అమరావతి టూ హైదరాబాద్- కేవలం 70 నిమిషాల్లోనే: అశ్వినీ వైష్ణవ్
12 నిమిషాల్లో అమరావతి నుంచి చెన్నైకి- కోల్‌కతా నుంచి చెన్నై వరకున్న రెండు లైన్లను నాలుగు లైన్లుగా విస్తరిస్తాం: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవి

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 29, 2026 at 11:15 AM IST
Minister Ashwini Vaishnav Over Bullet Train in Vijayawada: కేవలం 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు చేరుకోవచ్చని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టుతో ఇది సాకారం అవుతుందని ఆయన అన్నారు. 112 నిమిషాల్లో అమరావతి నుంచి చెన్నైకి వెళ్లొచ్చని చెప్పారు. కోల్‌కతా నుంచి చెన్నై వరకున్న రెండు లైన్లను నాలుగు లైన్లుగా విస్తరించనున్నట్లు అశ్వినీ వైష్ణవి తెలిపారు.
500 రైళ్లతో అనుసంధానం: కంటెయినర్, సరకు రవాణా రైళ్లతో పాటు మరో 500 రైళ్లతో ఈ ప్రాంతాన్ని అనుసంధానిస్తామన్నారు. విశాఖలోని గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపనలో మంగళవారం పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ‘దక్షిణాదికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పూర్తిన్యాయం చేస్తోందన్న మంత్రి. ప్రతిపక్షాలు మాత్రం ప్రతి అంశాన్నీ కావాలనే రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఇక్కడే అన్నీ ఉత్పత్తి చేసుకోవాలి: ఐటీ సేవల్లో భారత్ గణనీయమైన ప్రగతి చూపిస్తోంది. కానీ సెమీకండక్టర్లు, చిప్‌లు, ల్యాప్‌టాప్ వంటివాటి ఉత్పత్తిలో మాత్రం వెనుకబడ్డామని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ప్రధాని చొరవతో మొబైళ్ల తయారీలో ముందున్నట్లు తెలిపారు. సెమీకండక్టర్ మిషన్‌లో భాగంగా ఇప్పటికే వాణిజ్యపరమైన ఉత్పత్తిని ఇక్కడ ప్రారంభించామన్నారు. డేటాసెంటర్లకు అవసరమైన సర్వర్లను దేశంలోనే ఉత్పత్తి చేసుకోవాలని టెక్ కంపెనీలకు పిలుపునిచ్చామని వివరించారు. గూగుల్ (Google) కూడా తమ సర్వర్లు, సీపీయూ, చిప్‌లను ఇక్కడే ఉత్పత్తి చేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ఇస్తున్న ఈ ఆహ్వానాన్ని గూగుల్ సీఈఓకు సంస్థ ప్రతినిధులు తెలియజేయాలని అశ్వినీ వైష్ణవ్ కోరారు.
విశాఖ ఇక ‘ఏఐ పట్నం’: విశాఖ నుంచి మూడు సబ్‌సీ కేబుళ్లు వేస్తున్నందుకు గూగుల్‌కు అశ్వినీ వైష్ణవ్ ధన్యవాదాలు తెలిపారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్‌తో విశాఖ ఇక ‘ఏఐ పట్నం’గా మారుతుంది. ఈ గూగుల్ ఏఐ హబ్ ద్వారా విశేషమైన సేవలందుతాయని, ప్రధాని మోదీ చేతుల మీదుగా ఏఐ డేటాసెంటర్ ప్రారంభించే రోజు దగ్గర్లోనే ఉందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
జూన్ 1 నుంచి అమల్లోకి దక్షిణ కోస్తా రైల్వేజోన్ -కీలక అధికారుల నియామకం పూర్తి
ఐటీ హబ్‌గా మారేందుకు హైదరాబాద్‌కు 30 ఏళ్లు - విశాఖను మాత్రం పదేళ్లలోనే మారుస్తాం: మంత్రి లోకేశ్

