సామాజిక సమస్యలపై పెయింటింగ్స్ - ప్రజలను చైతన్యపరిచేలా డిఫ్యూటీ తహసీల్దార్ కృషి
పెయింటింగ్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న భవాని - ప్రజలను చైతన్యపరిచేలా చిత్రాలు గీస్తున్న భవాని - సామాజిక సమస్యలపై పలు పెయింటింగ్స్ - 8 ఏళ్లుగా డిఫ్యూటీ తహసీల్దార్‌గా బాధ్యతలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 4, 2026 at 2:17 PM IST
|Updated : March 4, 2026 at 4:45 PM IST
Woman Inspiring Story Deputy Tahsildar by Profession and Artist by Passion: ఒకప్పుడు చిత్రకళకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ప్రస్తుతం కాలం మారింది. డ్రాయింగ్ నేర్చుకునేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కానీ ఈ చిత్రాల ద్వారానే చెప్పాలనుకున్నది సూటిగా చెప్పొచ్చు అని అనుకుంది ఓ మహిళ. 8 ఏళ్లుగా డిఫ్యూటీ తహసీల్దార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే చిత్రకళలో రాణిస్తోంది. కుంచెతో చిత్రాలకు జీవం పోస్తోంది. మహిళా సాధికారత, సమాజంలో నెలకొన్న సమస్యలను ప్రతిబింబిస్తూ జీవకళ ఉట్టిపడేలా పెయింటింగ్స్ వేస్తోంది. విజయవాడకు చెందిన భవాని. చిత్రలేఖనం ఈ కళకు ఒకప్పుడు ఎంతో ఆదరణ ఉండేది. కళాకారులూ ఎక్కువగానే ఉండేవారు. రాను రానూ పెయింటింగ్‌పై ఆసక్తి చూపించే వారు తగ్గిపోయారు.
పాఠాలు చెబుతూనే చిత్రకళపై కార్యక్రమాలు: కానీ ఈ మహిళ మాత్రం అటు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే చిత్రలేఖనంలో రాణిస్తోంది. తన పెయింటింగ్స్ ద్వారా సామాజిక అంశాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. కాన్వాస్‌పై రంగులద్దుతున్న ఈమె భవాని. స్వస్థలం విజయవాడ. బాల్యం నుంచే డ్రాయింగ్‌పై ఆసక్తి. ఇంటర్‌లో బైపీసీ కావడంతో ఎక్కువగా చిత్రాలు గీసే అవసరం, అవకాశం ఉండేది. ఈ క్రమంలో ఆ ఆసక్తి మరింత పెరిగింది. డీఈడీ పూర్తి చేసి ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం సాధించింది. విద్యార్థులకు పాఠాలు చెబుతూనే చిత్రకళపై ఆసక్తి పెరిగేలా అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తూనే పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. ఆ క్రమంలోనే 2018లో డిఫ్యూటీ తహసీల్దార్‌గా ఎంపికైంది.
అకాడమీలో శిక్షణ పెయింటింగ్‌లో మెళకువలు: 8 ఏళ్లుగా కృష్ణాజిల్లా గన్నవరంలో డిఫ్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న భవాని ప్రజలతో మమేకం అవుతూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ సేవలు అందిస్తోంది. సామాజిక పరిస్థితులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆమెను ఆలోచించేలా చేశాయి. తన కళ ద్వారా సామాజిక సమస్యలపై ప్రజలను చైతన్య పరచాలని నిర్ణయించుకుంది. ఈ రంగంలో మరింత రాణించాలన్న ఆలోచనతో కానూరులోని ఓ అకాడమీలో శిక్షణ తీసుకుంది భవాని. ఇక్కడే పెయింటింగ్‌లో మెళకువలు నేర్చుకుంది. మహిళా సాధికారత, రోడ్డు ప్రమాదాలు, మానవ సంబంధాలు వంటి సామాజిక అంశాలపై తన కళ ద్వారా చైతన్య పరుస్తోంది.
'చిన్నప్పటినుంచి నేను చిన్న చిన్న బొమ్మలు వేసేదాన్ని. అప్పుడు ఇది ఒక అలవాటుగా మాత్రమే ఉండేది. ఇంటర్‌లో నేను బైపీసీ చదివాను. ఆ సమయంలో పెయింటింగ్ మీద మరింత ఇష్టం పెరిగింది. ఆ తర్వాత కొన్నేళ్లకు టీచర్‌గా పని చేస్తూ వినూత్నంగా పెయింటింగ్ చేసేదాన్ని. నేను వేసే బొమ్మలతో సమాజానికి ఎదైనా చెప్పాలని అనుకుంటాను. మహిళా సాధికారత నా లక్ష్యం.' -భవాని,పెయింటర్
అటు ఉద్యోగం ఇటు వ్యాపకం: భవాని అభిరుచి, ఆలోచనలకు అనుగుణంగా ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు ఆమె కుటుంబ సభ్యులు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని అప్పుడే సమాజం, వారి కుటుంబం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. డ్రాయింగ్‌లో భవాని విజయాలు సాధించడం గర్వంగా ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవలు అందిస్తూనే సమాజంలో దాగి ఉన్న రుగ్మతలను దూరం చేసేందుకు భవాని తన వంతు కృషి చేస్తోంది.
కళాకారులకు చేయూతగా చిత్రిక- 20 ఏళ్లుగా సేవలందిస్తున్న విజయ స్విత
సివిల్స్ పరీక్షలో 3 సార్లు విఫలం - గ్రూప్-1, 2 కొలువులు సాధించిన అక్కాచెల్లెళ్లు

