ETV Bharat / state

తిరుమలలో పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం- కాబోయే జంటకు స్వల్పగాయాలు

తిరుమలకు వెళ్తున్న పెళ్లి బృందానికి తప్పిన పెను ప్రమాదం- వాహనం ముందు టైరు పంచర్ కావడంతో అదుపుతప్పిన టెంపో- రోడ్డు మధ్యలో ఉన్న బండరాయిని ఢీకొనడంతో ఆరుగురికి గాయాలు

Marriage Vehicle Accident
తిరుమలలో పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 28, 2026 at 1:04 PM IST

1 Min Read
Choose ETV Bharat

Marriage Vehicle Accident : తిరుమలలో వివాహ కార్యక్రమానికి వెళ్తున్న టెంపోకు అర్ధరాత్రి ప్రమాదం జరగ్గా కాబోయే జంట సహా ఆరుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద పోలేరమ్మ గుడి సమీపంలో 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

మచిలీపట్నం నుంచి తిరుమలకు 11 మంది పెళ్లి బృందంతో వెళ్తున్న టెంపో వాహనం ఒంగోలు నుంచి నెల్లూరు వైపు ప్రయాణిస్తుండగా టైరు అకస్మాత్తుగా పగిలిపోయింది. దీంతో అదుపుతప్పిన టెంపో సిమెంట్ దిమ్మను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో టెంపో ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. వీరందరూ కృష్ణా జిల్లా గూడూరు గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. పెళ్లి కుమారుడు శ్రీనివాసరావు, పెళ్లికుమార్తె రోహితకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సింగరాయకొండ పోలీసులు హైవే అంబులెన్స్, 108 వాహనాల్లో క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. టెంపోను క్రేన్ సహాయంతో పక్కకు తీశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం - ఏడుగురు మృతి