ETV Bharat / state

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎబోలా అలర్ట్​ - సుడాన్​ ప్రయాణికుడికి లక్షణాలు, గాంధీకి తరలింపు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ ప్రయాణికుడికి ఎబోలా వైరస్ హిస్టరీ - సూడాన్ నుంచి వచ్చిన ప్రయాణికుడు మహమ్మద్‌కు ఎబోలా వైరస్ హిస్టరీ - గాంధీ ఆసుపత్రికి తరలింపు

Ebola Virus Identified at Shamshabad Airport
Ebola Virus Identified at Shamshabad Airport (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 4, 2026 at 12:02 PM IST

|

Updated : June 4, 2026 at 5:15 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ebola Virus History Identified at Shamshabad Airport : తెలంగాణలో ఎబోలా వైరస్ కేసు బయటపడింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ ప్రయాణికుడికి ఎబోలా వైరస్ హిస్టరీ ఉన్నట్లు గుర్తించారు. సూడాన్ దేశానికి చెందిన మహమ్మద్ అనే ప్రయాణికుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. ఎయిర్​పోర్టులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్‌లో ఈ ప్రయాణికుడికి గతంలో ఎబోలా వైరస్ హిస్టరీ ఉన్నట్లు గుర్తించారు. ఎబోలా లక్షణాలు ఉండటంతో అధికారులు ఆ వ్యక్తిని గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్​కు తరలించారు. శాంపిల్స్​ సేకరించి సీసీఎంబీ పంపించినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఎయిర్​పోర్ట్ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఎబోలా వైరస్ కేసులో రోగికి ఎలాంటి లక్షణాలున్నాయి? ప్రస్తుతం అతని పరిస్థితి ఏవిధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను గాంధీ ఆస్పత్రి హెచ్​వోడీ సునిల్​, నోడల్ అధికారి వంశీ వివరించారు.

ప్రశ్న : సూడాన్ నుంచి వచ్చిన వ్యక్తిలో వ్యాధి లక్షణాలున్నాయి? అతని పరిస్థితి ఎలా ఉంది?
జవాబు : ఈరోజు ఉదయం 35 సంవత్సరాలున్న సూడన్​ నుంచి వచ్చిన ఓ వ్యక్తిని తీసుకొచ్చారు. విమానాశ్రయంలో థర్మల్​ టెంపరేచర్​ 100 ఉందని ఆస్పత్రికి తరలించారు. అతనిని ప్రశ్నిస్తే లక్షణాలు గురించి చెప్పడం లేదు. శరీర ఉష్ణోగ్రత సాధారణంగానే ఉంది. కేవలం స్క్రీనింగ్​లో టెంపరేచర్ ఆధారంగా అతనిని ఐసోలేషన్​లో ఉంచాం. బ్లడ్​, యూరిన్​ శాంపిల్స్​ తీసుకున్నాం. వాటిని హైదరాబాద్​ సీసీఎంబీకి పంపించారు. వారు టెస్టు చేస్తారు. ఇంకా అవసరమైతే నేషనల్​ ఇనిస్టిట్యూట్ ​ ఆఫ్​ వైరాలజీ (ఎన్​ఐవీ) కి కూడా పంపిస్తాం.

ప్రశ్న : పరీక్ష ఇక్కడే నిర్వహిస్తున్నప్పుడు ఎన్​ఐవీకి పంపడం అవసరమా? టెస్టు రిజల్ట్​ ఎప్పుడు వస్తుంది?
జవాబు : రెండు లేబొరేటరీలకు పంపడంతో సరిచూసుకునేందుకు దోహదపడుతుంది. ఫలితాలు సుమారు రెండు మూడు రోజుల్లో రావచ్చు.

