ETV Bharat / state

రన్నింగ్​లో ఊడిపోయిన స్కూల్​ బస్సు టైర్లు - 30 మంది విద్యార్థులు సురక్షితం

న్యూ వికాస్ ప్రైవేట్ స్కూల్ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం - ఒక్కసారిగా ఊడిపోయిన బస్సు వెనుక భాగంలోని రెండు టైర్లు - ప్రమాదంలో తప్పిన ప్రాణ హాని నష్టం

Two Tires of Private School Bus Were Blown on Road in Pulivendula
Two Tires of Private School Bus Were Blown on Road in Pulivendula (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 6, 2026 at 2:20 PM IST

1 Min Read
Choose ETV Bharat

Two Tires of Private School Bus Were Blown on Road in Pulivendula: కడప జిల్లా పులివెందులలో ప్రైవేట్ స్కూల్ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మార్కెట్ యార్డ్ సమీపంలో "న్యూ వికాస్" ప్రైవేట్ బస్సు వెనుక భాగంలోని రెండు టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి. దీంతో బస్సు అదుపు తప్పిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటన తీవ్ర భయాందోళనకు గురి చేసింది.

ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు: స్కూల్ బస్సుల ఫిట్‌నెస్, నిర్వహణపై తగిన పర్యవేక్షణ లేకపోవడమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని, విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం తగదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్లపై తిరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

30 మంది విద్యార్థులు - ఒక్కసారిగా ఊడిపోయిన బస్సు వెనుక టైర్లు (ETV Bharat)

తనిఖీలు తప్పనిసరి: అలాగే జిల్లాలోని అన్ని ప్రైవేట్ స్కూల్ బస్సులపై ప్రత్యేక ఫిట్‌నెస్ తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదానికి గల అసలు కారణం, అలాగే బస్సు ఫిట్‌నెస్ పరిస్థితిపై అధికారుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మెకానికల్ కండిషన్: సాధారణంగా స్కూల్​ బస్సులకు గానీ మరే ఇతరవాటికైనా బ్రేకులు, స్టీరింగ్, మరియు టైర్ల పరిస్థితి బాగుండాలి. రన్నింగ్‌లో ఉండగా టైర్లు ఊడిపోవడం వంటి ప్రమాదాలు జరగకుండా నిరంతరం తనిఖీ చేయాలి.

పెళ్లింట విషాదం - ప్రాణం తీసిన కొబ్బరిబొండం

కంభంలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి