టీటీడీ బోర్డు ధర్మకర్తల మండలి సమావేశం - రూ.5,456.26 కోట్ల వార్షిక బడ్జెట్‌కు ఆమోదం
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం - వార్షిక బడ్జెట్‌తో పాటు పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపిన బోర్డు -రూ.5,456.26 కోట్ల వార్షిక బడ్జెట్‌కు ఆమోదం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 28, 2026 at 7:14 PM IST
|Updated : February 28, 2026 at 8:51 PM IST
TTD BOARD MEETING KEY DECISIONS : తిరుమల శ్రీవారి ఆలయ వార్షిక బడ్జెట్ రూ.5,456.26 కోట్ల ప్రతిపాదనకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. వార్షిక బడ్జెటుతో పాటు భక్తుల సౌకర్యార్థం పలు కీలక నిర్ణయాలను మండలి సమావేశంలో తీసుకున్నారు. సమావేశ అనంతరం బీఆర్ నాయుడు ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు.
టీటీడీ పరిధిలోని విద్యా సంస్థలకు రూ.118 కోట్ల కేటాయించామన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారి ముడుపు పథకం అమలు చేస్తామన్న బీఆర్ నాయుడు తిరుమల తిరుపతిలో శ్రీవారి ముడుపుల కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీవారి హుండీలో విరాళాలను సులభతరం చేయడానికి శ్రీవారి ముడుపు పథకం దోహదపడుతుందన్నారు. రూ.120 కోట్లతో అత్యంత ఆధునిక వంటశాల నిర్మాణానికి రిలయన్స్ సంస్థకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఒంటిమిట్ట కోదండరాముడి ఆలయం సమీపంలో రూ 21.07 కోట్లతో జాంబవంతుడి ఎత్తైన విగ్రహం ఏర్పాటుతో పాటు హైలాండ్‌ను నిర్మిస్తామన్నారు.
టీటీడీ గోశాల ఆధునికీకరణ : ఒంటిమిట్ట ఆలయంలో కల్యాణోత్సవం హాజరైన భక్తులకు శ్రీవారి రూ.50 లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు. టీటీడీలో భద్రత కోసం 726 మంది నియామకానికి తీర్మానం చేశామన్నారు. టీటీడీ గోశాల ఆధునికీకరణకు రూ 11.82 కోట్ల కేటాయింపుకు ఆమోదం తెలిపామన్నారు. తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం పరిసరాల్లో సిమెంట్ రహదారుల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని ఛైర్మన్ తెలిపారు.
" టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టాం. దేవాస్థానం సంస్థలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన విద్యాను అందించేందుకు రూ.118.8కోట్లు కేటాయించాం. శ్రీవారి ముడుపు అనే కొత్త పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించాం. తిరుమల, తిరుపతిలో కొన్ని కౌంటర్లు ఏర్పాటుచేసి, ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేసిన భక్తులకు రసీదు వస్తుంది. ఆ రసీదుకు హుండీలో వేసే అవకాశం ఉంటుంది. అలాగే రూ.120 కోట్లతో అత్యంత ఆధునికమైన వంటశాఖను ఏర్పాటు చేయాలని రిలయన్స్ కంపెనీ వారు ముందుకు వచ్చారు. దీన్ని వారు ఉచితంగా చేస్తామని హామి ఇచ్చారు." - బీఆర్ నాయుడు, టీటీడీ చైర్మన్
రెగ్యులర్ ఈవోగా: టీటీడీ రెగ్యులర్ ఈవోగా రవిచంద్రను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్‌కుమార్ సింఘాల్ బదిలీ అనంతరం టీటీడీ ఈవోగా రవిచంద్ర అదనపు బాధ్యతలు చేపట్టారు. అప్పుడు సీఎంవో ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర విధులు నిర్వహిస్తున్నారు. కల్తీ నెయ్యి కేసు ఘటనలో సిట్ సిఫారసుల దృష్ట్యా అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయిన నేపథ్యంలో రవిచంద్రకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం పూర్తి స్థాయి టీటీడీ ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అతని స్థానంలో ఈరోజు సీఎస్‌గా పదవీ విరమణ చేసిన విజయానంద్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా విజయానంద్‌కు విద్యుత్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ట్రాన్స్‌కో సీఎండీగానూ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
శ్రీవారి వైద్య సేవకులు - దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే?
భక్తులకు తప్పనున్న ఇబ్బందులు - శ్రీవారికి నాణేలకు బదులుగా ముడుపు పత్రాలు

