సైనిక కొలువుకు అడుగులు వేసిన వారు ఉండడం దేశ యువత దేశ భక్తికి నిదర్శనం.

అమరావతి 'క్వాంటమ్ హ్యాకథాన్‌'లో జీఎంఆర్‌ విద్యార్థుల ప్రతిభ - జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి

సైబర్ నేరాలు, ఫొటో మార్ఫింగ్​లకు అడ్డుకట్ట - వినూత్న సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన స్నేహితులు

Last Updated : March 3, 2026 at 4:59 PM IST