యువతి నగ్న ఫోటోలు పంపి - డబ్బులు డిమాండ్ చేసిన యువకుడు అరెస్ట్
యువతి నగ్న ఫోటోలను ఆమె సోదరుడికి పంపిన యువకుడు - రూ.50,000 ఇవ్వాలని డిమాండ్ - యువతి ఫిర్యాదుతో అరెస్ట్ చేసి కోర్డులో హాజరుపరిచినట్లు వెల్లడించిన మేడ్చల్ పోలీసులు

Published : May 30, 2026 at 4:56 PM IST
|Updated : June 1, 2026 at 4:32 PM IST
Man Arrested in Medchal in blackmailing case : ఓ యువతి, యువకుడు ఓ కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య సాన్నిహిత్యం కుదిరింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. ఆ సమయంలో వారి మధ్య నగదు లావాదేవీలు నడిచాయి. అదే వారి మధ్య చిచ్చుపెట్టింది. చివరికి విడిపోయేందుకు దారితీసింది. అయితే తాజాగా ఆ యువకుడు చేసిన పనికి యువతి కుటుంబం షాక్‌కు గురికాగా సదరు యువకుడు జైలుకు పోవాల్సి వచ్చింది.
యువతి నగ్నఫోటోలను సేకరించిన యువకుడు : బాలాజీనగర్‌కు చెందిన యువతి, మెదక్ జిల్లా తుప్రాన్‌కు చెందిన యువకుడు గతంలో ఓ కాలేజీలో బీఫార్మసీ చదువుకున్నారు. ఆ సమయంలో వారి పరిచయం కాస్త, ప్రేమగా మారింది. ఆ సాన్నిహిత్యంతో యువతి నగ్న ఫోటోలను ఈ యువకుడు సేకరించాడు. అదే సమయంలోనే వారిద్దరి మధ్య నగదు లావాదేవీలు జరిగాయి. అనంతరం నగదు విషయంలోనే గొడవలు జరిగి, వారిద్దరూ విడిపోయారు.
లైంగిక వేధింపులు : ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న యువకుడు ఆ యువతిని లైంగిక వేధింపులు గురిచేశాడు. రెండు రోజుల క్రితం యువతి నగ్న ఫోటోలను ఆమె సోదరుడికి పంపి రూ.50 వేల నగదు డిమాండ్ చేశాడు. దీంతో షాకింగ్ గురైన యువతి కుటుంబం జవహర్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు ఆ కేసును బదిలీ చేశారు.
యువతి కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేట్‌బషీరాబాద్ ఏసీపీ శంకర్‌రెడ్డి తెలిపారు. యువకుడిని నిన్న సాయంత్రం అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇవాళ ఉదయం కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. యువతి, యువకులు ఇద్దరూ మేజర్లేనని ఏసీపీ తెలిపారు.
"యువతి కుటుంబం 28వ తేదీన జనహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మేడ్చల్ పోలీసులకు బదిలీ చేశారు. యువకుడిని అరెస్ట్ చేసి, కోర్డులో హాజరుపరిచాం. ఈ కేసులో యువతి, యువకులు ఇద్దరూ మేజర్లు" - శంకర్‌రెడ్డి, ఏసీపీ, పేట్‌బషీరాబాద్

