ETV Bharat / state

క్షణాల్లో బీపీ, షుగర్​ చెక్​ చేసే స్మార్ట్​రింగ్, ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారి - ఐఐటీహెచ్​ వేదికగా విద్యార్థుల ఆవిష్కరణలు

ఐఐటీ హైదరాబాద్‌ ఎంఎస్‌ఎంఈ టెక్‌ కనెక్ట్‌ 2026 సదస్సు వేదికగా విద్యార్థుల ఆవిష్కరణలు - క్షణాల్లో బీపీ, షుగర్‌, హార్ట్‌రేట్‌ చెక్‌ చేసే స్మార్ట్‌ రింగ్‌ - పెట్రోల్‌, విద్యుత్‌తోనూ నడిచే వాహనం

STUDENTS INNOVATIONS AT IIT HYD
STUDENTS INNOVATIONS AT IIT HYD (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 1, 2026 at 10:15 PM IST

|

Updated : March 1, 2026 at 11:04 PM IST

4 Min Read
Choose ETV Bharat

Students Innovations MSME Tech Connect 2026 At IITH : నేటి విద్యార్థి భవిష్యత్‌ పురోగతికి దిక్సూచి. తరగతుల్లో నేర్చుకున్న సిద్ధాంతాలకు ప్రయోగశా లల్లో ప్రాణం పోస్తూ విద్యార్థి దశ నుంచే ఆవిష్కర్తలుగా ఎదిగేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఐఐటీ హైదరాబాద్ వేదికగా ఎమ్​ఎస్​ఎంఈ టెక్​ కనెక్ట్​ 2026 సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు, యువ ఆవిష్కర్తలు వినూత్న ప్రాజెక్టులు చేశారు. సామాన్యుల సమస్యలకు సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారం చూపారు. ఏఏ ఆవిష్కరణలు చేశారు? వాటి ప్రత్యేకతలేంటి? మరిన్ని విశేషాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఆలోచింపజేసిన టెక్​కనెక్ట్ సదస్సు : నైపుణ్యానికి పదును పెడితే ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి ఆ ఆవిష్కరణలకు సరైన వేదిక దొరికితే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి."ఈ మాటలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది ఐఐటీ హైదరాబాద్. పుస్తకాల్లోని సిద్ధాంతాలను ప్రయోగశాలలకే పరిమితం చేయకుండా, సామాన్యుడి సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపుతూ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది ఎమ్​ఎస్​ఎంఈ టెక్​ కనెక్ట్​ 2026 సదస్సు. ఇందులో భాగంగా అగ్రిటెక్ నుంచి ఏరోస్పేస్ వరకు ఎడ్ టెక్ నుంచి ఫుడ్ టెక్ వరకు ప్రతి రంగంలోనూ విద్యార్థులు, యువ ఆవిష్కర్తలు తమ మేధస్సుకు పదును పెట్టి పలు నమూనాలు రూపొందించారు.

ఈ పరికరంతో క్షణాల్లో బీపీ చెక్​ చేసేయొచ్చు : సాధారణంగా బీపీ చూడాలంటే చేతికి కట్టు కట్టాలి, షుగర్ లెవల్స్ తెలియాలంటే సూదితో రక్తం తీయాలి. కానీ ఇకపై ఆ అవసరం లేదు. క్షణాల్లో బీపీ, షుగర్‌తోపాటు హార్ట్‌బీట్‌ వంటి ఇతర బాడీ చెకప్‌ చేసి సమగ్ర సమాచారం ఇచ్చేలా వినూత్న ఆవిష్కరణ చేశారు ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఈ యువ ఆవిష్కర్తలు. దీని కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఇదెలా పని చేస్తోందో వివరిస్తోందీ విద్యార్థిని.

"స్మార్ట్​వాచెస్​తో హార్ట్​రేట్​ను తెలుసుకోవచ్చు. అదేకాకుండా బీపీ, షుగర్ లెవల్స్​, శ్వాసక్రియా రేటు లాంటి మరికొన్ని ఫీచర్స్​ను యాడ్​చేస్తూ ఒక డివైజ్​ను రూపొందించాం. దీనికి మొబైల్​ యాప్​ కనెక్ట్ చేసుకుంటే 30 సెకన్లలోనే ఆ వివరాలు తెలుసుకోవచ్చు. ఇది 94శాతం కచ్చితత్వంతో ఫలితాలను ఇస్తుంది. దీనిని పరీక్షించేందుకు కొన్ని ఆస్పత్రులతో కలసి పనిచేస్తున్నాం"-విద్యార్థిని

ప్రస్తుతం మార్కెట్‌లో పెట్రోల్‌తో నడిచే వాహనం లేదా విద్యుత్‌తో నడిచే వాహనం చూ స్తుంటాం. దానికి భిన్నంగా ఒకే వెహికల్‌ను పెట్రోల్‌తో నడిచే బండిలా ఇటు ఈవీగానూ వినియో గించుకునేలా వినూత్న ఆలోచన చేశారు జేఎన్​టీయూ హైదరాబాద్‌ విద్యార్థులు. పాత బండిలో వీరు రూపొందించిన ఇంజిన్‌ను అమర్చి విజయవంతంగా నడిపిస్తున్నారు. పాత స్కూటీకి బ్యాటరీ అమర్చి ప్రయోగాత్మకంగా సఫలం అయ్యారు. ఎప్పుడైనా పెట్రోల్‌ అయిపోయి అకస్మాత్తుగా బండి ఆగిపోతుందన్న భయాన్ని పోగొడుతున్నారు.

