అమెరికాలో రోడ్డు ప్రమాదం - ఏపీకి చెందిన దంపతులు మృతి
పది రోజుల క్రితం సొంతూరు పాలకొల్లు వచ్చి వెళ్లిన దంపతులు - తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న కృష్ణకిషోర్ కుమారుడు, కుమార్తె - పదేళ్లుగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కృష్ణకిషోర్

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 5, 2026 at 10:59 AM IST
Telugu Couple Died Road Accident in America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన దంపతులు మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన భార్యాభర్తలు కొటికలపూడి కృష్ణ కిశోర్ (టిన్ను) (45), ఆశ (40) వాషింగ్టన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు, కుమార్తె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. . ఈ మేరకు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందింది.
కృష్ణ కిశోర్ దశాబ్ద కాలానికి పైగా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆ దంపతులు 10 రోజుల క్రితం పాలకొల్లు వచ్చి తిరిగి వెళ్లారు. మార్గంమధ్యలో దుబాయ్‌లో న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. వీరి మృతితో పాలకొల్లులో విషాదఛాయలు అలముకున్నాయి.

