ETV Bharat / state

హైదరాబాద్‌లో రాఖీ జోష్‌ - ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కొనుగోలుదారులు

రాఖీ పండుగ వేళ మార్కెట్లలో సందడి వాతావరణం - దుకాణాల్లో అందుబాటులో ఉన్న రకరకాల రాఖీలు - రూపాయి నుంచి 2 వేల విలువ చేసే డిజైనర్ రాఖీలు - కళకళలాడుతోన్న వ్యాపారం

Rakhi Sales in Hyderabad
దుకాణాల్లో ఉన్న రకరకాల రాఖీలు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 26, 2026 at 8:30 PM IST

|

Updated : August 26, 2026 at 10:10 PM IST

2 Min Read
Choose ETV Bharat

Rakhi Sales in Hyderabad : నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష అంటూ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఉన్న ప్రత్యేకతను చాటుుతుంది రాఖీ పండుగ. ఆడపడుచులు తన సోదరుడి మణికట్టుపై కట్టే రాఖీ, ఇద్దరి మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. రాఖీని కడుతూ తన సోదరుడి దీర్ఘాయువును, శ్రేయస్సును సోదరి కోరుకుంటే బదులుగా జీవితాంతం రక్షణగా ఉంటానని సోదరుడు భరోసా ఇస్తాడు. అంతటి ప్రాముఖ్యతను కలిగిన రాఖీని కొనుగోలు చేసేందుకు కొందరు తమ అభిరుచికి అనుగుణంగా సరికొత్త రాఖీలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ప్రతి వయసు వారికి నచ్చేలా డిజైన్లు : రాఖి పండుగకు ఈ ఏడాది దుకాణాల్లోకి ఎన్నో వెరైటీ కలెక్షన్స్ హైదరాబాద్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చాయి. రూపాయి నుంచి ప్రారంభమయ్యే సాధారణ రాఖీల నుంచి వందలు వేల రూపాయల విలువ చేసే డిజైనర్ రాఖీల వరకు మార్కెట్లో లభిస్తున్నాయి. పిల్లల కోసం కార్టూన్ క్యారెక్టర్లు యువత కోసం ట్రెండీ డిజైన్లు పెద్దల కోసం ముత్యాలు జరీ స్టోన్స్‌తో రూపొందించిన ప్రత్యేక రాఖీలు ఇలా ప్రతి వయసు వారికి నచ్చేలా డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.

రాఖీ పండుగ వేళ మార్కెట్లలో సందడి వాతావరణం (ETV Bharat)

"మేము షాపు ఏర్పాటు చేసి 35 సంవత్సరాలు అయింది. వందల, వేల వెరైటీల రాఖీలు వస్తున్నాయి. రూ.2 నుంచి రూ.2000 వేల రాఖీ వరకూ మా దగ్గర ఉన్నాయి. రాఖీల నాణ్యత మంచిగా ఉంటుంది. రాఖీలు కొనుగోలు చేయడానికి తెలంగాణ, ఏపీ, కర్ణాటక నుంచి వస్తుంటారు. వేలాది మంది కొనుగోలుదారులు వస్తున్నారు" - రాఖీ దుకాణాదారులు

పండుగకు ముందే రాఖీలు కొనుగోలు : రాఖీ పండుగ నేపథ్యంలో హోల్‌సేల్‌ దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా ఉన్నాయి. ఇతర రాష్టాలతో పాటు, రెండు తెలుగు రాష్టాల నుంచి హోల్ సేల్, రిటైల్‌గా కూడా బిజినెస్ కోసం రాఖీలు కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. పండుగకు ముందే రాఖీలు కొనుగోలు చేస్తామని రకరకాలు వెరైటీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని వ్యాపారులు, కొనుగోలుదారులు అంటున్నారు.

వ్యాపారాల్లో జోరు : అన్నాచెల్లెళ్ల ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగ సమీపిస్తున్న వేళ భాగ్యనగరం మార్కెట్లు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. రాఖీ పండుగ నేపథ్యంలో రాఖీ సంబంధిత వ్యాపారాల్లో జోరు పెరిగింది.

"ఇక్కడ షాపింగ్ చేయడానికి కర్ణాటక బార్డర్ నుంచి వచ్చాను. అన్ని షాపుల్లో కరెక్ట్ ధరలు ఉన్నాయి. మేము అనుకున్న దాని కంటే తక్కువ ధరకే రాఖీలు ఇచ్చారు. నాణ్యత కూడా బాగుంది" - రాఖీ కొనుగోలుదారుడు

రాఖీ పండుగ వేళ తీపి ముసుగులో తయారవుతున్న విషం! - కొనే ముందు జాగ్రత్తలు తప్పనిసరి

గణేశుడి కోసం 3.5అడుగుల భారీ రాఖీ- గత 24 ఏళ్లుగా సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న ఫ్యామిలీ!

Last Updated : August 26, 2026 at 10:10 PM IST