ETV Bharat / state

'విజయవాడ-బెంగళూరు గ్రీన్​ఫీల్డ్ ఎక్స్​ప్రెస్ హైవే' - రాష్ట్రంలోనే అతిపెద్ద సొరంగం నిర్మాణం

చకచకా గ్రీన్​ఫీల్డ్ ఎక్స్​ప్రెస్ హైవే పనులు - చురుగ్గా సాగుతున్న సొరంగం నిర్మాణం

విజయవాడ-బెంగళూరు గ్రీన్​ఫీల్డ్ ఎక్స్​ప్రెస్ హైవే
విజయవాడ-బెంగళూరు గ్రీన్​ఫీల్డ్ ఎక్స్​ప్రెస్ హైవే (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 24, 2026 at 12:31 PM IST

2 Min Read
Choose ETV Bharat

Bangalore To Vijayawada Greenfield Highway : బెంగళూరు- విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలో భాగంగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కడప జిల్లాల్లో సొరంగాల పనులు చకచకా జరుగుతున్నాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పోరుమామిళ్ల మండలం సీతారామపురం అటవీ సరిహద్దు ప్రాంతంలో 3.7 కి.మీ. సొరంగం పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద సొరంగం ఇదే కాగా, ఆరు లేన్ల హైవే కావడంతో రెండు సొరంగాలు తవ్వుతున్నారు. ఇక కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం దూదెన్నకోన సమీపంలో 179.290 కి.మీ వద్ద దాదాపు 750 మీటర్ల సొరంగం నిర్మాణాన్ని చేపడుతున్నారు. రెండు ప్రాంతాల్లోనూ ఎడమ సొరంగం ద్వారా మూడు లేన్లు, కుడి సొరంగం ద్వారా మూడు లేన్ల రహదారి నిర్మించనున్నారు. కొండను తొలచడంతో పాటు మరోవైపు సిమెంట్ కాంక్రీట్ పనులు సైతం సమాంతరంగా జరుగుతున్నాయి. ఈ రహదారి వల్ల బెంగళూరు-విజయవాడ మధ్య 100 కి.మీ. మేర దూరం, 12గంటల ప్రయాణ సమయం 6 గంటలకు తగ్గుతుంది.

బెంగళూరు - విజయవాడ గ్రీన్​ఫీల్డ్​ ఎక్స్​ప్రెస్​ వే నిర్మాణంతో రాయలసీమ రూపురేఖలు మారున్నాయి. విజయవాడ నుంచి 10 నుంచి 12 గంటలు సాగే ప్రయాణం కాస్తా ఆరేడు గంటలకు తగ్గనుంది. వాహనాలు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా రహదారి నిర్మిస్తున్నారు.

విజయవాడ-బెంగళూరు గ్రీన్​ఫీల్డ్ ఎక్స్​ప్రెస్ హైవే
విజయవాడ-బెంగళూరు గ్రీన్​ఫీల్డ్ ఎక్స్​ప్రెస్ హైవే (ETV Bharat)

శరవేగంగా చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే పనులు - 258 కిలోమీటర్లు 3 గంటల్లోనే చేరేలా నిర్మాణం

బెంగళూరు - విజయవాడ గ్రీన్​ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ వే మొత్తం కొత్తగా నిర్మిస్తున్న రహదారి కాదు. బెంగళూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్ట్‌కు సమీపంలో గల కోడూరు వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెంగళూరు-హైదరాబాద్‌ హైవేలో 110 కిలోమీటర్లు మేర ప్రయాణించాలి. ఆ తర్వాత కోడూరు నుంచి కొత్త రహదారి యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రారంభం అవుతుంది.

సీతారామపురం వద్ద 3.7 కి.మీ. సొరంగం
bangalore_to_vijayawada (ETV Bharat)

343.24 కిలోమీటర్ల దూరంలో ప్రకాశం జిల్లాలోని ముప్పవరం వద్ద చెన్నై-కోల్‌కతా రహదారి వరకు నిర్మిస్తారు. అక్కడి నుంచి విజయవాడకు 'చెన్నై-కోల్‌కతా' హైవేపై 115 కిలోమీటర్లు ప్రయాణించాలి.

ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లడానికి దాదాపు 12 నుంచి 13 గంటల సమయం పడుతుంది. గ్రీన్​ఫీల్డ్​ హైవే పూర్తయితే 6 నుంచి 7 గంటల్లోనే చేరుకోవచ్చు. శ్రీసత్యసాయి, కడప, నెల్లూరు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల మీదుగా హైవే నిర్మిస్తున్నారు. భారతమాల పరియోజన తొలి దశ కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.14 వేల కోట్లు. ఈ ఎకనమిక్ కారిడార్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 140 కిలోమీటర్లు కాగా, సింగరాయకొండ నుంచి మైదుకూరు వైపు వెళ్లే 167బీ జాతీయ రహదారి వద్ద ఇంటర్‌ ఛేంజ్‌ నిర్మిస్తున్నారు.

దూదెన్నకోన సమీపంలో సొరంగం
bangalore_to_vijayawada (ETV Bharat)

హైవే నిర్మాణంలో భాగంగా 5.31 కిలోమీటర్ల మేర ఏడు సొరంగాలు నిర్మిస్తున్నారు. ఇందులో నెల్లూరు జిల్లా సీతారామపురం మండల సరిహద్దులోని 3.67 కిలోమీటర్ల పొడవైన సొరంగం అతి పెద్దది.

దూరాన్ని దగ్గర చేసే హైటెక్ 'హైవే' - నేడు జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ

'యాక్సెస్‌ కంట్రోల్‌'గా కడప- కర్నూలు హైవే - ఇక 100 కి.మీ. వేగంతో దూసుకెళ్లొచ్చు