ప్లాస్టిక్​ వ్యర్థాలతో మన్నికైన రహదారి : పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు చెక్ పెడుతూ వరంగల్ సుమతి రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో మన్నికైన రహదారిని రూపొందించారు. సాధారణ సిమెంట్, కంకర మిశ్రమంలో 10 శాతం ప్లాస్టిక్‌ను జోడించి ఈ వినూ త్న రోడ్డును నిర్మించారు. ఇవి సాధారణ రోడ్ల కంటే ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయని చెబుతున్నారు.

పరిశ్రమల నిర్వహణను సులభతరం చేస్తూ 'కవచ్' అనే వినూత్న యాప్‌ రూపొందించింది మరో బృందం. కంపెనీల్లో స్టాక్ నిల్వలు, వినియోగాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ రక్షణ కవ చంలా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దారు. డేటా అనాలిసిస్, ఉద్యోగుల జీతాలు, విద్యారంగలోనైతే విద్యార్థుల హాజరు, ఫీజుల వివరాలు సులువుగా తెలుసుకోవచ్చని సూచిస్తున్నారు. యూజర్లకు మాత్రమే ప్రత్యేక యాక్సెస్ ఉండటం వల్ల డేటా భద్రతకు ఈ యాప్‌ పెద్దపీట వేస్తోంది.

ట్రాఫిక్ పార్కింగ్ కష్టాలకు చెక్ పెట్టే మెరీన్ కార్ పార్కింగ్ : ట్రాఫిక్, పార్కింగ్ కష్టాలకు పరిష్కారంగా 'మెరీన్ కార్ పార్కింగ్'ను ఆవిష్కరించారు ఎన్‌ వీ రమణ. తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు నిలిపేలా వర్టికల్‌ పార్కింగ్ విధానాన్ని అందుబా టులోకి తెచ్చాడు ఒక కారు పై అంతస్తులో మరో కారు పార్క్ చేసి స్థల వృథాను అరికడుతున్నా డు. దివ్యాంగులతో పాటు పోలియో, డయాబెటిస్‌ వంటి రోగులకు ఉపయోగపడేలా త్రీడీ ప్రింటిం గ్‌ పరికరాలు తయారుచేస్తోంది హైదరాబాద్‌ యాడ్వైస్‌ స్టార్టప్‌ సంస్థ. తక్కువ ఖర్చుతో కృత్రిమ శరీర భాగాలను రూపొందించి కోల్పోయిన భాగాలను తిరిగి పొందే అనుభవం కలిగిస్తున్నారు.

దిల్లీలో పెరిగిపోతున్న పంట వ్యర్థాల కాల్చివేత, కాలుష్య సమస్యకు చెక్‌ పెట్టేలా వినూత్న ఆలోచన చేసింది బైహోం బిల్డ్‌ స్టార్టప్‌. వరి పంట వ్యర్థాలను ఉపయోగించి నాణ్యమైన స్టైలిష్‌ ఫర్నీ చర్‌ను రూపొందిస్తోంది. ఇప్పటికే దిల్లీ, బెంగళూరులో ఫర్నీచర్‌ తయారీ కేంద్రాలను ఏర్పాటు చే శారు. పంట వ్యర్థాలను కాల్చకుండా తిరిగి వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోందీ సంస్థ. ఇలాంటి ఆవిష్కరణ ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ బయటపడుతుంది. దీని ద్వా రా వారి ఆలోచనలో ఉన్న ప్రోటో టైప్ కాస్త కంపెనీల వైపు అడుగులు వేస్తోంది. ఇక్కడ ప్రదర్శించిన స్టాల్స్ లో ఆయా కంపెనీలు అనుసంధానం చేసుకోవడం ద్వారా పేటెంట్లు పొందే అవకాశం కూడా ఉంది.

YUVA : మహిళల భద్రతకు దియా యాప్‌ - డేటా డిజిటలైజేషన్ సమస్యకు పరిష్కారంగా చిట్టి ఏఐ

చదివింది పదో తరగతే - ఆవిష్కరణలు మాత్రం అద్భుతం

Last Updated : March 1, 2026 at 11:04 PM IST