ETV Bharat / state

ప్లాస్టిక్​ రహిత గృహోపకరణాలు - తాటిఆకులతో మహిళల ఉపాధి

తమిళనాడు వెళ్లి తయారీ నేర్చుకున్నారు - ఇక్కడకు వచ్చి తోటి సభ్యులకు నేర్పించారు - ఈ ప్రయత్నంలో భాగంగానే 20 మంది మహిళలు తాటాకును నమ్ముకుని వివిధ వస్తువులు చేసి పదేళ్లుగా ఉపాధి పొందుతున్నారు

Women Making Household Items From Coconut And Palm Leaves
Women Making Household Items From Coconut And Palm Leaves (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 29, 2025 at 2:52 PM IST

2 Min Read
Choose ETV Bharat

Women Making Household Items From Coconut And Palm Leaves : ఆసక్తి, అభిరుచికి కాస్త సృజనాత్మకత తోడైతే చాలు ఏ పనిలోనైనా అద్భుతాలు చేయొచ్చు. ఇందుకు చదువు, వయసు, హోదా వంటివేవీ అడ్డంకి కావు అని నిరూపిస్తున్నారు అనకాపల్లి జిల్లాకు చెందిన ఇందిరా ప్రియదర్శిని గ్రూపు సభ్యురాలు జయమణి. ఆకులతో గృహోపకరణాలు తయారు చేసి కొత్తదనాన్ని పంచుతున్నారు. ప్లాస్టక్​ రహితంగా వీరు చేస్తున్న వస్తువులు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నట్లు పలువురు తెలుపుతున్నారు. వీరి ఆలోచనను మెచ్చుకుంటున్న వారు కొందరైతే, స్ఫూర్తి పొందుతున్నవారు మరికొందరు. ఒకవైపు పర్యావరణ పరిరక్షణ అంటూనే ఉంటున్నాం. మరోవైపు యథేచ్ఛగా ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నాం. ఇటువంటి పరిస్థితి నుంచి ప్రజలకు కొంతైనా మేలు చేయాలన్న ఉద్దేశంతోనే అసలు ఈ మహిళలు ఏ ఏ వస్తువులు తయారు చేస్తున్నారనేది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

తాటాకును నమ్ముకున్న మహిళలు : ప్లాస్టిక్‌ వస్తువులతో పోటీపడుతున్న ఈ గృహోపకరణాలు కొబ్బరి, తాటాకులతో చేసినవి. వీటి తయారీ వెనుక ఓ మహిళా సంఘం, ప్రకృతి ప్రేమికుడి కృషి ఉంది. ప్రకృతికి మేలు చేసేలా తమకూ ఉపాధి దొరికేలా చేసిన ప్రయత్నంలో భాగంగానే 20 మంది మహిళలు తాటాకును నమ్ముకున్నారు. వివిధ వస్తువులు చేసి పదేళ్లుగా ఉపాధి పొందుతున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన ఇందిరా ప్రియదర్శిని గ్రూపు సభ్యురాలు జయమణి పదేళ్ల కిందట తమిళనాడు వెళ్లి అక్కడ వీటి తయారీ నేర్చుకొని, వచ్చి తోటి సభ్యులకు నేర్పారు.

Women Making Household Items From Coconut And Palm Leaves
కొబ్బరి ఈనెలతో చేసిన చేపలు పట్టే ఊత (Eenadu)

ప్రకృతి ప్రేమికుడు శిక్షణ అందిస్తున్నారు : అప్పటి నుంచి అందరూ కలిసి ప్రజల అవసరాలకు తగినట్లు కొత్త వస్తువులు తయారు చేస్తున్నారు. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజారులో తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ప్రకృతి వ్యవసాయ నిపుణుడు మేకపోతుల విజయరామ్‌ కూడా కృష్ణా జిల్లా గూడూరు మండలం పినగూడూరులంక గోసదనంలోని క్షేత్రంలో కళాకారులతో తాటాకులు, ఈతాకులు, కొబ్బరి ఈనెలతో బుట్టలు, టోపీలు, చేపలు పట్టే ఊతలు తయారు చేయిస్తున్నారు. వాటిపై పలువురికి శిక్షణ ఇప్పిస్తూ వారికి ఉపాధి చూపిస్తున్నారు.

Women Making Household Items From Coconut And Palm Leaves
తాటాకులతో చేసిన బొకే (Eenadu)
Women Making Household Items From Coconut And Palm Leaves
తాటాకులతో తయారు చేసిన బుట్ట (Eenadu)

అంధ మహిళా క్రికెటర్లకు గృహోపకరణాలు పంపించిన పవన్‌ కల్యాణ్‌ - అవి ఏంటంటే?

ఇదిలా ఉండగా మరోవైపు పర్యావరణానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్‌ను ఎదుర్కోవడం కష్టం అనిపించినా, తనవంతు ప్రయత్నంగా ఒక గృహిణి ముందుకు కదిలింది. తన సంకల్పంతో మార్పు తీసుకురావచ్చని నిరూపించారు. ఆమె అనంతపురానికి చెందిన గుగ్గెళ్ల మధురిమ. చీరలతో హ్యాండ్‌బ్యాగులు తయారు చేయించి ఉచితంగా అందిస్తున్నారు. మదనపల్లిలో పుట్టిన మధురిమ, ఎంఎస్సీ బీఈడీ పూర్తి చేసి 1998లో డీఎస్సీలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా ఎంపికై ఓ పల్లెటూర్లో ఏడాదికి పైగా ఉద్యోగం చేశారు. ఈ క్రమంలోనే రోడ్లపై, మురుగు కాలువల్లోని ప్లాస్టిక్‌ వ్యర్థాలు తిని పశువులు మృత్యువాత పడటం గమనించి చలించిపోయారు. ప్లాస్టిక్‌ నియంత్రణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే మరుసటి ఏడాదే పెళ్లై అనంతపురం వచ్చేసి, ఉద్యోగానికి రాజీనామా చేసి గృహిణిగానే కొనసాగారు. అయినా ఆమె మనసు మాత్రం ఎప్పుడూ పర్యావరణం గురించే ఆలోచిస్తూ ఉండేవారని ఆ క్రమంలోనే ఈ ప్రయత్నం అని తెలుపుతున్నారు.

సృజనకు పదును - కొబ్బరి చిప్పలతో గృహోపకరణాలు