ETV Bharat / state

ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు - ఏర్పాట్లపై స్పీకర్‌ సమీక్ష

శాసనసభ్యులకు మూడు రోజులపాటు నిర్వహించనున్నప్రత్యేక క్రీడా పోటీలు - ఏర్పాట్లపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో సమావేశం - సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పైనా దృష్టి

Speaker Ayyanna Patrudu Review on Sports Events for MLAs and Mlcs
Speaker Ayyanna Patrudu Review on Sports Events for MLAs and Mlcs ((speaker ayyanna patrudu x post))
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 19, 2026 at 1:12 PM IST

3 Min Read
Choose ETV Bharat

Speaker Ayyanna Patrudu Review on Sports Events for MLAs and Mlcs: అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, పర్యటనలు, పార్టీ నేతలు, కార్యకర్తలతో తీరిక లేకుండా గడిపే ప్రజా ప్రతినిధులు 20, 30 ఏళ్లు వెనక్కి వెళ్లి క్రీడా పోటీల్లో హుషారుగా పాల్గొననున్నారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెట్టింపు ఉత్సాహంతో ఆటలు ఆడనున్నారు.

శాసనసభ్యులకు 3 రోజుల పాటు ప్రత్యేక క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిరంతరం రాజకీయ ఒత్తిళ్లలో ఉండే ప్రతినిధులకు మానసిక ఉల్లాసాన్ని పంచేలా ఈ క్రీడోత్సవం ఉండాలని, ఏర్పాట్లు పక్కాగా ఉండాలని డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలతో కలిసి ఆయన చర్చించారు.

3 రోజుల పాటు ప్రత్యేక పోటీలు : ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నిర్వహించనున్న ప్రత్యేక క్రీడా పోటీలను ఈ నెల 24, 25, 26 తేదీల్లో జరపాలని నిర్ణయించారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరుగు పందెం, వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, టేబుల్ టెన్నిస్, టగ్ ఆఫ్ వార్, చెస్, టెన్నికాయిట్, త్రో బాల్, షటిల్, బ్యాడ్మింటన్, షాట్ పుట్, క్యారమ్స్, మ్యూజికల్ చైర్స్, పికిల్ బాల్ వంటి క్రీడలను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పైనా దృష్టి సారించారు.

స్పీకర్ అయ్యన్న ఎక్స్ పోస్ట్ : "అసెంబ్లీ ప్రాంగణంలో డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్​ రెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించాం. ఈ సమావేశంలో శాసనసభ్యులు, మండలి సభ్యులకు నిర్వహించనున్న ప్రత్యేక క్రీడా పోటీలు గురించి చర్చించాం. ఈ నెల 24, 25, 26 తేదీల్లో క్రీడా పోటీలు నిర్వహించాలని నిర్ణయించాం. నిరంతరం రాజకీయ ఒత్తిళ్లలో ఉండే ప్రజాప్రతినిధులకు మానసిక ఉల్లాసాన్ని పంచేలా ఈ క్రీడోత్సవం నిర్వహిస్తాం" అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తన ఎక్స్ వేదికగా పోస్ట్​ చేశారు.

సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పైనా దృష్టి : ఈ సమావేశంలో ప్రధానంగా క్రీడల ఎంపిక, విజేతలకు అందించే ట్రోఫీలు, వారికి అందించే ప్రత్యేక క్రీడా దుస్తులపై చర్చించారు. వీటితో పాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పైనా దృష్టి సారించారు. ఈ భేటీలో ప్రభుత్వ విప్‌ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు గణబాబు, కాల్వ శ్రీనివాస్, ఆదిరెడ్డి శ్రీనివాస్, సుందరపు విజయ్ కుమార్, శాప్ చైర్మన్ రవి నాయుడు తదితరులు పాల్గొన్నారు. క్రీడల నిర్వహణ విజయవంతం చేయడానికి వారు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాలు రాజకీయ నాయకులకు రిలీఫ్ కలిగించేలా నిర్వహించాలని, ఇంకా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. శాసససభ, శాసన మండలి సభ్యులు అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని స్పీకర్ కోరారు.

ఇక గత ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులకు 3 రోజుల పాటు క్రీడలు, సాంస్కృతిక పోటీలు నిర్హహించిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం మార్చి 18 నుంచి 20 వరకు 3 రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం ప్రత్యేక క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. ఈ పోటీలు రాజకీయ ఒత్తిడిని తగ్గించడంతో పాటు సభ్యుల్లో ఉన్నచిన్న చిన్న మనస్పర్థలు తొలగి వారి మధ్య స్వేహాభావాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడతాయని ప్రభుత్వం చెబుతోంది.

తగ్గేదేలే - షాట్‌పుట్‌ పోటీలో 'నువ్వా నేనా' అన్న ప్రజాప్రతినిధులు

శాసనసభ్యులకు క్రీడా పోటీలు - ఏర్పాట్లు సమీక్షించిన స్పీకర్​ అయ్యన్న