ప్రసాదం నుంచి పాలు, పప్పులు అన్నీ కల్తీయే - పట్టుబడితే విధించే శిక్షలు ఏంటో తెలుసా?
అధిక లాభాలకు కక్కుర్తిపడి ఆహారాన్ని విషతుల్యంగా మారుస్తున్న కల్తీరాయుళ్లు - కల్తీ ఆహార పదార్థాలపై కఠిన చర్యలు - యదేచ్ఛగా కొనసాగుతున్న కల్తీ దందా - పంజా విసురుతున్న ఫుడ్ సేఫ్టీ అథారిటీ


By ETV Bharat Andhra Pradesh Team
Published : February 8, 2026 at 11:53 AM IST
Punishment For Food Adulteration : తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో రసాయనాలు కలిశాయని గత కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. తాజాగా కల్తీ నెయ్యి తయారీలో లబ్సా అనే కెమికల్ వినియోగించినట్లు స్పష్టమవుతోంది. లీనియర్ ఆల్కైల్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ (లబ్సా) అనే రసాయనాన్ని వాషింగ్ పౌడర్లు, వాషింగ్ లిక్విడ్లు, డిష్‌వాష్ లిక్విడ్లు, ఫ్లోర్ క్లీనర్లు, టాయ్‌లెట్ క్లీనర్లు వంటి వాటి తయారీతో పాటు పారిశ్రామిక రంగంలో మిషన్ క్లీనింగ్ ఏజెంట్‌గా, ఆయిల్, గ్రీజు మరకలు తొలగించేందుకు ఉపయోగిస్తారు. పురుగుమందులు, క్రిమిసంహారకాల్లోని రసాయనాలు నీటిలో సమానంగా కలిసేలా చేయటంలో ఎమల్సిఫైయర్‌గా లబ్సాను వాడుతారు. ఇది అత్యంత ప్రమాదకరమైన రసాయనం.
నేటి రోజుల్లో మార్కెట్లో ఏది కొన్నాలన్నా భయం వేస్తుంది. కిరాణా సరకుల దగ్గర నుంచి ఆహార పదార్థాల వరకు ప్రతిదీ కల్తీయే. పప్పుల నుంచి ఉప్పు వరకు కల్తీ రాయుళ్లు దేన్నీ వదిలిపెట్టడం లేదు. ఇటువంటి కల్తీ ఆహారం తింటే కిడ్నీలు, మూత్ర పిండాలు దెబ్బతింటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్న వారిపై న్యాయపరంగా ఏ విధమైనా చర్యలు లేవా? ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఏ ఏ శిక్షలు విధిస్తాయి? అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆహారాన్ని విషతుల్యంగా మారుస్తున్న కల్తీరాయుళ్లు: ప్రస్తుతం కల్తీ కానీ ఆహార పదార్థాలు అంటూ ఏమీ లేవు. కొందరూ కల్తీ రాయుళ్లు అధిక లాభాలకు కక్కుర్తిపడి ప్రతి దాన్నీ విషతుల్యంగా మారుస్తున్నారు. దీంతో ప్రస్తుత రోజుల్లో పాల నుంచి ఉప్పు, పప్పుల వరకు ప్రతిదీ కల్తీమయం అవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో మన ఇంట్లోకి చేరుతూనే ఉన్నాయి. పలు చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కల్తీ ఆహార భద్రతకు సంబంధించిన విషయాల కోసం మన దేశంలో ఆహార భద్రత చట్టాన్ని సైతం తయారు చేశారు. మరోవైపు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కూడా కల్తీ ఆహార పదార్థాలపై పంజా విసురుతుంది.
వీటిపై సంబంధిత అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని సార్లు హెచ్చరించినా యదేచ్ఛగా కల్తీ దందా సాగుతుంది. ఈ విషయాలు ఏమి తెలియని వారు రోజూ ఏదో ఒక రూపంలో కల్తీ ఆహారాన్ని తింటున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు రావడంతో ఆసుపత్రుల చుట్టూ క్యూ కడుతున్నారు.
వీటికి దూరంగా ఎలా ఉండాలి: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. దాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజూ వ్యాయామం, యోగా వంటివి చేయాలి. మంటి జీవనశైలి ఎంత ముఖ్యమో ఆహారాన్ని ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. వీలైనంత పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు వంటి తీసుకుంటే ఎంతో మంచిది. వీటిని స్వయంగా ఇంటి పెరట్లోనే పండించుకోవచ్చు. దీంతో ఆదాయం ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ విధంగా మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసుకుంటే కల్తీ ఆహారానికి దూరంగా ఉండవచ్చు.
కల్తీ ఆహారం విక్రయిస్తూ పట్టుబడితే: ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ యాక్ట్ 2006 ప్రకారం ఎవరైనా కల్తీ ఆహార పదార్థాలను తయారు చేయడం, విక్రయించడం లేదా పంపిణీ చేయడం వంటివి చేస్తూ పట్టుబడితే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. నేర ఆరోపణలపై జరిమానా, శిక్ష విధిస్తారు. లేదంటే కొన్నిసార్లు రెండూ విధించవచ్చు. కల్తీ ఆహార పదార్థాలను తయారుచేసి విక్రయిసే సుమారు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకోవచ్చు. అప్పుడు 6 నెలలు నుంచి 7 ఏళ్ల వరకు శిక్షిస్తారు. కల్తీ ఆహారం తిన్న వ్యక్తి చనిపోతే, కల్తీ చేసిన వ్యక్తికి జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.
నెయ్యి కల్తీ నిజమే - కానీ నేరం నాది కాదు: వైవీ సుబ్బారెడ్డి
కొరియా నుంచి మోనోగ్లిజరైడ్స్ - రసాయన మిశ్రమాలతో తయారుచేసిన కల్తీ నెయ్యే టీటీడీకి సరఫరా

