కాకినాడలో ప్రేమ పేరుతో మోసం - ఒకరితో వివాహం, ఆరుగురితో సహజీవనం
ప్రేమ పేరుతో మోసగించాడని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు - జగన్నాథపురానికి చెందిన మటన్ షాప్ నిర్వాహకుడు గౌస్ మొహిద్దీన్‌పై కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు - గౌస్ మొహిద్దీన్ వేధిస్తున్నాడని బాధితురాలి ఆరోపణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 1, 2026 at 3:41 PM IST
Kakinada Woman Conversion Case : ఆ యువతి చదువుకునే రోజుల్లో వేరే మతం వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. మతాలు వేరైనా, పెద్దలు ఒప్పుకోకున్నా వారిని ఎదురించి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత అతడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. వేధింపులకు గురి చేస్తూ బలవంతంగా ఆమెను తమ మతంలోకి మార్చాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.
తనకు తెలియకుండా మరో అయిదారుగురు మహిళలను కూడా ప్రేమ పేరుతో ట్రాప్ చేసి సహజీవనం చేస్తున్నాడని బాధితురాలి ఆరోపించింది. ఇదేంటని ప్రశ్నించినందుకు తనపై దాడికి పాల్పడ్డాడని వాపోయింది. తనకు న్యాయం చేసి అతడ్ని శిక్షించాలని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది.
జగన్నాథపురానికి చెందిన గౌస్ మొహిద్దీన్ తనను పెళ్లి చేసుకుని వేధింపులకు గురి చేశాడని అతని భార్య ఉమల్ ఖైర్ అలియాస్ బాలరమ్య ఆరోపించారు. అంతేకాక మరో అయిదుగురు హిందూ మహిళలను ఉచ్చులోకి లాగి సహజీవనం చేస్తూ మతమార్పిడికి పాల్పడ్డాడని ఆరోపణలు చేసింది. ఈ మేరకు సోమవారం బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్‌తో కలిసి కాకినాడ ఎస్పీ బిందుమాధవ్‌కు ఫిర్యాదు చేశారు. మొహిద్దీన్ నుంచి రక్షణ కల్పించాలని, కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇందుకు సంబంధించిన వివరాలను బాలరమ్య మీడియాకు వెల్లడించారు. ‘నా పేరు శిరివూరి బాలరమ్య. జగన్నాథపురంలో డిగ్రీ చదివేటప్పుడు మొహిద్దీన్‌తో పరిచయం ఏర్పడింది. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా మటన్ దుకాణం నడిపే మొహిద్దీన్‌ను ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాను. రెండు నెలలకే అతని వేధింపులు మొదలయ్యాయి. నన్ను బలవంతంగా మాతమార్పిడి చేయించి షేక్ ఉమల్ ఖైర్‌గా నా పేరు మార్చాడు. కుమార్తె పుట్టిన తర్వాత నన్ను తీవ్రంగా హింసించడంతో స్థానిక పెద్దలకు చెప్పినా అతనిలో మార్పులేదు. నేను చూస్తుండగానే అయిదారుగురు మహిళలతో సహజీవనం చేశాడు.
అడిగితే ఏడుగురిని చేసుకున్నా అడిగేవారు లేరని, దిక్కున్నచోట చెప్పుకోమని తీవ్రంగా కొట్టాడు. అతడి నుంచి ఓసారి తప్పించుకున్నాను. అయినా వెతుక్కుంటూ వచ్చి కత్తులు దూశాడు. ఇతనికి భయపడి దూరంగా ఉంటున్న మా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ రెండో అమ్మాయినీ వేధిస్తానని బెదిరింపులకు దిగాడు. అతనితో సన్నిహితంగా తిరిగిన ఓ యువతిని కత్తితో గాయపర్చడంతో గతంలో 20 రోజులు రిమాండ్‌లో పెట్టి రౌడీషీట్ తెరిచారు. ఇటీవల మరో ఎస్సీ యువతిని వేధించగా ఆమె ఫిర్యాదుతో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడు. దీంతో ధైర్యం చేసి ఫిర్యాదు చేయడానికి వచ్చాను’ అంటూ బాలరమ్య ఆవేదన వ్యక్తం చేశారు.
Kakinada Love Jihad Case : మరోవైపు ఎస్పీ కార్యాలయం ఎదుటే తన తల్లితో నుదుటిపై బొట్టు పెట్టించుకుని తాను తిరిగి హిందూ మతంలోకి వచ్చినట్లు బాలరమ్య ప్రకటించారు. లవ్ జిహాద్‌ను తలపించేలా జరుగుతున్న బలవంతపు మతమార్పిడిలపై లోతైన దర్యాప్తు చేయాలని బీజేపీ నేత రామ్‌కుమార్ పోలీసులను కోరారు.
వణుకు పుట్టిస్తున్న సాధిక్ దురాగతాలు - సౌజన్య భర్తను సైనైడ్ ఇచ్చి చంపాడా?
సాధిక్ వేధింపులతోనే ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య: విజయసాయిరెడ్డి

