ETV Bharat / state

ఉమెన్స్​ డే స్పెషల్​ : రామోజీ ఫిల్మ్​సిటీలో ప్రత్యేక ఆఫర్లు - టికెట్​ ధరల్లో భారీ తగ్గింపు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామోజీ ఫిల్మ్​సిటీలో ప్రత్యేక ఆఫర్లు - మార్చి నెలను అతివలకు అంకితం చేస్తూ మాసోత్సవాలు - నేటి నుంచి మార్చి 31 వరకు ఆఫర్లతో ఫిల్మ్​సిటీని సందర్శించే అవకాశం

Ramoji Film City Women Special Month Celebration
Ramoji Film City Women Special Month Celebration (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 1, 2026 at 10:57 AM IST

2 Min Read
Choose ETV Bharat

Ramoji Film City Women Special Month Celebration : అన్ని రంగాల్లోనూ మహిళలు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని ప్రత్యేక స్థానాన్ని పొందుతున్నారు. రంగమేదైనా తమ ప్రతిభతో అగ్రస్థానాలను సైతం కైవసం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళల స్ఫూర్తితో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామోజీ ఫిల్మ్​సిటీలో మార్చి నెలను వనితలకు అంకితం చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నేటి నుంచి మార్చి 31 వరకు మహిళలకు ప్రత్యేక ఆఫర్లతో ఫిల్మ్​సిటీని సందర్శించేందుకు వీలు కల్పిస్తున్నారు.

ప్రత్యేక ఆకర్షణలు : ఫిల్మ్​సిటీలోని ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ, అన్ని వయసుల మహిళలు సినీ ప్రపంచంలోని వివిధ వినోద, విహార, సినిమాటిక్ వైభవాన్ని ఆస్వాదించవచ్చు. దీనిలో స్టూడియో టూర్​లో అనేక సినిమా సెట్లు చూడవచ్చు. రైడ్స్, సాహసాల నెలవు సాహస్​ సందర్శన, లైవ్​ షోలు, సీతాకోకచిలుకల గార్డెన్, వర్చువల్​ షాట్​, అలరించే పక్షుల పార్కు, మోషన్​ క్యాప్చర్​, మాయాలోక్​ ఇలా ఎన్నో ఆకర్షణలను చూడవచ్చు.

సద్వినియోగం చేసుకోండిలా : రామోజీ ఫిల్మ్​సిటీ మహిళా దినోత్సవ ఆఫర్​లో భాగంగా అన్ని వయసుల స్త్రీలకు ఒకరికి రూ.1111 + జీఎస్​టీ, కనీసం 11 మంది గ్రూప్​గా వస్తే ఒక్కొక్కరికి రూ.999 + జీఎస్​టీతో ప్రవేశ రుసుము ఉంటుంది. గ్రూపులుగా వచ్చి వేడుకలు మరింత ఉత్సాహంగా నిర్వహించుకునేందుకు ఇదే మంచి అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకుని మహిళా మాసోత్సవాల్లో పాల్గొని మరచిపోలేని మధురానుభూతి పొందండి.

మరింత సమాచారానికి : పూర్తి సమాచారం కోసం రామోజీ ఫిల్మ్​సిటీ అధికారిక వెబ్​సైట్​ https://www.ramojifilmcity.com/ ను సందర్శించండి. లేదా 76598 76598కు కాల్ చేయండి.

ఫిల్మ్​సిటీలో మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది : ఫిల్మ్​సిటీలో ఎన్నో అద్భుతాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. సినిమాలను ఏ విధంగా తీస్తారు? ఫిల్మ్​ మేకింగ్​ ఎలా నిర్వహిస్తారు? అనే విషయాలు ప్రత్యక్షంగా ఆస్వాదించవచ్చు. సందర్శకులు ఫిల్మ్​సిటీలోని మాయాలోక్​ను సందర్శించవచ్చు. సినిమా చిత్రీకరణలో జరిగే మాయను ఇది కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. వెండి తెరపై కదలాడుతున్న అద్భుతాల వెనక జరిగే కళా నైపుణ్యాలను, సాంకేతికతలను, సృజనాత్మకతను, దర్శకుల ప్రతిభా పాఠవాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు. ఇక్కడ కార్నివాల్​ పరేడ్​ నిర్వహిస్తారు. దీనిలో కళాకారులు పంచే వినోదం మరో ప్రత్యకతగా ఉంటుంది. సినిమా సెట్లలో మరీ ముఖ్యంగా బాహుబలి సెట్​ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. వీటితో పాటు భాగవతం సెట్​, లైవ్​ షో, జపనీస్​ గార్డెన్​ వంటి వాటిని తిలకించవచ్చు. ప్రత్యేక రైడ్లు, సాహస కార్యక్రమాలు వంటివి ఆస్వాదించవచ్చు.

రామోజీ ఫిల్మ్ సిటీ హాలీవుడ్‌ సినిమాలను గుర్తుచేసేలా గేమ్‌- సరికొత్త హంగులతో రూపకల్పన