ఐరాస సదస్సులో తెలుగులో మాట్లాడారు -తెలుగు రాష్ట్రాల నుంచి సునీత ఒక్కరే
థాయ్‌లాండ్‌లో ‘యునైటెడ్ నేషన్స్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (యూఎన్- ఎస్‌డీజీఎస్)’ సదస్సు- హాజరయ్యే అవకాశాన్ని అందుకున్నారు ఆర్. సునీత -యూఎన్ ఫర్ సౌత్ ఏషియన్ కేటగిరీలో పదో స్థానం

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 10:46 AM IST
Vishaka Engineering College ECE HOD Suneetha Who Was Attend Un -SDGS Meet : పేదరికం తగ్గాలి, భూమిని సంరక్షించుకోవాలి, ప్రపంచమంతా శాంతితో నిండిపోవాలి ఇలాంటి 17 లక్ష్యాలను 2030 కల్లా సాధించే దిశగా పని చేస్తోంది ఐక్యరాజ్య సమితి. దానికి సంబంధించి తాజాగా థాయ్‌లాండ్‌లో ‘యునైటెడ్ నేషన్స్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (యూఎన్- ఎస్‌డీజీఎస్)’ ఓ సదస్సును నిర్వహించింది. దానికి హాజరయ్యే అవకాశాన్ని అందుకున్నారు ఆర్. సునీత. ఆ విశేషాలను పంచుకున్నారు. తన విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
బయోమెడికల్ యాంటినాల మీద పరిశోధన : సునీతది విశాఖపట్నం, సాంకేతిక ఇంజినీరింగ్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ఈసీఈ విభాగాధిపతిగా పని చేస్తున్నారు. తనకు మొదట్నుంచి ప్రాజెక్టులు చేయడం, జర్నల్స్ రాయడం ఇష్టమని చెబుతున్నారామె. ఏయూలో కేన్సర్ చికిత్స గుర్తింపులో ఉపయోగించే బయోమెడికల్ యాంటినాల మీద పరిశోధన చేసినట్లు వివరిస్తున్నామె. ఐరాస లక్ష్యాలను అనుసరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో అన్ని సంస్థలకూ పిలుపునిచ్చాయని తెలిపారు. వాటిల్లో తమ కళాశాలకు కొన్ని సరిపోతాయనిపించి కొన్ని నెలలుగా సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు సునీత.
భాగస్వాములుగా అధ్యాపకులు : ఇందుకోసం మల్టీడిసిప్లినరీ విభాగం, బోధన సిబ్బంది, విద్యార్థులతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు సునీత పేర్కొన్నారు. శిక్షణ, నైపుణ్యాల పెంపు వంటి వాటితో పాటు ఆరోగ్య సంరక్షణలో ఏఐ, ఐవోటీల అమలు, గ్రామాల్లో తడి, పొడి చెత్త నిర్వహణ, నీటి సమస్య, విద్యుదుత్పత్తి, ప్రభుత్వ పాఠశాలల్లో లింగ సమానత్వం, ఆర్థిక అసమానతలపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలనూ నిర్వహించినట్లు తెలుపుతున్నారు సునీత. ఈ క్రమంలో విద్యార్థులు, వివిధ విభాగాల అధ్యాపకులనీ ఇందులో భాగస్వాములుగా చేసినట్లు ఆమె వివరిస్తున్నారు. అవగాహన కోసం యూఎన్ వెబ్‌సైట్‌ని అనుసరించేవారని, గత ఏడాది కాలుష్య నియంత్రణ మీద చేపట్టిన ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని వెల్లడిస్తున్నారు. యూఎన్ ఫర్ సౌత్ ఏషియన్ కేటగిరీలో పదో స్థానంలో నిలవడమే కాదు, నిధులూ అందాయని సునీత తెలుపుతున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి సునీత ఒక్కరే : అవకాశం అలా తమ కళాశాలలో చేపట్టిన కార్యక్రమాలన్నింటి మీద నివేదిక తయారు చేసి యూఎన్ - ఎస్‌డీజీఎస్‌కి పంపినట్లు సునీత పేర్కొన్నారు. అమలు తీరు నచ్చి, సదస్సుకి హాజరవ్వాలని ఆహ్వానం పంపారని తెలిపారు. దీన్లో 108 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నట్లు వివరించారు. వాళ్లలో ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, వివిధ విభాగాల అధికారులు, పారిశ్రామికవేత్తలు ఇలా ఎందరో ఉన్నట్లు పేర్కొన్నారు. దేశం నుంచి ముగ్గురు ఎంపికవ్వగా తెలుగు రాష్ట్రాల నుంచి సునీత ఒక్కరే ఎంపికయ్యారు. నాలుగు రోజులు జరిగిన ఈ కార్యక్రమంలో యూఎన్ 17 లక్ష్యాలపైనా చర్చ జరిగినట్లు ఆమె వివరించారు.
కొత్త నైపుణ్యాలు - నైతికత, భద్రతా విషయాలకీ ప్రాధాన్యత : కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే సరి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే నైతికత, భద్రతా విషయాలకీ ప్రాధాన్యమివ్వాఇందులో తన ప్రజాప్రయోజనాల కోణంలో ఏఐ ఉపయోగం మీద ప్రసంగించినట్లు సునీత తెలుపుతున్నారు. కొత్త కొలువులు రావడం, పాతవి కనుమరుగవడం పరిణామ క్రమంలో భాగమేనని ఆమె అన్నారు. అందుకు భయపడాల్సిన పనిలేదని పేర్కొన్నారు. కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే సరి అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే నైతికత, భద్రతా విషయాలకీ ప్రాధాన్యమివ్వాలని, ఈ క్రమంలో ఏర్పడే సమస్యలను ఎలా అధిగమించొచ్చో చెప్పి హాజరైన వారి నుంచి ప్రశంసలూ అందుకున్నట్లు సునీత వివరించారు. సదస్సు అనంతరం కార్యక్రమంపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వమన్నారన్నారు. దాన్ని మాతృభాషలో చెప్పొచ్చన్నప్పుడు తెలుగులో మాట్లాడాలని. అది మరిచిపోలేని అనుభూతి అని హర్షం వ్యక్తం చేశారు.
యూనిఫామ్ వేసుకునే అవకాశం రాలేదు కానీ సైనికుడికి ఆయుధాన్ని అందించే స్థాయికి ఎదిగింది 'ఆమె'

