తెలంగాణకు 'చలి'గండం - రానున్న 3 రోజులు గజగజలు మరింత తీవ్రం
తెలంగాణవాసులను బెంబేలెత్తిస్తున్న శీతల గాలులు - రాత్రి నుంచి ఉదయం వరకు గజగజ వణికిస్తున్న చలి - రానున్న 3 రోజులు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడి

Published : January 11, 2026 at 12:44 PM IST
Cold Increased in Telangana : రాష్ట్రంలో చలి చంపేస్తోంది. శీతల గాలులతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు చలి వణికిస్తుంటే, ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య శీతల గాలులు పంజా విసురుతున్నాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో అత్యల్పంగా 7 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.9 డిగ్రీల సెల్సియస్ ఉండగా, 8 జిల్లాల్లో 10.1 డిగ్రీల నుంచి 11 డిగ్రీల మధ్య, 12 జిల్లాల్లో 10 డిగ్రీల్లోపు, మిగిలిన జిల్లాల్లో 11.1 నుంచి 14 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణవైపు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి దిగువస్థాయి గాలులు వీస్తుండటంతో రానున్న 3 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, 11 నుంచి 15 మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
వాయుగుండం ప్రభావంతో మారిన వాతావరణం : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత కొన్నిరోజులుగా రాత్రివేళల్లో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. మధ్యాహ్న సమయంలోనూ ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ముఖ్యంగా శనివారం పట్టపగలే చలి గజగజ వణికించింది. ఈ చలికి తోడు పొద్దున పూట మంచు దట్టంగా అలుముకుంటోంది. 9, 10 గంటలు దాటుతున్నా మంచు తెర వీడటం లేదు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో శనివారం ఉదయం నుంచి శీతలగాలులు వీస్తుండగా, సూర్యుడు మాత్రం మబ్బుల మాటు నుంచి బయటకు కనిపించలేదు. సాయంత్రానికి పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. రోజంతా చలి తీవ్రత ఉంటుండటంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ 2 జిల్లాల్లో శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా :
- నాగుపల్లిలో 21.0 డిగ్రీల సెల్సియస్
- నాయుడుపేట 21.0 డిగ్రీల సెల్సియస్
- ఇల్లెందు-20.20
- జూలూరుపాడు-19.90
- మద్దుకూరు, పెంట్లం, మల్కారం 19.80
- మందలపల్లి, అంకంపాలెం 19.80
- అశ్వారావుపేట, ఇల్లెందు 24 ఏరియా 19.80
- సుజాతనగర్ 19.70
- పాత కొత్తగూడెం 19.60
- టేకులపల్లి 19.10
- గరిమెళ్లపాడు-18.90
- సీతారామపట్నం, కోయగూడెం- 18.70
- యానంబైలు-18.50
- భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీస్-18.40
- గుండాల-18.30
- లక్ష్మీదేవిపల్లి, ఆళ్లపల్లి-18.20
- ములకలపల్లి-18.0
- భద్రాచలం గోదావరి కరకట్ట-17.80
- బూర్గంపాడు-17.80
- అశ్వాపురం-17.30
- మణుగూరు, దుమ్ముగూడెం-17.10
- మణుగూరు జీఎం ఆఫీస్-17.0
- సత్యనారాయణపురం-16.60
- ఏడూళ్ల బయ్యారం-16.40
- కరకగూడెంలో 16.10 డిగ్రీలు
ఖమ్మం జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా : ఖమ్మం కలెక్టరేట్ 22.90 డిగ్రీలు, కూసుమంచి, పెద్దగోపతి ప్రాంతాల్లో 21.40 డిగ్రీలు, గంగారంలో 21.30 డిగ్రీలు, రావినూతల, సిరిపురం, పంగిడి 21.20 డిగ్రీలు, చింతకానిలో 21.10 డిగ్రీలు, సదాశివునిపాలెం, బచ్చోడు, వేంసూరు, సత్తుపల్లి, వైరా (ఏఆర్‌ఎస్), నేలకొండపల్లిలో 21.0 డిగ్రీలు, మధిర, కొణిజర్ల, నాగులవంచ, ఎర్రుపాలెం, ముదిగొండ, మధిర (ఏఆర్‌ఎస్) ప్రాంతాల్లో 20.90 డిగ్రీలు, తల్లాడలో 20.80 డిగ్రీలు, తిమ్మారావుపేటలో 20.70 డిగ్రీలు, పమ్మి, వైరా, కుర్నవల్లి, ఖమ్మం ఖానాపురం పీఎస్ ప్రాంతాల్లో 20.60 డిగ్రీలు, కల్లూరులో 20.50 డిగ్రీలు, కాకరవాయి, ఏన్కూరు, ఖమ్మం ఎన్నెస్పీ గెస్ట్ హౌస్ ప్రాంతంలో 20.40 డిగ్రీలు, రఘునాథపాలెంలో 20.20 డిగ్రీలు, తిరుమలాయపాలెంలో 20.0 డిగ్రీలు, గుబ్బగుర్తిలో 19.90 డిగ్రీలు, సత్తుపల్లి జేవీఆర్ ఓసీ గని, పెనుబల్లి, బాణాపురం, గౌరారంలో 19.80 డిగ్రీలు, ఖమ్మం ప్రకాశ్‌నగర్‌లో 19.70 డిగ్రీలు, పల్లెగూడెంలో 19.50 డిగ్రీలు, మంచుకొండలో 19.40 డిగ్రీలు, గేట్ కారేపల్లిలో 19.10 డిగ్రీలు, లింగాలలో 18.60 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సరిలేరు మీకెవ్వరు : చలి వణికిస్తున్నా, మంచు కప్పేస్తున్నా తొణకరు, బెణకరు
చలికాలంలో పళ్లు జివ్వుమంటున్నాయా! - అలా ఎందుకవుతుందో తెలుసా?

