ETV Bharat / state

స్వగ్రామంలో విజయ్‌, రష్మిక దంపతుల సందడి - 32 ఏళ్ల తర్వాత సొంతూరుకు

స్వగ్రామంలో సందడి చేసిన విజయ్‌, రష్మిక దంపతులు - నూతన ఫామ్‌ హౌస్‌లో ప్రత్యేక పూజలు చేసిన దంపతులు - 5 వేల మంది అభిమానులకు భోజన సదుపాయం ఏర్పాటు

Vijay Rashmika Visits Nagar Kurnool
Vijay Rashmika Visits Nagar Kurnool (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 2, 2026 at 5:47 PM IST

|

Updated : March 2, 2026 at 7:54 PM IST

3 Min Read
Choose ETV Bharat

Vijay Rashmika Visits Nagar Kurnool : స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్‌పేటలో విరోష్‌ జంట సందడి చేసింది. ఇటీవలే రాజస్థాన్‌ ఉదయ్‌పుర్‌లో వివాహబంధంతో ఒక్కటైన విజయ్‌ దేవరకొండ, రష్మిక నూతన దంపతులు కొత్తగా నిర్మించిన ఫాంహౌస్‌లో సత్యనారాయణ వ్రతం చేసి పెళ్లివిందు చేశారు.

స్వగ్రామంలో సందడి చేసిన విరోష్ జంట : వివాహబంధంతో ఒక్కటైన విజయ్‌ దేవరకొండ రష్మిక దంపతులు నాగర్‌కర్నూల్ జిల్లాలో సందడి చేశారు. 32 ఏళ్ల తర్వాత విజయ్‌ సొంతూరు తుమ్మన్‌పేటకు వచ్చిన విరోష్‌ జంటను గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఇటీవలే రాజస్థాన్‌ ఉదయ్‌పుర్‌లో పెళ్లి చేసుకున్న విజయ్‌దేవరకొండ, రష్మికలకు స్థానికులు ఆత్మీయంగా ఆహ్వానం పలికారు.గ్రామ‌స్తులు నూత‌న వ‌ధూవ‌రుల‌కు తెలంగాణ సంప్రదాయ ప‌ద్ధతుల్లో డ‌ప్పు, వాయిద్యాల‌తో ఘన స్వాగ‌తం పలికారు.

సత్యనారాయణ వ్రతం చేసిన విజయ్​, రష్మిక దంపతులు : అంతకుముందు ఫామ్ హౌస్‌లో నూత‌నంగా నిర్మించిన ఇంట్లోకి గృహ ప్రవేశం చేసి, స‌త్యనారాయ‌ణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరందరికీ పెళ్లి విందు ఇచ్చారు. సినీ పరిశ్రమలో రాణిస్తూ రౌడీబాయ్‌గా గుర్తింపుతెచ్చుకున్న విజయ్‌ మూలాలు మరిచిపోకుండా సొంతూరికి రావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సొంతూరితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న విజయ్‌ దేవరకొండ భావోద్వేగానికి గురయ్యారు. ఇక నుంచి తరుచూ ఊరొస్తామన్న ఆయన దేవరకొండ ఫౌండేషన్‌ ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ అందిస్తామని ప్రకటించారు.

సోషల్​మీడియాలో ఫోటోలు వైరల్ : విజయ్, రష్మికతో కలిసి ఫామ్ హౌస్‌లో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ నెల 4న హైదరాబాద్‌లో జరిగే గ్రాండ్ రిసెప్షన్‌ వేడుకకు ఇప్పటికే ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ తారలను విరోష్‌ జంట ఆహ్వానించింది.

"సొంత ఊరిలో అందరికీ భోజనాలు పెట్టాలనేది మా నాన్న కోరిక. నా ఫస్ట్‌ బర్త్‌డేను తుమ్మంపేటలోనే జరుపుకున్నాం. ఈ ఏడాది నుంచి అచ్చంపేట డివిజన్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ ఇస్తాం. 9, 10 తరగతుల్లో ఫస్ట్‌, సెకండ్ ర్యాంకర్లకు స్కాలర్‌షిప్‌లు ఇస్తాం"- విజయ్​ దేవరకొండ, నటుడు

ప్రధాని మోదీకి ఆహ్వానం! : ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజయ్​-రష్మికలు ఇప్పటికే రిసెప్షన్​ ఆహ్వానాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన ఆశీర్వాదాలను తీసుకున్నారు ఈ నవజంట. కేంద్ర హోమంత్రి అమిత్ షాకు కూడా విరోష్ ఆహ్వానం అందించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

సీఎంను వివాహ రిసెప్షన్​కు ఆహ్వానించిన రష్మిక : ఇటీవలే రష్మిక, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెెల 4వ తేదీన హైదరాబాద్​లో జరిగే తమ వివాహ రిసెప్షన్​కు కుటుంబ సమేతంగా హాజరు కావాలని రష్మిక ఆహ్వానించారు. అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్​లో పోస్ట్​ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై ఎక్స్​లో ట్వీట్​ చేశారు. 'సినీ నటి రష్మిక తమ వివాహ రిసెప్షన్​కు ఆహ్వానించారు' అని పోస్టు చేశారు. ఇటీవలే రాజస్థాన్‌ ఉదయ్‌పుర్‌లో విజయ్​, రష్మికల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి మోదీ సహా పలువురు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లుండి హైదరాబాద్​ నగరంలో జరగబోవు వివాహ రిసెప్షన్​కు ఏర్పాట్లు చేస్తున్నారు.

గ్రాండ్ రిసెప్షన్ : అతికొద్దిమంది సమక్షంలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట హైదరాబాద్​లో గ్రాండ్ రెసెప్షన్ పార్టీ ఏర్పాటు చేసింది. మార్చి 04న తాజ్ హోటల్​లో ఈ ఈవెంట్​ జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఈవెంట్​కు టాలీవుడ్, బాలీవుడ్​, శాండల్​వుడ్​కు చెందిన పలుపురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

'విరోష్' వెడ్డింగ్ సెలబ్రేషన్స్ - దేశవ్యాప్తంగా ఫ్యాన్స్​కు అన్నదానం- రష్మిక ట్వీట్!

'విరోష్' పెళ్లి నగల కోసం 10నెలల కష్టం- కిలోల కొద్దీ బంగారంతో 'రాజసం'- ఆ జ్యువెలరీ స్పెషాలిటీ తెలుసా?

Last Updated : March 2, 2026 at 7:54 PM IST