ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకున్న ఉమెన్ సేఫ్టీ వింగ్ - చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీకి తరలింపు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకున్న ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు -కోర్టు అనుమతితో ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీలోకి తీసుకున్న అధికారులు - ఉదయ్ కృష్ణారెడ్డిని రెండు రోజుల కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు

Published : August 5, 2026 at 7:01 PM IST
|Updated : August 5, 2026 at 10:51 PM IST
Trainee IPS Uday krishnareddy Case Update : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్టారెడ్డిని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి బుధవారం సాయంత్రం కస్టడీకి తరలించారు. ఉదయ్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. పోలీస్ కస్టడీలో పలు అంశాలపై అతడిని ప్రశ్నించే అవకాశం ఉంది.
పోలీసు కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు : అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డిపై నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణలో భాగంగా నిందితుడు ఉదయ్‌కృష్ణారెడ్డిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని అత్తాపూర్ పోలీసులు కోర్టును కోరగా, న్యాయస్థానం ఆ అభ్యర్థనను ఆమోదించింది. దీంతో గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఈ కస్టడీలో కేసుకు సంబంధించిన కీలక అంశాలపై ప్రశ్నించి, అవసరమైన ఆధారాలను సేకరించనున్నట్లుగా సమాచారం. కస్టడీ విచారణ అనంతరం నిందితుడిని తిరిగి కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇదీ కేసు నేపథ్యం : హైదరాబాద్ నగరంలోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై శిక్షణ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై జులై 18న అత్తాపూర్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. తనకు ఉదయ్ కృష్ణారెడ్డి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించాడని, తన సెల్‌ఫోన్ లాక్కును పాస్వర్డ్ చెప్పాలని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఉదయ్‌పై పలు సెక్షన్లకింద కేసు నమోదు చేశారు.
మరోవైపు తనపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలు అవాస్తవమంటూ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఇన్‌స్టా వేదికగా కొద్దిరోజుల క్రితం పోస్టు చేశారు. చట్టంపై, న్యాయస్థానాలపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని, న్యాయం గెలుస్తుందని అతడు పేర్కొన్నారు. అనంతరం మోతీనగర్‌లో ఉన్న బంధువుల నివాసానికి వచ్చిన ఉదయ్ కృష్ణారెడ్డి మద్యం సేవించి అపస్మారక స్థితికి వెళ్లాడు. కానీ అంతకు ముందు ఆత్మహత్యాయత్నం చేసి, ఆస్పత్రి పాలైనట్లుగా ప్రచారం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఉదయ్, గత నెల 22వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు.
కేసు విచారణలో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. కానీ నిందితుడు తెలిపిన రెండు అడ్రస్లలోనూ అతడి ఆచూకీ లభించలేదు. మొబైల్ కూడా స్విచ్చాఫ్ వస్తోందని పోలీసులు ఇటీవల తెలిపారు. దీంతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు కొద్దిరోజుల క్రితం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించారు.
ఉదయ్ కృష్ణారెడ్డికి మరో మహిళతోనూ సన్నిహిత సంబంధం - గదిలో లవ్ లెటర్స్ లభ్యం!
మహిళా ఐపీఎస్‌పై దాడి జరిగినట్లు నిర్థారణ - శిక్షణ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్

