ఆకారమే అదో రకం కానీ చేపే - తీరాల్లో వింత జీవాల ఉనికి
తలపై జల్లెడ లాంటి ఆకారంతో ఎఖనేస్ నాక్రటిస్ - కోనసీమ జిల్లా పాశర్లపూడిబాడవలోని వైనతేయ నదిలో మత్స్యకారుడికి చిక్కిన అరుదైన రకం చేప - రుషికొండ తీరప్రాంతంలో కనిపించిన కలిమొయ్య పాముు

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 30, 2025 at 12:13 PM IST
Variety Fishes Found at Anakapalli and Visakha Marine : సాధారణంగా చేపలు ఎలా ఉంటాయో మనందరికీ తెెలుసు. కానీ మనకు తెలియని చాలా రకాలే ఉన్నాయి. వాటిని చూస్తే కనీసం అవి చేపలు అని కూడా గుర్తించలేం. అదేంటి చేపల్ని గుర్తుపట్టకపోవడమేంటి అనుకుంటున్నారా? అవునండీ నిజం. వింతైన ఆకారాలతో, కొత్త జీవ రాశులను చూసిన అనుభూతి కలుగుతుంది వీటిని చూస్తే. అలాంటి అరుదైన జాతి జలచరాలు ఎన్నో ఉన్నప్పటికీ వేటికవే ప్రత్యేకం. గోదావరి జిల్లాల్లో ఈ ప్రత్యేకమైన చేపల రాకపోకలు సర్వసాధారణమే. కాలానికి అనుగుణంగా వస్తూనే ఉంటాయి. సందడి చేస్తూనే ఉంటాయి. ఈ కోవకే చెందుతాయి కోనసీమ జిల్లా, విశాఖ తీర ప్రాంతాల్లో మత్సకారుల కంటపడిన ఈ జీవాలు. ఇంతకీ వీటి కథేెంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవాల్సిందే.
తిమింగలంతో స్నేహం ఈ 'చూష' చేపకు : ఈ చేపకు తలపై జల్లెడలా ఉంటుంది. ఈ చేపను మత్స్యకారులు 'చూష' లేదా 'బిళ్ల' చేపలని పిలుస్తారు. వీటి శాస్త్రీయనామం ఎఖనేస్ నాక్రటిస్. వీటి చర్మంపై గరుగ్గా ఉన్న జల్లెడలాంటి భాగం సాయంతో ఇవి తిమింగలాల వంటి పెద్ద చేపలకు అతుక్కుపోతాయి. ఈ స్వభావంతోనే అవి తమ జీవిత కాలాన్ని పెంచుకుంటాయి. అంతే కాకుండా అవి అతుక్కున్న తిమింగలాలతో పాటే వెళుతూ ఏ మాత్రం కష్టపడకుండా అవి తినగా వదిలేసిన ఆహారాన్ని ఆరగిస్తుంటాయి ఈ చూష చేపలు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడిబాడవలోని వైనతేయ నదిలో మత్స్యకారుడు అంకాని సత్యనారాయణ (బుజ్జి) వలకు సోమవారం ఈ అరుదైన చేప చిక్కింది.

కలిమొయ్య చిక్కింది - తీరం చేరేలోపే చచ్చింది : రుషికొండ తీరప్రాంతాల్లోని మత్స్యకారులకు చారలతో విభిన్నంగా కనిపించిన కలిమొయ్య పాములు అని పిలుచుకునే జీవరాశి చిక్కింది. ఈ చేపను మత్స్యకారులు కలిమొయ్య పాములు అని పిలుచుకుంటారు. శాస్త్రీయంగా వీటిని లెపర్డ్ మోరే ఈల్‌గా పిలుస్తారని విశాఖ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) ప్రధాన శాస్త్రవేత్త డా. కేకే జోయీ తెలిపారు. ఇవి దాదాపు ఆరేడు అడుగుల పొడవు పెరిగే ఈ కలిమొయ్య పాములు సముద్రంలో చాలా లోపల నివసిస్తాయని ఆయన తెలిపారు. ఇవి ఆహార అన్వేషణలో భాగంగా రాత్రివేళ బయటకు వచ్చే సందర్భాల్లో అరుదుగా వలలకు చిక్కుతాయి అని వివరించారు. రుషికొండ తీరంలో సోమవారం మత్స్యకారుల వలల్లో ఈ జీవులు పడగా తీరం చేరేటప్పటికే మరణించినట్లు తెలుస్తుంది.
అవి జెల్లీఫిష్‌లేనండీ - విదేశాల్లో వీటికి మంచి డిమాండ్!
అప్పుడప్పుడూ వింత జీవాలు వస్తుంటాయి : గతంలోనూ పశ్చిమగోదావరి జిల్లాలో చేపను పోలిన ఓ వింత జీవి కనిపించిన సంగతి తెలిసిందే. అది నరసాపురం నియోజకవర్గంలోని కేపీపాలెంలో సముద్రం నుంచి ఒడ్డుకు ఇది కొట్టుకువచ్చింది. సొర చేప ఆకారాన్ని పోలి ఉన్న ఈ జీవి రెండ్రోజులు సముద్ర పోటు అధికంగా ఉండటంతో అలల ఉద్ధృతికి బయటకు వచ్చినట్లు గతంలోనే సంబంధిత అధికారులు తెలిపారు. అది తీరానికి చేరడంతో దీనిని చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే వారు దానిని సముద్ర అలల్లోకి తీసుకెళ్లి వదిలారు. అది ఈదుకుంటూ లోపలికి వెళ్లిపోయింది. ఈ వింత జీవిపై భీమవం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆచార్యులు మట్లపూడి సత్యనారాయణ స్పందించారు. ఇది సొర చేపను పోలిన తిమింగలం జాతి క్షీరదమని అన్నారు. ఇది చేప కాదని జంతువని చెప్పారు.
'సేమ్ టు సేమ్' కానీ పులస కాదు - డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు

