ETV Bharat / state

కార్లు, బైక్‌లు ఉన్నా సైక్లింగే ఆరోగ్యం - ఫిట్​నెస్​, లైఫ్​స్టైల్​కు సరికొత్త ట్రెండ్

నేడు అంతర్జాతీయ సైకిల్‌ దినోత్సవం - హైదరాబాద్​లో పదుల సంఖ్యలో సైకిల్‌ క్లబ్‌లు, వేల సంఖ్యలో సభ్యులు - ఓఆర్‌ఆర్‌ వద్ద మాత్రమే ప్రత్యేకంగా సైకిల్ ట్రాక్‌

INTERNATIONAL BICYCLE DAY
CYCLING (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 3, 2026 at 11:22 AM IST

2 Min Read
Choose ETV Bharat

Cycling Tracks in Hyderabad : కొన్నేళ్ల కిందట సామాన్యుడి రవాణా సాధనం సైకిల్‌. ఇప్పుడు సరికొత్త హెల్త్, లైఫ్‌స్టైల్‌కు సైకిల్ సింబల్‌గా మారింది. ఇంటి ముందు ఖరీదైన కార్లు, బైక్‌లు ఉన్నా ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ హైదరాబాద్​ నగరంలోని సాఫ్ట్​వేర్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు సైకిల్‌ హాండిల్​ని పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో పదుల సంఖ్యలో సైకిల్‌ క్లబ్‌లు, వేల సంఖ్యలో మెంబర్స్ ఉన్నారు. సైకిల్‌ క్లబ్‌లలో చేరే సభ్యుల సంఖ్య రోజురోజుకీ ఉత్సాహంగా పెరుగుతోంది. సైక్లింగ్‌ చేయడానికి ఔత్సాహికులు పెరుగుతున్నా అందుకు అనుగుణంగా సైకిల్‌ ట్రాక్‌లు మాత్రం అందుబాటులో లేకపోవడం విచారం కలిగిస్తోంది.

భద్రత కరవు : గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్​లోని కేబీఆర్‌ పార్కు చుట్టూ సైకిల్‌ ట్రాక్‌ని నిర్మించారు. ఆ ట్రాక్‌పై సైక్లింగ్‌ చేస్తుంటే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుండటంతో సైక్లిస్ట్‌లు ఆ ట్రాక్‌పై వెళ్లడమే పూర్తిగా మానేశారు. వాహనంలో వెళ్లేవారికి సైక్లింగ్‌ చేసేవాళ్లంటే చిన్నచూపు కారణంగా ఇష్టారీతిన స్పీడ్​తో వెళ్తుంటారు. దీంతో ప్రమాదాలు జరగడం మొదలయ్యాయి. హైదరాబాద్​లో కేవలం ఓఆర్‌ఆర్‌ వద్ద మాత్రమే ప్రత్యేకంగా సైకిల్ ట్రాక్‌ ఉంది.

క్లబ్బులు గ్రూపులు వీకెండ్‌ రైడ్‌లు : సైక్లింగ్‌ను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లేందుకు పలు అసోసియేషన్లు, క్లబ్‌లు చురుగ్గా ముందుకెళుతున్నాయి. వీరంతా గ్రూపులుగా ఏర్పడి వారాంతాల్లో, నెలకోసారి సుదూర ప్రాంతాలకు సైకిల్‌ టూర్లు చేపడుతున్నారు. వారి ఆధ్వర్యంలో వీకెండ్స్‌లో పచ్చదనానికి నెలవైన అనంతగిరి కొండలు, గండిపేట్, హిమాయత్‌సాగర్‌ నుంచి సుమారు 100 కిలోమీటర్ల మేర సైక్లింగ్‌ చేస్తూ ప్రకృతి ఒడిలో సంతోషంగా గడుపుతున్నారు.

సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌ : సైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు గత బీఆర్​ఎస్ ప్రభుత్వం ఐటీ కారిడార్‌ను అనుసంధానిస్తూ నార్సింగి-మంచిరేవుల పరిధిలో ఓఆర్‌ఆర్‌ పక్కన 23 కిలోమీటర్ల మేర 3 లేన్ల సోలార్‌ రూఫ్‌ సైక్లింగ్‌ ట్రాక్‌ను అన్ని రకాల హంగులతో నిర్మించారు. 16 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసేలా రాత్రివేళల్లోనూ సైక్లింగ్‌ చేసుకునేలా దీనిని అత్యాద్భుతంగా డిజైన్‌ చేశారు. ఇటీవల ఈ ట్రాక్‌తో పాటు, సైక్లిస్ట్‌ల భద్రత తీవ్రమైన ప్రశ్నార్థకంగా మారింది. పాదచారులు, రన్నర్స్‌ ఆక్రమిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ ట్రాక్‌ వెంబడి జంతువులు రాకపోకలు సాగిస్తుండటం, మహిళలపై ఆకతాయిల వేధింపులతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

రూ.లక్షల్లోనే ధరలు : హైదరాబాద్ వ్యాప్తంగా చిన్న, పెద్దవి కలిపి సుమారు 250కి పైగా స్పెషల్​గా సైకిల్‌ షోరూమ్‌లు ఉన్నాయి. సగటున 5 నుంచి 7 వేల సైకిళ్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తున్నారు. వాటిల్లో దాదాపు 15 శాతం వరకు ఎలక్ట్రిక్‌ సైకిళ్లే ఉండటం గమనార్హం. రూ.5 వేల నుంచి రూ.లక్షల వరకు వాటి సామర్థ్యాన్ని బట్టి ధరలు ఉంటున్నాయి. ప్రస్తుతం నగరంలో క్రమం తప్పకుండా సైక్లింగ్‌ చేసేవాళ్లు దాదాపు 70 వేల మంది వరకు ఉంటారంటే అతిశయోక్తి కాదు. వారంతా ఆయా ప్రాంతాల్లోని పార్కులు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో సైక్లింగ్‌ చేస్తూ గడుపుతున్నారు. మెట్రో, బస్‌ స్టేషన్ల నుంచి ఐటీ పార్కులకు వెళ్లేలా డెడికేటెడ్‌ సైకిల్‌ లేన్లు నిర్మించాల్సిన అవసరం మాత్రం ఉంది. జీహెచ్​ఎంసీ, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఆక్రమణలకు గురైన పాత సైకిల్‌ ట్రాక్‌లను పునరుద్ధరించాల్సిన అవసరం మాత్రం లేకపోలేదు.

సైకిలింగ్ కోసమని వంద కోట్లు ఖర్చుపెడితే ప్రైవేటు పనులకు వాడుకుంటున్నారు!.

Buffaloes on Cycle Track Viral Video : నానక్​రాంగూడ సైకిల్​ ట్రాక్​పై గేదెల ర్యాంప్​వాక్.. వీడియో వైరల్