ETV Bharat / state

మ్యూల్‌ అకౌంట్స్‌ కేసులో కీలక పరిణామం - పరారైన కీలక సూత్రధారి

అరెస్టు చేసిన నిందితుల సమాచారంతో చెన్నై వెళ్లిన పోలీసు బృందం - ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అద్దె ఖాతాలు తెరిపిస్తున్నట్లు సమాచారం - సూత్రధారి సుబ్రమణి రాజా వెంకట్‌ కోసం చెన్నైలో వేట

Mule Accounts Case Accused Escaped
Mule Accounts Case Accused Escaped (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 18, 2026 at 2:02 PM IST

3 Min Read
Choose ETV Bharat

Mule Accounts Case Accused Escaped : తాను సాఫ్ట్​వేర్ ఇంజినీర్​ని అనీ, జీతం నెలకు రూ.30 వేలనీ ఇంటా బయటా అందరినీ నమ్మించాడు. కానీ చేసేది చట్ట విరుద్ధ కార్యకలాపాలే. ఇటీవల విజయవాడలో వెలుగు చూసిన మ్యూల్‌ అకౌంట్స్‌ కేసులో కీలక సూత్రధారి రాజా వెంకట్‌ వ్యవహారమిది. ఈ మధ్యం సైబర్ పోలీసులు అరెస్టు చేసిన మ్యూల్ అకౌంట్స్ గ్యాంగ్ మూలాలు చెన్నైలో తేలుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో రవి కుమార్, స్టీవెన్, బాజి, దుర్గాప్రసాద్​లు అరెస్టు అయ్యారు. సూత్రధారి కోసం సైబర్ పోలీసుల ప్రత్యేక బృందం చెన్నై వెళ్లింది. ఇపటికే అరెస్టయి రిమాండ్​లో ఉన్న నిందితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా చెన్నైకి చెందిన సుబ్రమణి రాజా వెంకట్, ఆకాశ్​కు అద్దె ఖాతాలు చేరేవని గుర్తించారు.

పరారీలో సూత్రధారి : ఈ వివరాల ఆధారంగా ప్రత్యేక బృందం మంగళవారం చెన్నై వెళ్లింది. అక్కడికి వెళ్లే సరికే కీలక సూత్రధారి పరారు అయ్యాడు. ఇంటి పరిసర ప్రాంతాల్లో విచారించగా రాజా వెంకట్‌ తాను సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అని అందరినీ నమ్మించినట్లు తెలిపారు. కుటుంబం వద్ద కూడా అసలు విషయం తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. ప్రాంతాల వారీగా ఏజెంట్లను పెట్టి అద్దె ఖాతాలు తెరిపిస్తున్నట్లు తేలింది.

ఈ కేసులో అరెస్టు చేసిన నిందితులు చెప్పిన ఇంకో వ్యక్తి ఆకాశ్‌ వివరాలు తెలియలేదు. తప్పుదారి పట్టించేందుకు నిందితులు అలా చెప్పారా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. సుబ్రమణి రాజా వెంకట్‌ కుటుంబం అద్దె ఇంట్లో ఉంటోంది. నిందితుడి తండ్రి చనిపోయాడు. తల్లి ఉంది. అతనికి వివాహమై, ఒక పిల్లాడు ఉన్నాడు. నిందితుడి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

మరోవైపు విజయవాడలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో భారీగా అద్దె ఖాతాలు ఉన్నట్లు ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) గుర్తించింది. సైబర్‌ నేరాలను నియంత్రించే కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందినటు వంటి ఈ ఏజెన్సీ మొత్తం 17 శాఖల్లో సుమారు 250 అకౌంట్లలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్లు తేల్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ ఖాతాలను స్తంభింపజేసింది. అనంతరం ఈ వివరాలను ఎన్టీఆర్‌ జిల్లా కమిషనరేట్‌కు అందజేసింది. ఐ4సీ గుర్తించిన వాటితో పాటు ఇలాంటి ఖాతాలు చాలా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పలు బ్యాంకులు వివిధ సేవలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాయి. సంబంధిత ఏజెన్సీకి చెందిన సిబ్బంది బ్యాంకుల్లో చక్రం తిప్పుతున్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున అద్దె ఖాతాలు తెరవగలుగుతున్నారు. ఇటీవల కేసు నమోదు చేసిన కేసులో 4వ నిందితుడైన దుర్గా ప్రసాద్‌ సైతం ప్రైవేటు ఏజెన్సీ ద్వారా బ్యాంకులో విధులను నిర్వహిస్తున్నాడు.

పెద్ద ఎత్తున అద్దె ఖాతాలు: నిందితుడు విచ్చలవిడిగా ఎటువంటి అర్హత లేని వారితో ఖాతాలను తెరిపిస్తున్నా బ్యాంకు అధికారులు అనుమతిస్తున్నారు. మ్యూల్‌ అకౌంట్లు అదే విధంగా అనుమానాస్పద లావాదేవీలపై తరచూ బ్యాంకర్లతో పోలీసులు సమావేశాలను నిర్వహిస్తున్నారు. అయినా సరే పలు బ్యాంకు శాఖలు వీటిపై ఏ మాత్రం పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. ఈ కేసులో ఫిబ్రవరి 6వ తేదీన దుర్గాప్రసాద్‌ ఓ బ్యాంకులో అకౌంట్​ను తెరిపించారు.

దీనిపై సైబర్​ క్రైమ్​ పోలీసులు ఇటీవలే సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ శాఖ ఆ బ్యాంకు మేనేజర్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ తరహా ఖాతాలపై అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. అయినా సరే పట్టించుకోకుండా ఖాతాలను తెరుస్తున్నారని నోటీసులో అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి పాత్రపై అనుమానాలు సైతం ఉన్నాయని, దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.

చేసేది సాప్ట్‌వేర్‌ జాబ్, చేతిలో హార్డ్​వేర్‌ టూల్స్‌ - సార్​దంతా నైట్‌ డ్యూటీనే!

విజయవాడలో నొక్కేస్తారు, నేపాల్​లో అమ్మేస్తారు - కొలిక్కి వచ్చిన సెల్​ఫోన్ల చోరీ కేసు!