ప్రశ్న : టీమ్​ డిప్లాయ్​మెంట్ ఎలా జరుగుతోంది? ప్రత్యేక బృందాలను వినియోగిస్తున్నారా?
జవాబు : సంబంధిత వ్యక్తిని ఐసోలేషన్​లో ఉంచాం. దీనిలో ప్రత్యేక డాక్టర్స్​ టీమ్​, సిస్టర్స్​, ల్యాబ్​ టెస్టింగ్ యూనిట్​ను ఏర్పాటు చేశాం.

ప్రశ్న : రోగికి ఎలాంటి మెడికల్​ కేర్​ ఉంటుంది?
జవాబు : ప్రభుత్వ నిబంధనల ఆధారంగా అనేక జాగ్రత్తలు తీసుకొని సంబంధిత వ్యక్తి రక్తాన్ని టెస్టింగ్​కు పంపించాం. రోగి లక్షణాల ఆధారంగా ట్రీట్​మెంట్ ఇస్తాం.​ ప్రస్తుతానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా సమస్య ఉందని చెబితే దానికి తగిన రీతిలో వైద్యం చేస్తాం.

ప్రశ్న : ఆయన ఏ భాషలో మాట్లాడుతున్నారు? తనతో మీరు ఎలా మాట్లాడుతున్నారు? వ్యాధిలక్షణాలు ఉన్నాయా లేవా అని ఎలా తెలుసుకుంటున్నారు?
జవాబు : సంబంధిత వ్యక్తి భాష మాకు అర్థం కావడం లేదు. అతడు మోకాళ్ల సర్జరీ నిమిత్తం హైదరాబాద్​కు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తనతో మాట్లాడేందుకు బోర్డ్,​ మార్కర్, సైన్​ లాంగ్వేజ్​, గూగుల్​ ట్రాన్స్​లేట్​లను వినియోగించి వివరాలు తెలుసుకున్నాం. మేము అడిగిన ప్రశ్నలకు అతడు సహకరించారు. తనలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేనట్టు తెలుస్తోంది. అయినా బ్లడ్​, యూరిన్​ శాంపిల్స్​ను టెస్టింగ్​కు పంపించాం.

ప్రశ్న : టెస్టింగ్​లో పాజిటివ్​ వస్తే రోగికి ఎన్ని రోజులు ట్రీట్​మెంట్​ ఇచ్చి పంపుతారు? వ్యాధి గ్రస్తునికి స్పెషల్​ రూమ్​ కేటాయిస్తారా?
జవాబు : ప్రస్తుతం పాజిటవ్​ అనే విధంగానే ఐసోలేషన్​లో ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రిపోర్టు వచ్చినా ఇలానే కొనసాగిస్తాం. 21 రోజులు ఐసోలేషన్​లోనే ఉంచుతాం. వ్యాధి లక్షణాల మార్పును ఆధారంగా చేసుకుని ట్రీట్​మెంట్​ ఇస్తాం.

ప్రశ్న : రోగికి తోడుగా వచ్చిన వారిని ఎక్కడ ఉంచారు? ఎలా ఉంచారు?
జవాబు : వారిని డైరెక్టర్​ ఆఫ్ పబ్లిక్​ హెల్త్​ డిపార్ట్​మెంట్​ చూసుకుంటోంది. ఆస్పత్రిలో కేవలం అనుమానిత వ్యక్తినే ట్రీట్​ చేస్తున్నాం. ఒకవేళ వేరే వారికి వ్యాధి సంక్రమిస్తే, ఎలా చేయాలనే నిర్ణయాన్ని పబ్లిక్​ హెల్త్​ డిపార్ట్​మెంట్ చూసుకుంటుంది.

ఆఫ్రికాలో ఎబోలా విజృంభన - వైరస్​ కారణంగా అప్రమత్తమైన భారత్‌

వేసవి కాలం వ్యాధులతో ప్రజల ఇబ్బందులు - క్వారంటైన్‌ చేసి 'మీజిల్స్‌'కు ట్రీట్​మెంట్

Last Updated : June 4, 2026 at 5:15 PM IST