'ఏడాదిగా ఆమెతో సన్నిహితంగా ఉన్నా' - ఆత్మహత్యాయత్నానికి ముందు ఉదయ్‌కృష్ణారెడ్డి లేఖ
ఆత్మహత్యాయత్నానికి ముందు లేఖ రాసిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి - బ్యాచ్‌మేట్‌తో ఏడాదిగా సన్నిహితంగా నా వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయంటూ ఉదయ్‌కృష్ణారెడ్డి లేఖ

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 20, 2026 at 7:48 PM IST
Trainee IPS Uday Krishna Reddy Wrote Letter Before Attempting Self Death: జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆత్మహత్యాయత్నానికి ముందు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. ‘‘ట్రైనీ ఐపీఎస్ బ్యాచ్‌మేట్‌తో ఏడాదిగా సన్నిహితంగా ఉన్నా. నా వద్ద వీడియో ఆధారాలు ఉన్నాయి’’ అని అందులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రస్తుతం ఉదయ్‌కృష్ణారెడ్డికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
స్పృహలోకి రావడానికి 24 గంటలు: జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీకి చెందిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆదివారం హైదరాబాద్‌లోని మోతీనగర్‌లో బంధువు ఇంటికి వెళ్లిన ఉదయ్ కృష్ణారెడ్డి ఇవాళ ఉదయం శానిటైజర్ తాగి బలవనర్మణానికి యత్నించాడు. గమనించిన బంధువులు అతడిని ఎస్ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి తరలించగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉదయ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు. ఆయన స్పృహలోకి రావడానికి మరో 24 గంటల సమయం పడుతుందని వెల్లడించారు.
అసలేం జరిగిదంటే : ప్రకాశం జిల్లా ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి 2013లో కానిస్టేబుల్‌గా సెలక్ట్ అయ్యాడు. 2018 వరకు విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. నాలుగుసార్లు విఫలమైనా పట్టుదలతో ఐదోసారి 360 ర్యాంకుతో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఈ అకాడమీలోనే ఓ రాష్ట్రానికి చెందిన మహిళ కూడా ఐపీఎస్‌కు ఎంపికై ట్రైనింగ్‌లో ఉంది.
ఈ సంవత్సరం జూన్ 23 నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి తనకు వాట్సప్ నంబర్‌కి అసభ్యకరమైన సందేశాలు పంపుతూ లైంగికంగా వేధించసాగాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన గౌరవాన్ని దెబ్బతీసేలా అకాడమీలో మిత్రుల ఎదుట తెలుగులో ఇబ్బందికరమైన పదాలతో అసభ్యకరంగా మాట్లాడంతో పాటు వేరే వారితో వివాహేతర సంబంధం అంటగట్టి ప్రచారం చేసి మనోవేదనకు గురి చేశాడన్నారు. అంతేకాక అసభ్యంగా ప్రవర్తిచండంతో పాటు వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి భర్తకు పంపి బెదిరింపులకు గురి చేశాడన్నారు. ఈ క్రమంలో బాధితురాలు శనివారం రాత్రి ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లైంగిక ఆరోపణల కేసు - ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల వ్యవహారం - ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు

