ETV Bharat / state

డీజిల్ బస్సులు కొనం - ఇకపై ఆర్టీసీలో ఎలక్ట్రిక్, సీఎన్జీలే: మంత్రి మండిపల్లి

2031 నాటికి ఆర్టీసీలో మొత్తం ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ బస్సులే ఉంటాయన్న మంత్రి మండిపల్లి - 8,321 ఎలక్ట్రిక్, 500 సీఎన్‌జీ బస్సులు కొనేందుకు ప్రతిపాదనలు

Transport Minister Mandipalli Clarified That RTC Will No Longer Purchase Diesel Buses
Transport Minister Mandipalli Clarified That RTC Will No Longer Purchase Diesel Buses (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 22, 2026 at 7:23 PM IST

2 Min Read
Choose ETV Bharat

Transport Minister Mandipalli Clarified That RTC Will No Longer Purchase Diesel Buses: ఆర్టీసీలో ఇక డీజిల్ బస్సులు కొనుగోళ్లు చేయమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. పర్యావరణ హితంలో భాగంగా 2031 నాటికి ఆర్టీసీలో మొత్తం ఎలక్ట్రిక్, సీఎన్జీ బస్సులే ఉంటాయని వెల్లడించారు. 8321 ఎలక్ట్రిక్, 50 సీఎన్జీ బస్సుల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన్నట్లు తెలిపారు. సోలార్ ప్రాజెక్టులతో రూ.2.87 కోట్ల విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందన్నారు. ఆల్ ఇండియ టూరిస్ట్​ పర్మిట్​పై నడిచే బస్సులకు రిజిష్ట్రేషన్ పన్నును తగ్గించే నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదానికి పెడుతున్నామని మంత్రి వివరించారు.

69శాతం నుంచి 92శాతానికి: ఆర్టీసీ లో గత ప్రభుత్వం కారుణ్య నియామకాల దస్త్రం చూడలేదని దుయ్యబట్టారు. గత 2ఏళ్లలో 1780 మందికి కారుణ్య నియామకాలు చేపట్టామని చెప్పారు. స్త్రీ శక్తి పథకం ద్వారా 73.62 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు చేశారని తెలిపారు. ఈ పథకం కోసం రూ.1,360 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసిందని మండిపల్లి అన్నారు. స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి పథకాలతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ 69 శాతం నుంచి 92 శాతంకు పెరిగిందన్నారు. లాజిస్టిక్స్ ద్వారా ఆర్టీసీ ఆదాయం రూ.227 కోట్లకు చేరిందని రవాణా శాఖమంత్రి స్పష్టం చేశారు.

ఆర్టీసీలో ఇకనుంచి డీజిల్ బస్సులు కొనుగోలు చేయం: మంత్రి మండిపల్లి (ETV Bharat)

'దేశవ్యాప్తంగా వాహనాల డేటా అందుబాటులో ఉండేలా అన్ని రాష్ట్రాల్లోని రవాణాశాఖల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వాహన్ వెబ్​సైట్‌ను తీసుకొచ్చింది. 2024 డిసెంబర్ నుంచి దీనిని రవాణాశాఖకు చెందిన 84 రకాల ఆన్‌లైన్‌ సేవలన్నీ వాహన్‌ ద్వారానే లభించేలా చూస్తున్నాం. వాహన్ వెబ్​సైట్​లో వాహనాల ఫిట్​నెస్, బదిలీ, మార్పులు చేర్పుల ధ్రువపత్రాలిస్తున్నారు ఎక్కడ ఏ విధమైన పొరపాట్లు లేకుండా వాహనదారులు ఉండేలా ఇది కృషి చేస్తుంది. రేపు జరిగే కేబినెట్​లో రవాణా శాఖకు సంబంధించిన మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నాం. ఆర్టీసీలో ఇక డీజిల్ బస్సులు కొనుగోళ్ల ఉండవని దానికి కేబినెట్​ ఆమోదం తెలుపుతుంది.' - మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి

రాష్ట్రాభివృద్ధిని చూసి జగన్‌ ఓర్వలేకపోతున్నారు: మంత్రి మండిపల్లి

పర్యావరణహితమే లక్ష్యంగా - జులై నుంచే ఎలక్ట్రిక్​ బస్సులకు రైట్​ రైట్