అమరావతిలో మరో కీలక ఘట్టం - ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన
అమరావతి వేదికగా న్యాయ వ్యవస్థలో మరో కీలక అడుగు - పిచ్చుకలపాలెం వద్ద ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన - జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 1, 2026 at 6:00 PM IST
Supreme Court CJI Laid foundation Stone to AP Judicial Academy : రాష్ట్ర రాజధాని అమరావతి వేదికగా న్యాయ వ్యవస్థలో మరో కీలక అడుగు పడింది. పిచ్చుకలపాలెం వద్ద ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. రూ.165 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే అకాడమీ మొత్తం 2.05 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ ఒకేసారి 120 మంది ట్రైనీ జడ్జిలకు శిక్షణ ఇచ్చేలా రూపకల్పన చేశారు. అకాడమీలో 500 సీట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఆడిటోరియంను నిర్మిస్తారు. జీ ప్లస్ 8 అంతస్తులతో భారీ హాస్టల్ బ్లాక్ నిర్మాణం ఉంటుంది. అలాగే అమరావతిలో హైకోర్టు జడ్జిల అతిథిగృహానికి సీజేఐ శంకుస్థాపన చేశారు. రూ.69.4 కోట్ల వ్యయంతో 50 వేల చదరపు అడుగుల్లో దీని నిర్మాణం ఉంటుంది.
శంకుస్థాపన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీఎం చంద్రబాబుతోపాటు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జెకె మహేశ్వరి, జస్టిస్ పిఎస్ నర్సింహ, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి,జస్టిస్ జోయ మాల్య బాగ్చి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఇతర న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, జిఏడి ముఖ్య కార్యదర్శి శ్యామల రావు, మున్సిపల్‌శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అమరావతి అభివృద్ధి పనులపై డాక్యుమెంట్ : అంతకు ముందు జుడీషియల్ అకాడమీ, అమరావతి రాజధాని అభివృద్ధి పనులపై రూపొందించిన ఆడియో వీడియో డాక్యుమెంట్‌ను వీరు తిలకించారు. అనంతరం అమరావతి సీఆర్డీఏ పరిధిలో మొత్తం 6,300 చదరపు గజాల స్థల విస్తీర్ణంలో రూ.69 కోట్ల 40 లక్షల అంచనా వ్యయంతో 50 వేల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం లో గ్రౌండ్ + 3 ఫ్లోర్స్ తరహాలో నిర్మించనున్న అతిథి గృహ భవనానికి శంకుస్థాపన చేశారు. హైకోర్టు భవనం నుంచి కేవలం 1.2 కిలోమీటర్ల దూరంలో ఈ భవనం ఉంటుంది. డి, 25 మీటర్లు మరియు 50 మీటర్ల వెడల్పైన రహదారుల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
ఏపీ జుడీషీయల్ అకాడమీని 165 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తుండగా ఇందులో బ్లాక్ Bలో G+3 అంతస్తులతో అకాడమిక్ బ్లాక్ నిర్మిస్తున్నారు. అలాగే G+8 అంతస్తులతో హాస్టల్ బ్లాక్, G+3 అంతస్తుల్లో ఇండోర్ స్పోర్ట్స్, గెస్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. 120 మంది బ్యాచ్ ఆఫ్ ట్రైనీ జడ్జిలకు సామర్థ్యంతో నిర్మిస్తున్నారు.
120 సీట్లతో కూడిన సెమినార్ హాల్ : మొత్తం భవన విస్తీర్ణం 2.05 లక్షల చదరపు అడుగులు. ఏపీ హైకోర్టు నుంచి ఈ జుడీషియల్ అకాడమి 5.7 కి.మీల దూరంలో 50 మీటర్ల వెడల్పు కలిగిన రహదారి సౌకర్యం కలిగి ఉంది. బ్లాక్ A, G+ 3 అంతస్తులతో కూడిన అడ్మినిస్ట్రేటివ్, అకాడమిక్ బ్లాక్ 500 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియంతో కూడిన స్టేజ్, ఫ్రీ ఫంక్షన్ ఏరియా,120 సీట్లతో కూడిన సెమినార్ హాల్,70 సీట్లతో కూడిన 2 క్లాస్ రూమ్‌లు,70 సీట్లతో మూట్ కోర్ఠు హాల్, 60 సీట్లతో ఫోరెన్సిక్ ల్యాబ్ కలిగి ఉంటుంది.
అంతేగాక 50 సీట్లతో కంప్యూటర్ ల్యాబ్, 48 సీట్లతో లైబ్రరీ, రీడింగ్ రూమ్, డైరెక్టర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, జడ్జిల లాంజ్, ఫ్యాకల్టి రూమ్, కొలాబరేషన్ స్పేస్స్,హెల్తు యూనిట్, క్రెచే సౌకర్యం, 3 మీటర్ల వెడల్పు కలిగిన కారిడార్స్, సెంట్రల్ లిఫ్టు వంటి ఆధునిక సౌకర్యాలు కలిగి ఉంటుంది. బ్లాక్-బి జిప్లస్ 3 అంతస్తులతో కూడిన ఈ భవనంలో రెసిడెన్షియల్, ఎమినీటీస్ సౌకర్యాలు ఉంటాయి. దీనిలో ముఖ్యంగా 108 సీట్లతో డైనింగ్ హాల్, 10 సీట్ల వీఐపీ డైనింగ్ హాల్, పూర్తి స్థాయి సౌకర్యాలతో కూడిన కిచెన్, సర్వీస్ ఏరియా జిమ్, 2 బ్యాడ్మింటన్ కోర్టు హాళ్లు, స్క్వాష్ కోర్టు,టేబుల్ టెన్నిస్ హాల్, యోగా, మెడిటేషన్‌కు ప్రత్యేకంగా మల్టీ పర్పస్ హాల్ కలిగి ఉంటుంది.
బ్లాక్ బి 2 జి ప్లస్ 8 అంతస్తులతో కూడిన భవనంలో జ్యుడీషియల్ అధికారులు, ట్రైనీలకు రెసిడెన్షియల్ ఎకామిడేషన్, 98 సీట్లతో టిఫికల్ హాస్టల్ యూనిట్, 5 సూట్ రూమ్‌లు, ప్రతి అంతస్తులో లాంజ్ స్పేస్, ప్యాంట్రీ యుటిలిటీ సౌకర్యాలుంటాయి. బ్లాక్ బి 3 జి ప్లస్ 1 అంతస్తులతో కూడిన భవనంలో స్విమ్మింగ్ పూల్, పార్కింగ్, సపోర్టింగ్ స్టాఫ్ వసతి సౌకర్యాలు ఉంటాయి. పార్కింగ్ ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించి బేస్మెంట్ పార్కింగ్, రెండు జోన్లలో ద్విచక్ర వాహనాల పార్కింగ్, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ ఉంటాయి. డ్రైవర్స్ డార్మిటరి, రెండు సర్వీస్ క్వార్టర్స్ ఉంటాయి.
తిరుపతిలో కోర్టు భవనాలకు శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
సచివాలయం, హెచ్‌ఓడీ టవర్లలో శాఖలకు స్థలం - సిబ్బంది సంఖ్య ఆధారంగా కేటాయింపు

