భర్త ముందే భార్య గొంతు కోసి చంపిన దుండగులు - చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి దారుణం
ఐడీఏ బొల్లారం పరిధిలో సంతకు వెళ్లిన దంపతులు - ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆగిపోయిన బైక్ - చెట్ల పొదల్లో నుంచి వచ్చి భర్తపై దాడి చేసి భార్యను లాక్కెళ్లి చంపిన దుండగులు

Published : May 31, 2026 at 1:28 PM IST
IDA Bollaram Murder Case : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త కళ్ల ముందే గుర్తు తెలియని దుండగులు భార్య గొంతు కోసి చంపేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ కథనం ప్రకారం బిహార్‌కు చెందిన అనిల్ కుమార్, మీనాదేవి దంపతులు వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు.
చెట్ల పొదల్లోంచి వచ్చి గొంతు కోసేశారు : శనివారం రాత్రి ఐడీఏ బొల్లారం పరిధిలో మార్కెట్‌కు వెళ్లారు. ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా గండిగూడెం క్రీడా ప్రాంగణం వద్దకు రాగానే బైక్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ క్రమంలో దుండగులు వేగంగా చెట్ల పొదల్లోంచి దూసుకొచ్చి అనిల్‌పై దాడి చేసి తన భార్య మీనాదేవీని లాక్కెళ్లారు. ఆ తర్వాత ఆమె (35) గొంతు కోసి పరారయ్యారు. అడ్డుకోబోయిన భర్తపైనా కత్తులతో తీవ్రంగా దాడి చేశారు. గాయపడిన అనిల్ కుమార్‌ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించడంతో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐడీఏ బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా : ఐడీఏ బొల్లారం హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోందని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. అనిల్, మీనా గత కొంతకాలంగా బొల్లారంలో ఉంటున్నారని తెలిపారు. బొల్లారంలోని మార్కెట్‌కు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఈ హత్య ఘటన జరిగిందిని వివరించారు. దారిలో బైక్ ఆగిపోవడంతో భార్యను దుండగులు తీసుకెళ్లినట్లు, ఆపై ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారని వెల్లడించారు.
"ఐడీఏ బొల్లారం హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. అనిల్ కుమార్ షా, మీనా కుమారిలు బిహారి కాలనీలో ఉంటున్నారు. 25 ఏళ్ల నుంచి బొల్లారంలో నివసిస్తున్నారు. బొల్లారంలోని మార్కెట్‌కు వెళ్లి తిరిగి వచ్చేటపుడు ఈ ఘటన జరిగింది. దారిలో వారు ప్రయాణిస్తున్న బైక్ ఆగిపోయింది. అదే సమయంలో భార్యను గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లోకి తీసుకెళ్లారని భర్త అనిల్ చెప్పాడు. భార్యను వెతికే పనిలో ఉన్నప్పుడు దుండగులు గొంతు కోశారని ఫిర్యాదు చేశాడు. కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రత్యేక బృందాలతో అన్ని కోణాలు పరిశీలిస్తున్నాం" - సీహెచ్ శ్రీనివాస్, శేరిలింగంపల్లి డీసీపీ
'స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగలేకే న్యాయవాది హత్య' : మొయిజుద్దీన్ కేసులో ఏడుగురి అరెస్ట్
భర్తపై రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ - సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య

