ETV Bharat / state

పొగ మంచు నుంచి నీటి తయారీ - ఇంజినీరింగ్ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణ!

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందుల సమస్య - పొగమంచు నుంచి నేరుగా నీరు తీసుకునే హైడ్రిఫ్ట్‌ తయారీ - పొగమంచు కురిసే ప్రాంతాల్లో నీటి చుక్కల ఆకర్షణ

WATER FROM FOG
పొగమంచు నుంచి నీరు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 1, 2026 at 12:44 PM IST

2 Min Read
Choose ETV Bharat

Young Engineers Produced Water From Fog : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తాగు నీటి ఇబ్బందులు తగ్గించాలనే ఉద్దేశంతో పొగ మంచు నుంచి నేరుగా నీరు తీసుకునే హైడ్రిఫ్ట్​ పరికరాన్ని తయారు చేసినట్లు హైదరాబాద్ నగరానికి చెందిన ముగ్గురు యువ ఇంజినీర్లు డి.రిత్విక్, మహ్మద్‌ ఎజాజ్, హొంసానికా రెడ్డి చెబుతున్నారు. సామ్‌సంగ్‌ సంస్థ దేశవ్యాప్తంగా 'సాల్వ్‌ ఫర్‌ టుమారో' పేరిట నిర్వహిస్తున్న పోటీల్లో సెమీ ఫైనల్‌కు ఎంపికైన ఈ ముగ్గురు నీటి పొదుపుపై ఒక అద్భుతమైన ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. మేడ్చల్‌లోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్​ఈ) చదివిన వీరు ఈ పోటీ గురించి తెలుసుకుని తమ ప్రాజెక్ట్‌ వివరాలను ఆన్‌లైన్‌లో పంపారు.

రూ.8 లక్షల ఫండ్​ : ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 26 టీమ్స్​ తలపడ్డాయి. 'మిస్టిఫై' పేరుతో ఈ ముగ్గురు ఇంజినీర్లు సమర్పించిన ప్రాజెక్ట్‌ సెమీ ఫైనల్‌ పోటీలకు ఎంపికైంది. వీరి ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు సామ్‌సంగ్‌ సంస్థ రూ.8 లక్షల ఫండ్​ను ఇవ్వడంతో పాటు ఒక్కొక్కరికీ ఒక్కో ల్యాప్‌టాప్‌ బహుమానంగా అందజేసింది. రూ.8 లక్షలతో ముగ్గురు యువ ఇంజినీర్లు నీటి పొదుపుపై సరికొత్త, వినూత్నమైన ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు.

WATER FROM FOG
హైడ్రిఫ్ట్‌ (Eenadu)

ఏడాది పాటు శ్రమించి హైడ్రిఫ్ట్‌ : చదువుకునే రోజుల్లో పొగ మంచు నుంచి నేరుగా నీరు తీసుకునే పరికరాన్ని తాము తయారు చేసినట్లు ఈ యువ ఇంజినీర్లు తెలిపారు. తాము చదువుకుంటున్నప్పుడు గాలిలో నుంచి నీరు తీసే పరికరాల గురించి విన్నామని, పొగ మంచుతో కూడా నీటిని ఎందుకు తయారు చేయకూడదు? అన్న ప్రశ్న వేసుకున్నామని చెప్పారు. ముగ్గురం కలిసి ఇంతకు ముందే దీని గురించి ఆలోచించామని, ఏడాది పాటు చాలా కష్టపడి శ్రమించి హైడ్రిఫ్ట్‌ పేరుతో ఒక పరికరాన్ని రూపొందించామన్నారు. సోలార్​ పవర్​తో పని చేసే ఈ పరికరం పొగ మంచులో నుంచి నేరుగా నీటిని తీస్తుందని తెలిపారు. పొగ మంచు కురిసే ప్రాంతాల్లో ఈ పరికరాన్ని ఇన్​స్టాల్​ చేస్తే నీటి చుక్కలను ఆకర్షిస్తుందని వెల్లడించారు. ఈ విధంగా మంచు నుంచి నేరుగా నీటిని తీసి వాడుకోవచ్చుని చెబుతున్నారు.

గ్లోబల్ సీఎస్​ఆర్​ కార్యక్రమం : 'సాల్వ్ ఫర్ టుమారో' అనేది యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను, సామాజిక స్పృహను మరింత పెంపొందించడానికి శాంసంగ్ సంస్థ నిర్వహిస్తున్న ఒక ప్రతిష్టాత్మక గ్లోబల్ సీఎస్‌ఆర్ కార్యక్రమం. మన సమాజంలో రోజువారీగా ఎదుర్కొనే నిజమైన సమస్యలకు STEM-(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) డిజైన్ థింకింగ్ పద్ధతులను ఉపయోగించి సరికొత్త సాంకేతిక పరిష్కారాలను కనుగొనడమే ఈ పోటీ ప్రధాన ఉద్దేశం.

ఈవెంట్​లో దిగిన ఫొటోలు ఇన్​స్టంట్​గా పొందొచ్చు - హైదరాబాదీ యువతుల స్టార్టప్​ ప్రత్యేకతలెన్నో!

జేబులో పట్టే ECG పరికరం- ఈజీగా హార్ట్ మానిటరింగ్- స్వదేశీ స్టార్టప్ సక్సెస్ స్టోరీ ఇదే!