అంబులెన్స్‌కు దారి లేదు- అడవిలోనే ప్రసవం
కొండల్లో రహదారులు లేక డోలీ మోతలు- అటవీ మార్గం గుండా నిండు గర్భిణిని తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు, ప్రసవం

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 28, 2026 at 4:47 PM IST
Tribal Women Gave Birth to Baby Boy in Forest Areas While Traveling to Hospital: గిరిజన ప్రాంతాల్లో డోలీ (Doli) మోతల గురించి తెలిసిందే. దశాబ్దాలుగా వారు పడుతున్న వెతలకు అడ్డుకట్ట పడటం లేదు. గిరిపుత్రులు ఆనారోగ్య పాలైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డోలీలోనే ఆస్పత్రికి వెళ్లాల్సిన దుస్థితి తలెత్తింది. వాహన రాకపోకలకు అష్టకష్టాలు పడక తప్పడం లేదు.
మార్గమధ్యలో పురిటి నొప్పులు: కొండల్లో రహదారులు లేక డోలీ మోతలు తప్పడం లేదు. నిండు గర్భిణిని అటవీ మార్గం గుండా తరలిస్తుండగా ప్రసవమైన ఘటన సోమవారం జి. మాడుగుల మండలంలో చోటుచేసుకుంది. పెదలోచలి పంచాయతీ ఇందుగుల గ్రామానికి చెందిన సీదరి దేవి నిండు గర్భిణి. ఆమెకు ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం చేరవేశారు. అంబులెన్సు రహదారి మార్గం ఉన్న ఈదులగరువు గ్రామం వరకు వెళ్లింది. అక్కడ నుంచి సిబ్బంది అటవీ మార్గం గుండా నడుచుకుంటూ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ నుంచి కుటుంబ సభ్యులు, అంబులెన్స్ సిబ్బంది కలిసి డోలీలో తరలిస్తుండగా, మార్గమధ్యలో పురిటి నొప్పులు అధికమయ్యాయి.
అడవి మార్గంలోనే ప్రసవం: అటవీ ప్రాంతంలోనే చుట్టూ చీరను తెరలా కట్టి ప్రసవం చేయించారు. దేవి ఆ అడవి మార్గంలోనే పండంటి మగ బిడ్డకు జన్మనిచింది. వెంటనే తల్లీ, బిడ్డల్నిద్దర్నీ 108లో జి.మాడుగుల ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. సకాలంలో స్పందించిన ఈఎంటీ రామకృష్ణ, ఫైలట్ రామకృష్ణ, ఆశా కార్యకర్త కుమారిలకు గర్భిణి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.
అంబులెన్సులోనే ప్రసవాలు: ఇదిలా ఉండగా మరోవైపు మాతాశిశు మరణాల నివార ణకు, ఆసుపత్రుల్లో ప్రసవాల పెరుగుదలకు జాతీయ ఆరోగ్య మిషన్ చేపట్టిన శిశు జనన నిరీక్షణ కేంద్రాలు సత్ఫలితాలి స్తున్నాయి. గిరిజన ప్రాంతంలో రోడ్డు సదుపాయం లేని గ్రామాల నుంచి గర్భిణు లను డోలీల్లో మోసుకుంటూ ఆసుపత్రులకు తీసుకువచ్చే క్రమంలో మార్గమధ్యలో ప్రస వాలు జరగడం, తల్లి/బిడ్డలో ఒకరు మృతి చెందడం జరిగేవి. అత్యవసర సమయాల్లో 108 వాహనాల్లో తరలిస్తున్న ప్పుడు అంబులెన్సుల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరా వృతం కాకుండా ఆసుపత్రులకు సమీపంలో నిర్మిస్తున్న శిశు జనన నిరీక్షణ కేంద్రాలు దోహ దపడుతున్నాయి.
ప్రభుత్వం పట్టించుకోలేదు గిరిపుత్రులే కదిలారు - మెచ్చగూడలో చందాలతో వారధి నిర్మాణం

