ఉపాధ్యాయుడిని కొట్టిన విద్యార్థులు - అసలేం జరిగిందంటే!
స్కూల్ ప్రాగణంలో ధూమపానం చేస్తున్న పిల్లలను మందలించిన టీచర్ - గత నెల 26న బోధనేతర సిబ్బందిపై విద్యార్థుల దాడి - సామాజక మాధ్యమాల్లోకి వీడియో

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 5, 2026 at 12:47 PM IST
|Updated : March 5, 2026 at 3:23 PM IST
Students Attack on Teacher in Krishna District: గురువులను సాక్షాత్తూ దైవంతో పోలుస్తారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు అంటే ఎనలేని గౌరవం. వారితో మర్యాద పూర్వకంగా మాట్లడటం, వినయంగా మెలిగేవారు. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు టీచర్‌కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా, ఉపాధ్యాయులపై దాడికి పాల్పడుతున్న ఘటనలు చూడాల్సిన దుస్థితికి వచ్చాం. మరి తప్పంతా పిల్లలదేనా అంటే కాదు, వారి వయసును దృష్టిలో పెట్టుకుని సున్నితంగా మందలించాల్సింది పోగా విద్యార్థుల తప్పులను భూతద్దంలో చూసి వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయులూ లేకపోలేదు. అయితే తరగతి గదిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండాగా మందలించాడన్న కారణంతో టీచర్ కొట్టారు పిల్లలు. ఎవ్వరు ఆపినా ఆగకుండా పొత్తి కడుపులో పిడిగుద్దులు కురిపించాడు. ఈ ఘటన మన కృష్ణా జిల్లాలోనే జరిగింది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.
ఘటన జరిగింది గత నెలలో: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలోని వీరవల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో బోధనేతర సిబ్బందిపై విద్యార్థులు దాడి చేశారు. విద్యార్థులు స్కూల్ ప్రాగణంలో ధూమపానం చేస్తుండగా మందలించడంతో రెచ్చిపోయి సదరు సిబ్బందిపై దాడికి దిగారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 26న బోధనేతర సిబ్బందిపై జరిగిన దాడి ఘటన కొందరు విద్యార్థుల పెడ ధోరణికి నిదర్శనంగా నిలుస్తుంది. దాడి జరిగి వారమవుతున్నా ఎలాంటి చర్యలు లేకపోవడంతో అసంతృప్తికి లోనైన బాధితులు సంబంధించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా బయటపెట్టారు. దీంతో విద్యాశాఖ దీనిపై విచారణ చేపట్టింది.
అమ్మను అంటారా?: పాఠశాలలో 10వ తరగతి చదవుతున్న ముగ్గురు విద్యార్థులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో రహస్యంగా సిగరెట్లు తాగుతుండటాన్ని గమనించి వారిని మందలించారు. దీనిపై ప్రధానోపాధ్యాయురాలికి, సహచర ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసి, తరగతి గదిలో వారిని హెచ్చరించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి పలుమార్లు సదరు ల్యాబ్ టెక్నీషియన్‌ను పొట్టలో గట్టిగా మోదాడు. దీంతో ఆయన నొప్పి తాళలేక కన్నీటి పర్యంతమయ్యాడు. ఇదే క్రమంలో విద్యార్థులను మందలిస్తూ, దాడి దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్న బోధనేతర ఉద్యోగిని దుర్భాషలాడుతూ, ఆయనపై కూడా దాడికి పాల్పడ్డారు. అయితే వీడియోలో తన తల్లిని తిడుతున్నాడంటూ ఓ విద్యార్థి ఆరోపించడం గమనార్హం. వీరవల్లిలో ల్యాబ్ అసిస్టెంట్‌పై విద్యార్థి దాడి ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు విచారణ చేపట్టారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల దాడికి గల కారణాలను ఆరా తీశారు.
'విరామ సమయంలో మరుగుదొడ్ల వద్ద సిగిరెట్లు తాగినట్లు వచ్చిన ఆరోపణలు, ల్యాబ్ అసిస్టెంట్ రవీంద్ర బూతులు మాట్లాడినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాం. ఘటన జరిగిన 8 రోజుల తర్వాత వీడియోలను బయటకు వదలటం వెనుక ఎవరున్నా చర్యలు తప్పవు. దాడికి పాల్పడిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు బూతులు తిట్టి, వీడియోలు తీసిన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం.' -సుబ్బారావు,డీఈఓ
విద్యాశాఖ విచారణ: గత నెల (ఫిబ్రవరి) 26న ఈ ఘటన చోటు చేసుకోగా, బాధిత ఉపాధ్యాయులు అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పాఠశాలకు వచ్చి ప్రాథమిక విచారణ జరిపిన పోలీసు సిబ్బంది, ముగ్గరు విద్యార్థులను స్టేషన్‌కు పిలిపించి, వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పంపేశారు. దీనిపై ఎలాంటి కేసు వద్దని, విద్యార్థుల భవిష్యత్తు పాడైపోతుందంటూ ఉపాధ్యాయులు, కొందరు నాయకులు, పోలీసులకు చెప్పడంతో విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో రావడంతో విద్యాశాఖ విచారణ చేపట్టింది. డీవైఈవో, ఎంఈవోల ఆధ్వర్యంలోని బృందం పాఠశాలను సందర్శించి ఘటన పూర్వాపరాలను తెలుసుకుంది. పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి వివరాలు సేకరించింది. నివేదికను డీఈవోకు అందిస్తామని అధికారులు తెలిపారు.
కన్న ప్రేమపై కత్తి వేటు - తండ్రిని బలి తీసుకున్న కిరాతక పుత్రుడు
పాటలతో గణితం నేర్పిస్తున్న టీచర్ - ప్రశంసించిన మంత్రి లోకేశ్

