ETV Bharat / state

'కంటికి కునుకే కరవై అనారోగ్యాలకు చేరువై' - కొంపముంచుతున్న స్క్రీన్​ టైం

అర్ధరాత్రైతే గానీ నిద్రపోనీ విద్యార్థులు, ఉద్యోగులు - ఒత్తిడి పేరుతో సమయం పాటించకుండా ఫోన్​, కంప్యూటర్ వాడకం - 8 గంటలు నిద్రపోని వారిలో తగ్గుతున్న శారీరక సామర్థ్యం

Insomnia Problem
Insomnia Problem (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : July 6, 2026 at 1:23 PM IST

2 Min Read
Choose ETV Bharat

Insomnia Problem : ప్రస్తుత రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు వేధిస్తున్న సమస్య 'నిద్రలేమి'. సరిపడ నిద్రలేక స్కూల్​, కాలేజీ, ఆఫీస్​లలో కునుకుపాట్లకు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశోధనల ప్రకారం 8 గంటల కంటే తక్కువగా నిద్రపోతున్న వారిలో శారీరక సామర్థ్యం తగ్గిపోతున్నట్లుగా గుర్తించారు. విద్య, ఉద్యోగం, వ్యాపారాలు, కుటుంబపరమైన, ఇతర సమస్యలతో ఒత్తిడికి గురవుతున్నవారు నిద్రకు దూరమవుతున్నారు. అనారోగ్యానికి చేరువవుతున్నారు. దీనికి తోడు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు మొబైల్​ ఫోన్​ వినియోగం పెరిగిపోయింది. సోషల్ మీడియా, రీల్స్​లో చూడడంలో నిమగ్నమై నిద్రపోవడం మర్చిపోతున్నారు. పగలు, రాత్రి లేకుండా సెల్​ఫోన్​ను చూస్తూనే ఉంటున్నారు.

కనురెప్పలు వాల్చేది అర్ధరాత్రి ఒకటి తర్వాతే : ఇటీవల ఉన్నత విద్యనభ్యసించే 250 మంది విద్యార్థులు నిద్ర అలవాట్లను అంతర్జాతీయ మానసిక వైద్య నిపుణుల బృందం రెండు నెలల పాటు పరిశీలించింది. 90 శాతం మంది కనురెప్పలు వాల్చేది అర్ధరాత్రి ఒంటి గంట తర్వాతేనని తేలింది. విద్యార్థులు మొబైల్​కు రాత్రి వేళల్లో అతుక్కోవడం గమనించారు. ఉమ్మడి జిల్లాలోనూ నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

మీకు హాయిగా నిద్రపోవాలంటే ఇవి చేయండి :

  • మీ బెడ్​రూంలో టీవీ, ఫోన్​, ల్యాప్​టాప్​ వినియోగించకూడదు.
  • మొబైల్​ను అవసరం కోసం వాడాలి తప్ప అనవసరంగా వాడకూడదు.
  • ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఒకరోజు ఏదైనా కారణం వల్ల నిద్ర ఆలస్యమైతే మరుసటి రోజు ఎప్పటిలా సమయానికి నిద్రపోవాలి. దీనివల్ల మెదడులో ఉత్పత్తయ్యే మెలటోనిన్​ సమతుల్య స్థాయిలో ఉంటుంది.
  • వ్యాయామం, వేళకు ఆహారం తినడం, యోగా, ధ్యానం చేయడం మంచిది. రూంలో గాలి, వెలుతురు రెండు సమంగా ఉండేలా చూసుకోవాలి.
  • రాత్రిల్లో అధిక ఆహారం తినడం, మద్యం తాగడం వంటివి చేయకూడదు.
  • సాయంత్రం 5 తర్వాత టీ, కాఫీ తాగకపోవడమే మంచిది.
  • మధ్యాహ్నం భోజనం తర్వాత గంటల కొద్దీ రాత్రి వేళల్లో నిద్ర రాకుండా చేస్తుంది.

సెల్​ఫోన్​లో ఎక్కువ సమయం గడిపేవారు నిద్రలేమి తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుంది. పగలు, రాత్రి తేడా లేకుండా ఫోన్​లో గేమ్స్​ ఎక్కువగా ఆడటం, సోషల్ మీడియా చూడటంతో పిల్లలు డిప్రెషన్​లోకి వెళ్తారు. ఎవరైనా సెల్​ఫోన్​కు రాత్రి సమయంలో దూరంగా ఉండటం మంచిది - డాక్టర్‌ భవానిసాగర్, మండల వైద్యాధికారి, నాంపల్లి

రోజుకు ఎంత నిద్ర అవసరమంటే
వయస్సురోజూ నిద్ర (గంటల్లో)
1-3 12-15
3-511-13
5-129-11
12-1510
పెద్దలు 7-8

నిద్రలేమికి 10 కారణాలు ఇవే.. ఈ చిట్కాలు పాటించి హాయిగా పడుకోండి!

ఫోన్​ అధికంగా వాడుతున్నారా? - స్క్రీన్​ టైమ్ అంతకుమించితే నిద్రలేమి సమస్యలు​