ETV Bharat / state

నీటి నిల్వల ఆనవాళ్లను గుర్తించిన నేషనల్​ రిమోట్​ సెన్సింగ్​ సెంటర్​ - ఉపగ్రహ చిత్రాల్లో ఏముందంటే?

నీటి నిల్వలకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించిన నేషనల్​ రిమోట్​ సెన్సింగ్​ సెంటర్​ - ఒకటి 19 హెక్టార్లు, మరొకటి 11 హెక్టార్ల విస్తీర్ణం - మరోసారి వరద ముప్పుకు అవకాశం

NEPAL FLOODS UPDATE
నేపాల్​లో ఆకస్మిక వరదలు (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 29, 2026 at 8:52 AM IST

2 Min Read
Choose ETV Bharat

Water reserves In Trishuli River : నేపాల్​ ఆకస్మిక వరద విపత్తు ఘటన కలిచివేస్తోంది. వాటి తాలూకు జ్ఞాపకాలు అలా ఉండగానే మరోవైపు త్రిశూలి నదీ తీరాల్లో భారీ సరస్సులు వాటిలోని నీటినిల్వలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్​లోని నేషనల్​ రిమోట్​ సెన్సింగ్​ సెంటర్​ నీటి నిల్వలకు సంబంధించిన సరస్సులను గుర్తించాయి. ఈ సెంటర్, ఇస్రో సహకారంతో ఉపగ్రహ చిత్రాల ద్వారా ప్రభావిత ప్రాంతాలను అధ్యయనం చేస్తుంది. విలయం సంభవించిన రోజుకు ముందు ఈ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది. నది ఉప్పొంగిన తర్వాత పరిస్థితులు ఎలా మారాయని నాణ్యమైన విజువల్స్‌ ద్వారా ఎన్‌ఆర్‌ఎస్‌సీ అన్వేషణ చేస్తోంది.

రెండు నీటి నిల్వల గుర్తింపు : నేపాల్​లోని రసువా జిల్లాలో త్రిశూలి నది తీరంలో 19 హెక్టార్ల విస్తీర్ణంలో నీటితో నిండిన పెద్ద సరస్సు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో తేలింది. ఇది ప్రస్తుతం కొండ పక్కన ఉండటంతో ఎటువంటి ముప్పు లేదని అంటున్నారు. కానీ దీనిపై నిరంతర పర్యవేక్షణ తప్పనిసరిగా అవసరమని నిపుణులు భావిస్తున్నారు. దీనితోపాటు 11 హెక్టార్ల విస్తీర్ణంలో మరో సరస్సు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇది నదీ గర్భంలో ఉందని కనుగొన్నారు. అయితే టిబెట్​-నేపాల్​ సరిహద్దులో మంచు పర్వతాలు ఉండటం వాటి దిగువన త్రిశూలి నది అలాగే నీటి సరస్సులు ఉండటంతో ఆకస్మిక వరదలకు దారి తీస్తోందని అంటున్నారు. అక్కడ కరిగే మంచు కొండలు విరిగి సరస్సులో పడే అవకాశం ఉండటంతో ఏఏ ప్రాంతాలకు ముప్పు ఉందని విశ్లేషణ చేస్తున్నారు.

Trishuli Hydroelectric Project washed away in floods
వరదల్లో కొట్టకుపోయిన త్రిశూలి విద్యుత్ ప్రాజెక్ట్ (Eenadu)

కొట్టుకుపోయిన త్రిశూలి విద్యుత్ ప్రాజెక్ట్ : నేపాల్‌లోని కీలకమైన త్రిశూలి జలవిద్యుత్ కేంద్రాలు భారీగా దెబ్బతిన్నాయి. నువాకోట్ జిల్లాలోని 24 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఆకస్మిక వరదలు, బురద, రాళ్ల ధాటికి పూర్తిగా ధ్వంసమైంది. అంతేకాకుండా ఈ కేంద్రానికి ఎగువన ఉన్న భైన్సే ఆమా వంతెన కూడా కొట్టుకుపోయింది. త్రిశూలి నదిపై ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అప్పర్ త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్ట్ (216 మెగావాట్లు) 90 శాతం మేర దెబ్బతింది.

మంత్రి పొంగులేటి ఆరా : నేపాల్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ వాసుల పరిస్థితి గురించి విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఆరా తీశారు. విపత్తు నిర్వహణ శాఖ, హైదరాబాద్‌లోని కంట్రోల్ రూమ్ దిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల నుంచి ఆయన తాజా సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభావిత వ్యక్తులను వీలైనంత త్వరగా గుర్తించాలని అధికారులను ఆయన ఆదేశించారు. సమాచారాన్ని సేకరించేందుకు రాష్ట్ర అధికారులు విదేశీ వ్యవహారాల శాఖతోపాటు నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రం నుంచి దాదాపు 23 మంది మానస సరోవర్ యాత్రకు వెళ్లినట్లు విపత్తు నిర్వహణ శాఖ వద్ద రికార్డులు ఉన్నట్లు తెలుస్తోంది.

నేపాల్‌ వరద విధ్వంసం- 359కి చేరిన మృతుల సంఖ్య- 288 మంది భారతీయలు గల్లంతు

నేపాల్‌ వరదలకు భారత్‌ భారీ సాయం- రెండో విమానంలో 37.5 టన్నుల సామగ్రి